Realtionship Advices : ఈ జనరేషన్లో ప్రేమని కనుగొనడం చాలా కష్టం. ఎందుకంటే వారానికొక డేటింగ్ పద్ధతి మార్కెట్లోకి వస్తుంది. తమ కన్వినెంట్కి తగ్గట్లుగా రిలేషన్ షిప్‌ని మార్చేసుకుంటున్నారు. లేదంటే కొత్త పద్ధతుల్లో ప్రేమించుకుంటున్నారు. కొన్ని డేటింగ్ పద్ధతులు రిలేషన్ షిప్‌ని కాపాడుతుంటే.. మరికొన్ని టైమ్‌పాస్ అనే పదానికి ఆల్ట్రనేటివ్‌గా మారుతున్నాయి. కాలానికి తగ్గట్లుగా ఆధునికంగా మారొచ్చు కానీ.. సంబంధాల విషయంలో పూర్తి ఆధునికత ఉండకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.
ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న రిలేషన్ షిప్ ట్రెండ్లలో బ్యాక్ బర్నర్ రిలేషన్ ఒకటి. అంటే ఓ వ్యక్తి మీతో రిలేషన్లో ఉంటూ.. మరో వ్యక్తితో శారీరకమైన, ఇతర ప్రయోజనాల కోసం రిలేషన్లోకి వెళ్లడం అనమాట. మరింత వివరంగా చెప్పాలంటే.. ప్లాన్ ఏ వర్కవుట్ కాకపోతే ప్లాన్ బికి లైన్ క్లియర్ చేసుకుంటారు అనమాట. ఒకేసారి ఇద్దరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. పెళ్లి తర్వాత ఇలాంటివి చేస్తే అక్రమ సంబంధం అనేస్తారు. పెళ్లికి ముందు ఇలాంటి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తే బ్యాక్బర్నర్ రిలేషన్ అంటారు.
ఉదాహరణకు ఓ వ్యక్తి తనకి గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఉన్నారని చెప్తూనే.. మీతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు అనమాట. అనన్య పాండే హీరోయిన్గా నటించిన కో గయే హమ్ కహా అనే సినిమా ఈ తరహా రిలేషన్షిప్స్ మీదనే సాగుతుంది. ఓ వ్యక్తి తమ లైఫ్‌లో ఉండగా.. మరో వ్యక్తితో శృంగార, ప్రేమ, ఇష్టాలు కలిశాయి అంటూ రిలేషన్షిప్స్ పెట్టుకుని.. తమతో ఉన్నవారిని బాధపెడుతూ ఉంటారు.
మీరు ఇలాంటి రిలేషన్లో ఉన్నా.. మీరు ఏ రిలేషన్లో అయినా మూడో వ్యక్తిగా ఉన్నా.. లేదంటే ఇలాంటి రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నా వెంటనే దానికి ఫుల్స్టాప్ పెట్టేయండి. ఎందుకంటే నిజమైన ప్రేమ దొరకాలంటే.. ఇప్పట్లో చాలా కష్టం. ఇప్పుడనే కాదు.. గతంలో కూడా నిజమైన ప్రేమ దొరకని వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే ఒకరు మిమ్మల్ని ఇష్టపడుతూ.. మీతో నిజాయితీగా ఉంటూ.. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటే మీరు ఇంకొకరితో రిలేషన్షిప్ పెట్టుకోవాలనుకోవడం చాలా మూర్ఖమైన పని. మీరు ఓ వ్యక్తిని ప్రేమించినా.. ప్రేమించకపోయినా మీ లైఫ్‌లో ఒకరు ఉంటే మాత్రం మూడో వ్యక్తి వైపు ఆకర్షితులవడం ఎంత మాత్రము హేయము కాదు అంటున్నారు నిపుణులు.
ప్రధాన కారణం అదే..
కొందరు ఏంటంటే ఓ వ్యక్తితో ప్రేమలో పడిపోయి.. వారితో రిలేషన్లో ఉన్నప్పుడు బోర్‌గా ఫీల్ అవుతారు. అలాంటివారు మరో వ్యక్తివైపు ఈజీగా ఆకర్షితులైపోతారు. ప్రధానంగా ఈ కారణం వల్లే చాలామంది బ్యాక్బర్నర్ రిలేషన్లోకి వెళ్తున్నారని నిపుణులు చెప్తున్నారు. మీరు ఓ రిలేషన్లో ఉన్నప్పుడు మీ పార్టనర్‌కి కట్టుబడి ఉండేలా చూసుకోండి. లేదంటే వారితో కూర్చొని ఏదోక విషయం తేల్చుకోండి. అలా కాకుండా వారితో ఉంటూనే మీరు మరొకరితో సంబంధం పెట్టుకుంటే మీరు ఒకేసారి ఇద్దరిని చీట్ చేసిన వారు అవుతారు.
బ్యాక్ బర్నర్ రిలేషన్ అనేది ఓ ఫాంటసీ ప్రపంచం లాంటిది. ఇది మీ రిలేషన్‌ని చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. సంబంధాల విషయంలో ముందుకు వెళ్లకుండా చేస్తుంది. మీ సమయాన్ని వృథా చేసి.. ఓ ఊబిలో చిక్కుకుపోయే పరిస్థితికి తీసుకువస్తుంది. ఓ వ్యక్తితో మీరు రిలేషన్లో ఉంటూ ఇంకో వ్యక్తిపై మనసు పడడం కరెక్ట్ కాదు. అలాగే రిలేషన్లో ఉన్న వ్యక్తిపై ఉన్న అభిమానాన్ని ప్రేమ అనుకుని వారి మధ్య వెళ్లడం అస్సలు మంచిది. మీ పార్టనర్ మీతో రిలేషన్లో ఉంటూ.. వేరే వారితో ఇతర సంబంధాలు పెట్టుకుంటే మీరు వెంటనే మీ రిలేషన్లో ఏదొక నిర్ణయం తీసుకోవడం మంచిది. లేదంటే అది టాక్సిక్‌గా మారి అనర్థాలకు దారి తీస్తుంది.
Alos Read : 2024లో న్యూ డేటింగ్ ట్రెండ్.. రిస్క్ లేకుండా ఈ రిలేషన్షిప్ ఏదో బానే ఉందిగా