Oral Health : నోటి ఆరోగ్యం మొత్తం ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకే దంతాల సంరక్షణ ముఖ్యమని చెప్తారు నిపుణులు. దీనిలో భాగంగానే దంతాలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని సూచిస్తారు. అలాగే ఉదయాన్నే బ్రష్ చేసేందుకు ఫాన్సీ టూత్‌పేస్ట్ లేదా మౌత్‌వాష్ చేసుకుంటే పళ్లు స్ట్రాంగ్ అవుతాయని భావిస్తారు. కానీ మీరు ప్రతిరోజూ చేసే కొన్ని అలవాట్లు తెలియకుండానే దంతాలకు హాని కలిగిస్తాయట. అవేంటో.. పళ్లను కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

ఉదయాన్నే కాఫీ తాగడం మొదలుకొని.. బ్రష్ చేసే విధానం వరకు తెలియకుండా ఫాలో అయ్యే కొన్ని అలవాట్లు దంతాలపై నెగిటివ్​గా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు డాక్టర్ ఆశిష్ కక్కర్. ఈ అలవాట్ల వల్ల పళ్లపై నెమ్మదిగా ఎనామిల్‌ పోతుంది. చిగుళ్ల వాపు రావచ్చు. దీర్ఘకాలిక దంత సమస్యలకు కూడా దారి తీస్తాయి. వీటికి సరైన జాగ్రత్త తీసుకోకుంటే మీ పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. మరి నిపుణులు చెప్తోన్న విషయాలు ఏంటో చూసేద్దాం. 

గట్టిగా బ్రష్ చేయడం

గట్టిగా బ్రష్ చేయడం వల్ల దంతాలు బాగా శుభ్రం అవుతాయని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది లాభం కంటే నష్టాన్నే ఎక్కువ ఇస్తుంది. గట్టిగా బ్రష్ చేయడం వల్ల ఎనామిల్ అరిగిపోతుంది. చిగుళ్ళకు హాని కలుగుతుంది. దీనివల్ల సెన్సిటివిటీ పెరుగుతుంది. గట్టి బ్రష్ కాకుండా మెత్తటి-బ్రిస్టల్ బ్రష్‌తో, తేలికపాటి వృత్తాకార స్ట్రోక్‌లతో బ్రష్ చేస్తే మంచిది.

Continues below advertisement

కోల్డ్ డ్రింక్స్

ఎక్కువగా స్నాక్ తీసుకోవడం, స్వీట్ డ్రింక్స్ నోటిలోని బ్యాక్టీరియాకు ఇంధనాన్ని అందిస్తాయి. ఇవి ఎనామిల్‌పై దాడి చేసే ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. మీరు కంటిన్యూగా తింటూ, తాగుతూ ఉంటే.. నోటికి నయం కావడానికి సమయం ఉండదు. కాబట్టి భోజన సమయాలు పాటించాలి. ఆహారాన్ని తీసుకునేటప్పుడు బాగా నమిలి మింగాలి. 

కట్ చేయడం..

కొందరు దంతాలతో ప్యాక్‌లను కొరకడం నుంచి గోర్లు లేదా పెన్నులు నమలడం వరకు, దంతాలను పనిముట్టుగా ఉపయోగించడాన్ని చెడు అలవాటుగా చెప్తారు. అయితే ఇది హానిచేయనిది కావచ్చు. కానీ దీనివళ్లు పగుళ్లు రావడం దవడపై ఒత్తిడి పడడం జరుగుతాయి. కాబట్టి దంతాలతో కొన్ని వస్తువులు ఓపెన్ చేయకూడదు. 

చల్లని ఆహారం అయితే

ఐస్​క్రీమ్, మొక్కజొన్న గింజలు.. ఎనామిల్‌ క్రంచ్ పళ్లపై చిన్న పగుళ్లు వచ్చేలా చేస్తుంది. సూక్ష్మ పగుళ్లు దంతాలను బలహీనపరుస్తాయి. కాలక్రమేణా పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. చల్లటి నీరు లేదా తేలికపాటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చు.

కొరకడం లేదా బిగించడం 

ఒత్తిడి లేదా ఆందోళనలో ఉన్నప్పుడు కొందరు పళ్లను కొరుకుతారు. లేదా టైట్ చేస్తారు. ఇలా చేస్తే పళ్లపై ఉన్న ఎనామిల్ అరిగిపోవచ్చు. దవడ నొప్పి, తలనొప్పి వస్తుంది. మీ దంతాలు చదునుగా ఉన్నట్లు గుర్తిస్తే మీ దంతవైద్యుడి సహాయం తీసుకోవడంతో పాటు.. ఒత్తిడిని తగ్గించే మార్గాలపై దృష్టి పెట్టండి. 

తెల్లగా మారేందుకు

పళ్లు తెల్లగా ఉంటే.. నవ్వేప్పుడు అందంగా కనిపిస్తాయి. పళ్లు తెల్లగా అవ్వడానికి స్ట్రిప్స్ లేదా టూత్‌పేస్ట్‌ అధికంగా ఉపయోగిస్తే ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఎనామిల్ అరిగిపోతుంది. సెన్సిటివిటీ పెరుగుతుంది. వైట్నింగ్ ప్రోగ్రామ్‌ను ప్రయత్నించే ముందు నిపుణుడి సలహా తీసుకోండి.

హైడ్రేషన్

దంతక్షయం నుంచి నోటిని రక్షించుకోవాలంటే.. నోట్లో లాలాజలం ఉండాలి. ఇది సహజంగా పిప్పళ్లు రాకుండా చూస్తుంది. డీహైడ్రేషన్, కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నోటిలో బ్యాక్టీరియా పెరిగి.. పిప్పళ్లకు దారి తీస్తుంది. కాబట్టి నోటిని తేమగా ఉంచుకునేందుకు హైడ్రేషన్ అవసరం. నీటిని ఎక్కువగా తాగుతూ.. హైడ్రేషన్ పెంచే ఫుడ్స్ తీసుకోవాలి. 

ఇవేకాకుండా పళ్లను కాపాడుకునేందుకు రెగ్యులర్​గా డెంటర్ చెకప్స్ చేయించుకోవాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడు పరిష్కారం చేసుకుంటే.. త్వరలోనే అది తగ్గుతుంది. చిగుళ్ల ఇన్​ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. పళ్లు తెల్లగా చేసుకోవడానికి షార్ట్ కట్స్ వదిలేసి.. వైద్యుల సహాయం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రోజూ రెండుసార్లు బ్రష్ చేసుకోవడం.. ఆహారం తీసుకున్న తర్వాత నోళ్లు పుక్కిలించడం లాంటివి చేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.