Discover India's Most Stunning Road Trips : కొత్త సంవత్సరం దాదాపు వచ్చేసింది. ఈ 2025లో మీరు మంచి మీ గర్ల్​ఫ్రెండ్​తో కలిసి రోడ్ ట్రిప్​కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే మీ కోసం ఇక్కడ ఓ షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ ఏంటి? మాకు కుదిరినప్పుడు వెళ్తాము కానీ.. ఇలా ఎందుకు అనుకోకండి. సంవత్సరంలో మీరు ఏ నెలలో వెళ్లాలనుకున్నా.. ఆ సమయానికి ఏ ప్రదేశం మీకు అనువైనదో చెప్పే షెడ్యూల్ ఇది. అంటే మీరు 2025లో ఏ నెలలో రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా ఇది మీకు పనికొస్తుంది. 

 

జనవరి నుంచి డిసెంబర్ వరకు.. ఏ సమయంలో ఎక్కడి రోడ్ ట్రిప్​కి వెళ్తే బాగుంటుందో.. అవి ఎంత దూరముంటాయో.. ఎన్ని గంటల టైమ్ పడుతుందో.. అక్కడకి వెళ్లి చూడాల్సిన, ఎక్స్​ప్లోర్ చేయాల్సిన పనులేంటో ఇప్పుడు చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ రోడ్ ట్రిప్​ని ప్లాన్ చేసుకునేందుకు రెడీ అయిపోండి. 

జనవరిలో (Manglore to Goa)


జనవరిలో రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటే మీరు మంగుళూరు నుంచి గోవాకు వెళ్లొచ్చు. దూరం 343 కిలో మీటర్ల ఉంటుంది. జర్నీ 6 నుంచి 7 గంటలు ఉండొచ్చు. మీరు వెళ్తూ కార్వార్ బీచ్, పాలోలెమ్, బాగా, కాలన్​ఘాట్ బీచ్​లను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ బీచ్​లలో మీరు సర్ఫింగ్, పారాగ్లైడింగ్ వంటి వాటర్ గేమ్స్ ఆడుకోవచ్చు. గోవా కర్ణాటక బోర్డర్​లో ఉండే దూద్​సాగర్ వాటర్ ఫాల్స్ మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. ట్రెడీషనల్ ఫుడ్ తినొచ్చు. గోవాలోని నైట్​ లైఫ్​ని ఎంజాయ్ చేయవచ్చు. 


ఫిబ్రవరిలో(Bhuj to Dholavira)


ఫిబ్రవరిలో భుజ్ నుంచి ధోలవీర రోడ్ ట్రిప్​కి వెళ్తే మంచి ఎక్స్​పీరియన్స్ ఉంటుంది. ఈ జర్నీ 130 కిలోమీటర్లు ఉంటుంది. 3 గంటల్లో రీచ్ అయిపోవచ్చు. మీరు ధోలవీరలో పురాతనమైన సింధు లోయ నాగరికతను చూడొచ్చు. అక్కడ మ్యూజియాన్ని కచ్చితంగా విజిట్ చేయాలి. అక్కడి కళాఖండాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. కచ్ దగ్గరి ప్రదేశాలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. 


మార్చ్​లో(Munnar to Vagamom)


మార్చ్​ నెలలో మున్నార్ నుంచి వాగమన్ వెళ్లొచ్చు. ఇది స్మాల్ రోడ్ ట్రిప్. కానీ మంచి ఎక్స్​పీరియన్స్​ని ఇస్తుంది. 93 కిలో మీటర్లు ఉండే ఈ జర్నీని రెండున్నర గంటల్లో కంప్లీట్ చేయొచ్చు. ఈ జర్నీలో మీరు రోలింగ్ హిల్స్ చూడొచ్చు. టీ ప్లాంటేషన్స్​ మీకు మంచి రిలాక్సేషన్ ఇస్తాయి. వాగమన్​లో మీరు మెడోస్​ను విజిట్ చేయొచ్చు. అక్కడి రోలింగ్ హిల్స్, పైన్ ఫారెస్ట్​లు చాలా అందంగా ఉంటాయి. ఫోటోలకు అనువైన ప్రదేశం కూడా. వాటర్ ఫాల్స్​తో పాటు ప్రకృతి అందాలను వాగమన్​లో ఆస్వాదించవచ్చు. 


ఏప్రిల్​లో(Jammu to Gulmarg)


ఏప్రిల్ నెలలో జమ్మూ నుంచి గుల్మార్గ్ రోడ్ ట్రిప్ బెస్ట్ ఆప్షన్. ఇది 294 కిలో మీటర్లు ఉంటుంది. ఆరుగంటల్లో చేరుకోవచ్చు. కాశ్మీర్ లోయల్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే మీరు హెవెన్​ నుంచి వెళ్తున్న అనుభూతిని పొందుతారు. గుల్మార్గ్​లో స్కీ రిసార్ట్​ని విజిట్ చేయొచ్చు. ఇది ఇండియాలోనే అత్యుత్తమ స్కీ రిసార్ట్​లలో ఒకటి.  అఫర్వాత్ పర్వతం పై నుంచి అదిరే వ్యూలు చూడొచ్చు. 


మేలో(Gangtok to Gurudongmar)


2025 మే నెలలో మీరు గ్యాంగ్‌టక్ నుంచి గురుడోంగ్‌మార్ వెళ్లొచ్చు. ఇది 180 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5 గంటల్లో వెళ్లొచ్చు. సిక్కిం హిమాలయాల నుంచి డ్రైవ్ చేసుకుంటూ ట్రిప్​ని ఎంజాయ్ చేయొచ్చు. గురుడోంగ్​మార్ సరస్సును చూడొచ్చు. ప్రపంచంలోనే ఎత్తైన సరస్సుల్లో ఇది కూడా ఒకటి. ఈ రోడ్ ట్రిప్​లో మీరు పర్వతాల మధ్య వెళ్తూ.. ఎన్నో అందమై ప్రదేశాలు చూడగలుగుతారు. సమ్మర్​లో రోడ్​ ట్రిప్​కి ఇది బెస్ట్ ఆప్షన్. 


జూన్​లో(Shimla to Kaza)


సిమ్లా నుంచి కాజా వరకు 408 కిలో మీటర్లు ఉంటుంది. దీనిని మీరు జూన్​ నెలలో వెళ్లొచ్చు. రోడ్ ట్రిప్​కి వెళ్తే దాదాపు 10 గంటల సమయం పడుతుంది. హిమాచల్ ప్రదేశ్​లోని హిమాలయాల వ్యూను ఎంజాయ్ చేస్తూ మీరు ఈ జర్నీని కంప్లీట్ చేయొచ్చు. కాజా గ్రామం చుట్టూ అందమైన పర్వతాలు ఉంటాయి. ఇవి మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తాయి. అక్కడి దగ్గర్లోని మొనాస్టరీని కూడా మీరు చూడొచ్చు. 


జూలైలో(Manali to Leh)


జూలై నెలలో మీరు రోడ్ ట్రిప్​ కోసం మనాలి నుంచి లేహ్ వెళ్లొచ్చు. 133 కిలోమీటర్ల ఈ జర్నీ దూరాన్ని చేరుకోవడానికి మీకు 5 గంటల సమయం పట్టొచ్చు. ఈ రోడ్ ట్రిప్​లో మీరు లడఖ్ హిమాలయాల గుండా డ్రైవ్​కి వెళ్తారు. ఇది మీకు బ్యూటీఫుల్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. దగ్గర్లోని లేహ్ ప్యాలెస్​ని మీరు విజిట్ చేయొచ్చు. మౌంటైన్ వ్యూలు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తాయి. అక్కడి దగ్గర్లోని మఠాలను విజిట్ చేసి.. స్థానిక సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు. వెదర్ అనుకూలత కోసం మీరు అక్కడ రెండు రోజులు ఉండాల్సి వస్తుంది. 


ఆగస్టులో(Athirappilly to Valparai)


అతిరపల్లి నుంచి వాల్పరై వెళ్లేందుకు ఆగస్టు అనువైన సమయం. 83 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్ ట్రిప్​ను 2.5 గంటల్లో కంప్లీట్ చేయొచ్చు. పశ్చిమ కనుమల గుండా డ్రైవ్ సాగుతుంది. అక్కడ అతిరపల్లి వాటర్ ఫాల్స్​ని కచ్చితంగా విజిట్ చేయాలి. ఇది ఇండియాలోనే ఎత్తైన జలపాతాల్లో ఒకటి. వాల్పరై హిల్ స్టేషన్​ కూడా మీకు మంచి వ్యూలను అందిస్తుంది. 


సెప్టెంబర్​లో(Bengluru to Kabini)


సెప్టెంబర్​లో బెంగళూరు నుంచి కబిని వెళ్లొచ్చు. 165 కిలోమీటర్ల ఈ జర్నీని మూడున్నర గంటల్లో వెళ్లొచ్చు. ఈ ట్రిప్​లో మీరు కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తే మంచి కిక్ ఉంటుంది. కబినిలోని వైల్డ్ లైఫ్​ మీకు బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. మీరు అక్కడ ఏనుగులు, పులులు, ఇతర వన్యప్రాణులు చూడొచ్చు. కబిని నదిలో బోట్ రైడ్​కి వెళ్లడం మాత్రం అస్సలు మరచిపోకండి. 



అక్టోబర్​లో(Delhi to Jaipur)


ఢిల్లీ నుంచి జైపూర్ రోడ్ ట్రిప్ 277 కిలోమీటర్లు ఉంటుంది. 5 గంటల ప్రయాణముంటుంది. ఈ ట్రిప్​కి వెళ్లాలనుకుంటే అక్టోబర్ మంచి సమయం. రాజస్థాన్​లోని గ్రామీణ ప్రాంతాల మీదుగా ఈ జర్నీ చేయొచ్చు. అంబర్​ ఫోర్ట్​ని విజిట్ చేయొచ్చు. యూనెస్కో గుర్తింపు కూడా ఈ సైట్​కి ఉంది. దగ్గర్లోని హవా మహాల్ కూడా మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. 


నవంబర్​లో(Chennai to Kodaikanal)


నవంబర్​లో లాంగ్​ ట్రిప్​కి వెళ్లాలనుకుంటే చెన్నై నుంచి కొడైకెనాల్ వెళ్లొచ్చు. ఇది 520 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 8 గంటల సమయం పడుతుంది. తమిళనాడులో అందమైన గ్రామీణ ప్రాంతాల మధ్య ఈ రైడ్ చేయొచ్చు. కొడైకెనాల్ సరస్సును కచ్చితంగా చూడాలి. చుట్టూ కొండలు, మధ్యలో నది ఆహ్లాదాన్ని అందిస్తాయి. దగ్గర్లోని బ్రయంట్ పార్క్​ను కూడా విజిట్ చేయొచ్చు. 


డిసెంబర్​లో (Mysoor to Ooty)


మైసూరు నుంచి ఊటీని రోడ్ ట్రిప్ వెళ్తే డిసెంబర్ బెస్ట్ ఆప్షన్. 268 కిలోమీటర్లు ఉండే ఈ రైడ్​ని మీరు 5న్నర గంటల్లో పూర్తి చేయొచ్చు. కర్ణాటక, తమిళనాడు గ్రామీణ ప్రాంతాల మీదుగా అందమైన వ్యూలను చూసుకుంటూ ఈ జర్నీని చేయవచ్చు. ఊటీ సరస్సు మీ మనసు దోచేస్తుంది. దగ్గర్లోని బొటానికల్ గార్డెన్, అదిరే వ్యూలు మీక మంచి ఆహ్లాదాన్ని అందిస్తాయి. 


ఇలా మీరు సంవత్సరంలో ఏ నెలలో రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటే ఆ సమయానికి అనువైన ప్రదేశం తెలుసుకుని వెళ్లొచ్చు. అలాగే ఈ రోడ్ ట్రిప్​కి వెళ్లేముందు.. వెళ్లిన తర్వాత.. ఆయా ప్రదేశాల్లో స్టేయింగ్ కూడా చూసుకుంటే ఎక్కువ సమయాన్ని గడపొచ్చు. 



Also Read : లక్షద్వీప్ వెళ్లడానికి ఆ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి, లేకుంటే వెళ్లలేరు.. బోనస్​గా బడ్జెట్ ఫ్రెండ్లీ టిప్స్