Tomatoes: టమోటో పండా లేక కూరగాయా అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. దాన్ని పండుగా భావించేవారూ ఉన్నారు, ఒక కూరగాయగా భావించేవారూ ఉన్నారు. ఏదేమైనా టమోటో వంటల్లో అగ్రస్థానాన్ని సంపాదించింది. ఏ కూర వండినా అందులో టమాటా ముక్కలు పడాల్సిందే. ఇక టమోటో రైస్, బిర్యానీలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఏ ఫ్రిజ్ ఓపెన్ చేసినా కచ్చితంగా కనిపించేవి ఇవే. అయితే టమోటోలను అధికంగా తింటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.


టమోటాల్లో సిట్రిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి పేగులలో ఆమ్లత్వాన్ని నింపుతాయి. మితంగా తీసుకుంటే టమోటాలు మేలే చేస్తాయి. కానీ ఎక్కువగా టమోటోలు నిండిన ఆహారాన్ని తింటే ఈ ఆమ్లాలు గ్యాస్ట్రిక్ ఆమ్లం ఉత్పత్తికి కారణం అవుతాయి. దీనివల్ల యాసిడ్ రిఫ్లెక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కీళ్లవాతం, కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా టమోటోలను తక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ కీళ్లల్లో వాపును పెంచుతాయి. టమోటోలో ఉండే సమ్మేళనం కీళ్లవాతాన్ని అధికం చేస్తుంది.


టమోటాలు తినడం వల్ల ఎలర్జీలు కూడా వస్తాయి. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. టమోటోలు తినడం వల్ల చర్మ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. టమోటోలో స్కిన్ ర్యాష్‌కు దారి తీసే సమ్మేళనం ఉంటుంది. దీనివల్ల తుమ్ములు, గొంతులో చికాకుగా ఉండడం, నాలుక మంట పెట్టడం, నోటిలో ఇబ్బందిగా ఉండడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. ఇక కిడ్నీ సమస్యల బారిన పడటం కూడా సులభంగా జరుగుతుంది. టమోటోల్లో పొటాషియం, ఆక్సలైట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి మూత్రపిండాల సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు దూరంగా ఉంచాలి. దీనిలో ఉండే ఆక్సలైటు, పొటాషియం కంటెంట్ మూత్రపిండాల్లో రాళ్లను మరింతగా పెంచుతాయి. కాబట్టి టమోటోలు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. టమాటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. టమోటా ఎరుపుగా ఉండడానికి ఈ లైకోపీనే కారణం. టమోటోలను అధికంగా తింటే లైకోపెనోడెర్మియా అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల చర్మం రంగు మారిపోతుంది.


టమోటాలను అధికంగా తింటేనే పైన చెప్పిన సైడ్ ఎఫెక్టులన్నీ వస్తాయి. అదే మితంగా తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. టమోటోల్లో క్యాన్సర్‌ను అడ్డుకునే సుగుణాలు ఉన్నాయి. కాబట్టి ఒక మనిషి రోజుకి మూడు నుంచి నాలుగు టమాటోలను వండుకొని తినవచ్చు. గాయాలు తగిలినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తాయి దీనిలోని గుణాలు. దీనిలో బీపీని తగ్గించే లక్షణాలు అధికం. కాబట్టి హైబీపీ ఉన్నవారు టమోటాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే మధుమేహంతో బాధపడే వారు కూడా టమోటాలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా టమోటోలోని గుణాలు అడ్డుకుంటాయి. అలాగే మతిమరుపు, డిప్రెషన్ వంటివి రాకుండా కూడా అడ్డుకుంటాయి. టెన్షన్ తో బాధపడేవారు టమోటోలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 


Also read: ఆల్కహాల్‌ను గాజు గ్లాస్‌లోనే తాగడం ఆనవాయితీగా వస్తుంది, ఎందుకు?


















































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.