Home Remedies for Cough and Cold : పొడివాతవరణంలో.. లేదా సీజన్ మారే సమయంలో వాతావరణంలో జరిగే మార్పుల వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ముఖ్యంగా దగ్గు(Cough), జలుబు (Cold) సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. పెద్దల నుంచి పిల్లల వరకు వాతావరణ మార్పుల వల్ల గొంతు నొప్పి(Sore Throat), దుమ్ము, ధూళి వల్ల కలిగే అలర్జీలతో ఇబ్బంది పడతారు. దగ్గు ఉంటే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా మారిపోతుంది. సరిగ్గా నిద్ర పోలేరు. గుండెల్లో నొప్పిగా ఉండడంతో పాటు చాలా అలసటగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మెడిసన్స్, సిరప్లు వాడితో ప్రయోజనంగా ఉంటుంది.
కొన్ని ఇంటి చిట్కాలతో కూడా దగ్గు, కఫం, జలుబు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్తున్నారు డాక్టర్ దీపికా రాణా. మీకు వాతావరణంలో మార్పుల వల్ల దగ్గు వంటి సమస్యలు వస్తే సహజమైన నివారణలను ట్రై చేయవచ్చని సూచిస్తున్నారు. దగ్గు, గొంతునొప్పి, కఫం నుంచి వెంటనే ఉపశమనం ఇవ్వడంలో ఇవి మంచి ప్రయోజనాలు ఇస్తాయని చెప్తున్నారు.
అల్లం-తేనె (Ginger-Honey Remedy)
అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపు, నొప్పిని తగ్గిస్తాయి. అయితే తేనె గొంతును మృదువుగా చేస్తుంది. ఒక టీస్పూన్ అల్లం రసం తీసి.. అందులో అర టీస్పూన్ తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవడం వల్ల దగ్గు నుంచి తక్షణ ఉపశమనం దొరుకుతుంది. అలాగే అల్లాన్ని నీటిలో వేసి మరిగించి.. దానిలో తేనె కలిపి తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది.
పాలల్లో పసుపు (Milk Turmeric Remedy)
పసుపును సహజమైన యాంటీబయాటిక్గా చెప్తారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు వేసి తాగితే మంచిదట. దీనివల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభించడంతో పాటు.. రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెప్తోంది.
తులసి, మిరియాల టీ (Basil and Peppar Remedy)
తులసి ఆకులు, మిరియాలు రెండూ దగ్గును నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కొన్ని తులసి ఆకులను మరిగించి.. దానిలో మిరియాల పొడి వేసుకుని.. కొంచెం తేనె కలిపి టీ తయారు చేసుకోవచ్చు. దీనిని రోజూ తాగితే గొంతుకు ఉపశమనం వస్తుంది.నఅంతేకాకుండా కఫాన్ని తొలగించడంలో కూడా సహాయం చేస్తుంది.
ఆవిరి తీసుకోవడం (Steam Remedy)
గొంతు నొప్పి, దగ్గును తగ్గించుకోవాలనుకుంటే మీరు ఆవిరి తీసుకోవచ్చు. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనికోసం మీరు నీటిని మరిగించి దానిలో వాము లేదా పుదీనా చుక్కలు వేసుకోవాలి. దానిని ఆవిరి తీసుకోవడం వల్ల గొంతు తేమగా మారుతుంది. కఫం సులభంగా బయటకు వస్తుంది. దగ్గు, జలుబు కూడా తగ్గుతుంది.
పుక్కిలించడం (Gargling with Salt Water)
గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల దగ్గు, గొంతు నొప్పికి తగ్గుతుంది. ఇది చాలా పాతకాలం నాటి చిట్కా. బట్ వెరీ ఎఫెక్టివ్. గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఇది మంచి ప్రయోజనాలు ఇస్తుంది.
కాబట్టి పెద్దల నుంచి పిల్లలవరకు దగ్గు, కఫం, జలుబు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ చిట్కాలు కచ్చితంగా ప్రయత్నించండి. ఇవి ఎంత ట్రై చేసినా.. దగ్గు, గొంతు నొప్పి తగ్గకపోతే కచ్చితంగా వైద్య సేవలు తీసుకోండి.