Hidden Dangers of Excessive Drinking : అరేయ్ మావా నేను ఎంత తాగినా మందు కిక్ ఎక్కట్లేదురా అని కొందరు బాధపడితే.. నేను ఎంత తాగినా ఇలా స్టడీగా ఉండగలను అని మరికొందరు గర్వంగా చెప్పుకుంటారు. ఈ రెండిటీలోనూ కామన్ విషయమేమిటంటే.. వీరు మందు ఎక్కువ తాగడమే. ఆల్కహాల్‌ని వివిధ అకేషన్లలోనూ.. రీజన్ ఉన్నా లేకుండా తాగుతూ ఉంటారు. ఆల్కహాల్ తాగడానికి ఉన్న ప్రధాన రీజన్ ఏమైనా ఉందంటే అది కిక్ ఎక్కడమే. ఇంతకీ కిక్ ఎక్కడం మంచిదా? కిక్ ఎక్కపోవడం మంచిదా? నిపుణుల అభిప్రాయమేంటి?
హాబీగా తాగితే..
మేటర్ ఏంటి అంటే మందు ఎంత తాగినా కిక్ ఎక్కదు. చూశావా నేను ఎంత స్ట్రాంగో అనుకుంటారు. ఇదేమి గొప్ప విషయం కాదంటున్నారు నిపుణులు. దీనిని డేజంర్ బెల్గా చెప్తున్నారు. ఆల్కహాల్ అనేది ఓ టాక్సిక్ సబ్‌స్టాన్స్. దానిని మొదట్లో తీసుకుంటున్నప్పుడు కచ్చితంగా కిక్ ఎక్కుతుంది. దానివల్ల మత్తు వస్తుంది. కొందరికి టాక్సిన్ ఎక్కువైతుందిరా అనే చెప్పేలా వాంతులు కూడా అయ్యేలా బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది. ఈ పీరియడ్‌ని మందు హాబీగా ఉండే రోజులని చెప్పవచ్చు.
అలవాటుగా మారిపోతే..
హాబీగా ఎప్పుడో ఓసారి మందు తీసుకుంటే.. బ్రెయిన్ రియాక్షన్ ఇలా ఉంటే.. కంటిన్యూగా మందును తీసుకున్నప్పుడు ఎలా మారుతుందో చూద్దాం. మందును అలవాటుగా మార్చుకున్నప్పుడు బ్రెయిన్ ఇలాంటి రియాక్షన్స్ ఇవ్వడం మానేస్తుంది. మందు అలవాటుగా మారినప్పుడు బ్రెయిన్ సిగ్నల్స్ ఇవ్వదు. దీనివల్ల ఎంత తాగినా కిక్ రాదు. అదేదో గొప్ప విషయంలాగా నాకు స్టామినా చాలా ఎక్కువ అనుకుంటారు. కట్ చేస్తే ఇలా కిక్ ఎక్కకపోవడమనేది ఓ డేంజర్ బెల్గా చెప్తున్నారు నిపుణులు.
ఎక్కువ తాగేస్తే..
మందు ఎంత తాగినా కిక్ రావట్లేదని.. ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. వీటికి మీ బ్రెయిన్ రియాక్ట్ కాకపోయినా మీ బాడీలోని ఇతర భాగాలకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కిక్ రావట్లేదని బీర్ల కౌంట్‌ను, పెగ్‌ల కౌంట్‌ను పెంచేవారు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. బ్రెయిన్‌కి ఎక్కువ మందు తీసుకోవడమనేది అలవాటుగా మారి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుందట. దీనివల్ల కొద్ది రోజుల్లో బ్రెయిన్లో ఉండే చాలా న్యూరాన్లు చచ్చిపోతాయట.
బ్రెయిన్ రియాక్షన్స్
మనం ఏ పని చేయాలన్నా.. బ్రెయిన్లోని న్యూరాన్లే వాటిని చేస్తూ ఉంటాయి. కానీ మందు ఎక్కువ తాగినప్పుడు అవి చనిపోతాయి కాబట్టి.. మీరు చేయాలన్నా.. మీ బ్రెయిన్ వాటికి రియాక్షన్స్ ఇవ్వడం మానేస్తుంది. ఇలా న్యూరాన్లు చనిపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. సరిగ్గా ఆలోచించలేము. పని చేయలేము. కొన్నాళ్లకి మన పని మనం కూడా చేసుకోలేము. బ్రెయిన్లో సమాచారమున్నా.. దానిని ఇతర భాగాలకు చేరవేర్చే న్యూరాన్లు ఉండవు. అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
అది రావడం పక్కా..
ఈ సమస్య పీక్స్‌కి వెళ్లినప్పుడు మానసికంగా డెల్యూషన్స్ పెరుగుతాయి. నిజం నిజంలా అనిపించదు. అబద్ధాలతో ఓ కొత్త ప్రపంచం బ్రెయిన్లో మొదలవుతుంది. రియాలిటీలో చెప్పుకోవాలంటే.. పిచ్చి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇవే కాకుండా లోపలి నుంచి శరీర భాగాలకు కూడా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే.. మీరు ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదంటే అర్థం మీ బ్రెయిన్ మీకు సంకేతాలు ఇవ్వడం మానేసిందని అర్థం. అంతేకానీ మీ స్టామినా పెరిగిందని అర్థం కాదు.
Also Read : సెలబ్రెటీలు పవర్‌లిఫ్టింగ్ చేసేది ఇందుకే.. బెనిఫిట్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే