నార్త్ ఇండియన్ థాలీలో నెయ్యి రాసిన చపాతీ లేకుండా ఉండదు. అదే చాలా ముఖ్యమైన ఆహారం వారికి. దక్షిణాదిలో ఇలా చపాతీలకు నెయ్యి రాసుకుని తినే అలవాటు మనకు లేదు. కానీ పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం నెయ్యి లేనిదే చపాతీ తినరు. అయితే ఇలా నెయ్యితో చపాతీ తినడం ఆరోగ్యకరమేనా?
పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చపాతీపై నెయ్యి పూసుకుని తినడం ఆరోగ్యకరమే. కానీ అది మితంగా ఉండాలి. రోజుకు ఒక స్పూను నెయ్యి తినడం వల్ల ఎంతో మంచిది. తినే చపాతీలకు ఈ స్పూను నెయ్యిని సర్దుకుంటే మంచిది. అలా కాకుండా ఒక్కో చపాతీకి ఒక్క స్పూను నెయ్యి రాసుకుని తింటే మాత్రం అనారోగ్య సమస్యలు రావచ్చు. అంతేకాదు రోటీ లేదా చపాతీకి నెయ్యి రాయడం వల్ల వాటి రుచి కూడా పెరుగుతుంది. పోషకాలు నిండిన కూరతో ఈ చపాతీలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతాము అనుకుంటారు కానీ, నిజానికి నెయ్యి వల్ల బరువు తగ్గుతారు. అందుకు నెయ్యి మితంగా తీసుకోవాలి. చపాతీలోని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించడానికి నెయ్యి సహాయపడుతుంది. అంటే మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. అంతేకాదు నెయ్యి వల్ల పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి అధికంగా ఆహారాన్ని తినరు. బరువు పెరిగే సమస్య కూడా ఉండదు. నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు అధికంగా ఉంటాయి. రోజుకో స్పూను తినడం వల్ల బరువు పెరుగుతారన్న భయం అవసరం లేదు.
నెయ్యి అవసరమా?
నెయ్యి తినడం అవసరమా? అనేది చాలా మంది అభిప్రాయం. కానీ నెయ్యిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఖాలీ పొట్టతో నెయ్యి తినడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మలైకా అరోరా నుండి కత్రినా కైఫ్ వరకు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఖాళీ పొట్టతో ఒక స్పూను నెయ్యిని తింటారు. ఇది కణాల పునరుత్పత్తి ప్రక్రియను మెరుగుపరిచి శరీర ఆరోగ్యాన్ని కాపడుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహకరిస్తుంది.
Also read: ఐరన్ మాత్రలు మింగుతున్నారా? అవి ఎప్పుడు వేసుకుంటే సమర్థంగా పనిచేస్తాయో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.