కంప్యూటర్, ఫోన్, టీవీ స్క్రీన్ చూడటం వల్ల ఎక్కువ మంది కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వీటి నుంచి బయట పడేందుకు రోజూ ద్రాక్ష తినడం వల్ల కళ్లకి చాలా మంచిదని తాజా అధ్యయనం చెబుతోంది. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన ఒక బృందం దీనికి సంబంధించి అధ్యయనం నిర్వహించింది. 16 వారాల పాటు సాగిన ఈ అధ్యయనంలో 34 మంది పాల్గొన్నారు. వాళ్ళకి రోజుకి ఒకటిన్నర కప్పుల ద్రాక్ష లేదా ప్లేసిబో ఇచ్చారు. ప్లేసిబోతో పోలిస్తే ద్రాక్ష తినేవారిలో మాక్యులర్ పిగ్మెంట్ ఆప్టికల్ డెన్సిటీ, ప్లాస్మా యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ కంటెంట్ లో గణనీయమైన పెరుగుదల కనిపించింది.


ద్రాక్ష తినని వారిలో గ్లైకేషన్ లో గణనీయమైన పెరుగుదల నమోదు చేసుకున్నారు. ఏజింగ్ ప్రాసెస్ లో ఇది హానికరమైనది. ద్రాక్ష వినియోగం మానవులలో కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని తాజ్ ఆధ్యయనం చూపించింది. ఇది చాలా ఉపయోగకరమైనది. ముఖ్యంగా వృద్ధాప్య వయసులో కంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ద్రాక్ష అందరికీ అందుబాటులో ఉండే అద్భుతమైన పండు. రోజుకి కేవలం ఒకటిన్నర కప్పు సాధారణ పరిమాణంలో తీసుకుంటే ఆశాజనకమైన ప్రయోజనాలు పొందవచ్చు. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్దవారిలో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.


ఆక్సీడేటివ్ స్ట్రెస్ కారణంగా కంటి చూపు ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరంలో తగినంత యాంటీ ఆక్సిడెంట్లు లేనందున ఈ కణాలు దెబ్బతింటాయి. కేవలం నాలుగు నెలల పాటు రోజుకు రెండు పూటల తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.   


ద్రాక్ష ప్రయోజనాలు


రోజుకి కప్పు నిండా తీసుకోవడం వల్ల కాలేయంలోని కొవ్వుని కరిగించుకోవచ్చు. వీటిని తినడం వల్ల యాంటీ యాక్సిడెంట్ జన్యువుల స్థాయిలు పెరుగుతాయి. అది మాత్రమే కాదు ద్రాక్ష తినడం వల్ల మనిషి ఆయుష్హు కూడా పెరుగుతుందని గతంలోని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ద్రాక్ష తరచూ తినేవారిలో సహజ మరణం నాలుగు లేదా ఐదేళ్ల పాటు వాయిదా పడే  అవకాశం ఉంటుంది. ఇవి కొవ్వుని కరిగించేస్తాయి. జీవక్రియని మెరుగుపరుస్తుంది.


ద్రాక్ష పండ్లలో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మొక్కల సమ్మేళనాలకు చెందినవి. ఇది జీర్ణక్రియను పెంచడంతోపాటు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి. ఇది మెటబాలిక్ సిండ్రోమ్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉన్న బలమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ  లక్షణాలు మధుమేహలుకు ఎంతో మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, మైగ్రేన్ వంటి తలనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. మూత్రపిండాల వ్యాధులు ఉన్నవాళ్లు, కాలేయ సమస్యలు ఉన్న వాళ్ళు ద్రాక్షను తినడం చాలా మంచిది. 


ద్రాక్ష పండు వంటి సిట్రస్ పండ్లు తీసుకునే వారి బాడీ మాస్ ఇండెక్స్ తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన ఆహారాల్లో ఒకటిగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. గ్రేప్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇవి తక్కువ కేలరీలని కలిగి ఉండటంలో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత పొట్ట నిండుగా సంతృప్తిగా ఉంటుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసా?