కొందరు మానసికంగా త్వరగా అలసిపోతారు. చిన్న విషయానికే కుంగిపోతారు. నిత్యం బాధగా కనిపిస్తుంటారు. ఆ క్షణమే నవ్వు, మరుక్షణమే బాధ. పనులపై ఆసక్తి తగ్గిపోతుంది. ఇష్టమైన పనులు కూడా అయిష్టంగానే చేస్తారు. వీటన్నింటికీ కారణం హ్యాపీ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడమే. దీన్నే ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు. ఇది సమపాళ్లలో ఉత్పత్తి అయితే ఆ మనుషులు ఆనందంగా ఉంటారు.మానసిక సమస్యలను తట్టుకునే శక్తి కూడా వస్తుంది. హ్యాపీ హార్మోన్ లేదా ఫీల్ గుడ్ హార్మోన్... దీని అసలు పేరు సెరెటోనిన్. దీన్ని ఉత్పత్తిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తే మీరు త్వరగా డిప్రెషన్, మానసికంగా సమస్యల బారిన పడకుండా ఉంటారు. 


1. చక్కెర పదార్థాలు తక్కువగా తినాలి. శరీరంలో చక్కెర శాతం పెరిగితే సెరెటోనిన్ హార్మోను ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకే డయాబెటిక్ రోగులు త్వరగా మానసిక కుంటుబాటుకు లోనవుతారు. 
2. అమైనో ఆమ్లాలు సెరెటోనిన్ ఉత్పత్తికి చాలా అవసరం. కాబట్టి లేత మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో అమీనో యాసిడ్ ఉంటుంది. కాబట్టి వాటివని ప్రతి రెండు రోజులకోసారి తినాల్సిన అవసరం ఉంది. 
3.బి విటమిన్లు పుష్కలంగా ఉంవడే ఆహారాన్ని తినడం కూడా  చాలా అవసరం.బి విటమిన్లు సెరెటోనిన్ హార్మోన్ ను వృద్ధి చేస్తాయి. చేపల్లో బి12 విటమిన్ అధికంగా లభిస్తుంది. టూనా, సాల్మన్, సార్టినెస్ వంటి చేపల్లో బి12 అధికంగా ఉంటుంది. నట్స్, పెరుగు, సోయా, బాదం పప్పులు, పిస్తాలు, ఆకుకూరలు అధికంగా తింటూ ఉండాలి. 
4. అప్పుడప్పుడు శరీరానికి, తలకు అప్పుడప్పుడు ఆయిల్ మర్ధనా చేయించుకోవాలి. దీని వల్ల స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ విడుదల కాదు. అప్పుడు కూడా సెరెటోనిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. 
5. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం కూడా చాలా అవసరం. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, అరటిపండ్లు,బీన్స్ వంటి వాటిల్లో మెగ్నీషియం మోతాదు ఎక్కువ. మెగ్నీషియం సెరెటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రోజూ ఆకుకూరలు, ఆకుపచ్చని రంగులో కూరగాయలు అంటే అరటికాయ, బీరకాయ, కాకరకాయ, బీన్స్ వంటివి తినడానికి ప్రయత్నించండి. 
6. సూర్య రశ్మి వల్ల కేవలం విటమిన్ డి మాత్రమే అందుతుందనుకుంటారు చాలా మంది. కానీ సూర్య రశ్మి వల్ల సెరెటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. 
7. ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. అనవసరం ఆలోచనలు, ఒత్తిడి వల్ల కార్టిసోల్ హార్మోన్ పెరుగుతుంది. అది ఉత్పత్తి అవ్వకుండా ఉండాలంటే ధ్యానం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి.
8. ఎన్నో రోగాలకు వ్యాయామం చెక్ పెడుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు మానసికంగా చాలా గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో సెరెటోనిన్ ఉత్పత్తి అవుతుంది. 


Also read: వీటి పేరేంటో తెలుసా? తింటే ఎంత రుచిగా ఉంటాయో, అంత ఆరోగ్యం కూడా


Also read: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది