నాన్నది నిస్వార్థ ప్రేమ. పిల్లల కోసం అనునిత్యం ఆలోచించే వ్యక్తి. పిల్లలు గెలిస్తే తానే గెలిచినంతగా సంబరపడిపోతాడు. వాళ్లు ఓడిపోయి కుంగిపోతే భుజం తట్టి ప్రోత్సహిస్తాడు. పిల్లలు జీవితంలో సెటిలయ్యే వరకు, వారికొచ్చే ప్రతి కష్టంలోనూ భాగం పంచుకుంటాడు. ఇలా పిల్లల కోసం కష్టపడే నాన్నకంటూ ఓ ప్రత్యేక దినోత్సం ఉండాలి కదా. ఈ ఆదివారం (జూన్ 19) ఫాదర్స డే. మీ నాన్నను తెలుగు విష్ చేసి మీ ప్రేమను చాటుకోండి. 


1. నా ముందు మీరు కఠినంగా ఉంటారు
బంధువులతో మాత్రం నా గురించి గొప్పగా చెబుతారు
మీ మనసు నాకిప్పుడే అర్థమైంది నాన్న...
హ్యాపీ ఫాదర్స్ డే


2. నేను గెలిచినప్పుడు పదిమందికి చెబుతారు...
నేను ఓడినప్పుడు ‘మళ్లీ గెలుస్తావ్ లే’ అని భుజం తడతారు..
ఓడిన ప్రతిసారి నాలో ప్రోత్సహం నింపే శక్తి మీరే నాన్న. 
హ్యాపీ ఫాదర్స్ డే


3. నా బెస్ట్ ఫ్రెండ్ మీరే
నా మంచి, చెడు, సంతోషం, దు:ఖం
విజయాలు, ఓటములు...సందర్భం ఏదైనా
నా పక్కన నిల్చున్నది మీరే నాన్న
హ్యాపీ ఫాదర్స్ డే


4.ప్రపంచంలో ఏ బిడ్డకైనా మొదటిహీరో నాన్నే.
నువ్వే నా సూపర్ హీరోవి నాన్న
హ్యాపీ ఫాదర్స్ డే


5. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా
ఆ ప్రపంచాన్ని ఖాతరు చేయకుండా వెంట ఉండే వ్యక్తే నాన్న
హ్యాపీ ఫాదర్స్ డే


6. అమ్మ ప్రేమను కళ్లతో చూడగలం... 
అదే నాన్న ప్రేమను గుండెతోనే ఫీలవ్వగలం
హ్యాపీ ఫాదర్స్ డే


7. పిల్లల గెలుపులో తన గెలుపును చూసుకునే వ్యక్తి నాన్న
కొవ్వొత్తిలా కరుగుతూ తన పిల్లలకు వెలుగు పంచే వ్యక్తి నాన్న
పిల్లల కోసం జీవితాన్నే ధారపోస్తున్న నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. 


8. దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న
బిడ్డల భవిత కోసం తపన పడుతున్న నాన్నలందరికీ 
హ్యాపీ ఫాదర్స్ డే


9. నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు
కానీ అపజయం మాత్రం కలగదు
హ్యాపీ ఫాదర్స్ డే


10. కుటుంబానికి చుక్కాని లాంటి నాన్నకి
హ్యాపీ ఫాదర్స్ డే


11. పిల్లల ఆశలే తన ఆయువుగా 
వారి గెలుపే తన లక్ష్యంగా
నిత్య శ్రమించే నిస్వార్థ శ్రామికుడు నాన్న
అలాంటి నాన్నలందరికీ 
హ్యాపీ ఫాదర్స్ డే


12. పిల్లలెక్కే తొలి విమానం తండ్రి భుజాలే
హ్యాపీ ఫాదర్స్ డే


13. నాన్నంటే ఓ ధైర్యం
నాన్నంటే ఓ బాధ్యత
నాన్నంటే భధ్రత
నాన్నంటే భరోసా
అన్నింటికీ మించి త్యాగానికి మారుపేరు నాన్న
హ్యాపీ ఫాదర్స్ డే


Also read: ఫాదర్స్ డే పుట్టుక వెనుక గుండెలు బరువెక్కే చరిత్ర, మనసు కరగాల్సిందే


Also read: ఫాదర్స్ డే రోజు నాన్నకి ఎలాంటి బహుమతి ఇస్తే బావుంటుంది? ఇవిగో కొన్ని ఐడియాలు