రోగ్యంగా ఉండటంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడమే కాదు అందమైన రూపాన్ని, శరీరాకృతిని అందిస్తాయి. అందుకే సీజనల్ వారీగా వచ్చే పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తారు. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. అయితే సరైన మొత్తంలో, విధానంలో తీసుకుంటే మాత్రమే అందుకు తగిన ఫలితం పొందుతారు. అధిక కేలరీలు, ఫైబర్, గ్లూకోజ్ ఉన్న పండ్లని వేరే వాటితో కలిపి తీసుకుంటే అది బరువు పెరగడానికి లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే పండ్లు ఈ విధంగా తీసుకుంటే మీరు అనుకున్న లక్ష్యాలనికి చేరుకుంటారు.


తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) పండ్లను ఎంచుకోవాలి


చెర్రీస్, బెర్రీస్, యాపిల్స్, బేరి వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) పండ్లను ఎంచుకుంటే మంచిది. ఈ పండ్లు చక్కెరని రక్తప్రవాహంలలోకి మరింత నెమ్మదిగా విడుదల చేస్తాయి. షుగర్ లెవల్స్ ని నియంత్రించి, బరువు పెరిగేందుకు దోహదపడే వాటిని నిరోధిస్తాయి.


ప్రోటీన్ తో జత చేయండి


పండ్లు తిన్న తర్వాత సంతృప్తికరంగా అనిపించాలంటే వాటిని ప్రోటీన్ తో కలిపి తీసుకోవాలి. గ్రీక్ పెరుగు, కాటేజ్ చీజ్ లేదా గింజలు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎక్కువ కాలం పొట్ట నిండుగా ఉంటుంది.


ఖాళీ కడుపుతో అసలే వద్దు


పండ్లు పోషకమైనవే. కానీ ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీన్ని నివారించేందుకు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు తృణధాన్యాలు కలిగిన సమతుల్య భోజనం లేదా చిరుతిండిలో భాగంగా పండ్లు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


పరిమాణం ముఖ్యం


పండ్లు ఆరోగ్యరకమైనవే కదా అని అతిగా తినకూడదు. ఎందుకంటే ఇవి సహజ చక్కెరలు, కేలరీలని కలిగి ఉంటాయి. చిన్న పరిమాణంలో వాటిని తీసుకోవాలి. ప్రత్యేకించి బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంటే తప్పనిసరిగా కొద్ది మొత్తంలో మాత్రమే పండ్లు తీసుకోవాలి. ఒక పండు కాకుండా అన్ని రకాల పండ్ల ముక్కలు కలిపి తీసుకుంటే ఇంకా మంచిది.


భోజనంలో పండ్లు


స్నాక్స్ గా పండ్లు తీసుకునే బదులుగా అదనపు పోషకాలు,ఫైబర్ కోసం వాటిని భోజనంలో భాగంగా చేర్చుకుంటే మంచిది. ముక్కలు చేసిన పండ్లు సలాడ్ లో జోడించుకోవచ్చు. వాటిని స్మూతీస్ లో కలుపుకోవచ్చు. అలాగే తృణధన్యాలు, ఓట్మీల్ టాపింగ్స్ గా ఉపయోగించుకోవచ్చు.


రసాలు వద్దు.. పండ్లు మంచిది


పండ్ల రసాలు సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ అవి తక్కువ ఫైబర్ ని కలిగి ఉంటాయి. చక్కెర, కేలరీలు ఎక్కువ. జీర్ణక్రియకి సహాయపడి, ఆకలిని నియంత్రించడంలో సాయం చేసే ఫైబర్ పొందాలంటే పండ్లు తినడమే ఉత్తమం. పోషక ప్రయోజనాలు పొందేందుకు అన్ని రకాల పండ్లు తినడం మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: అతిగా ఆకలి వేస్తుందా? ఈ కారణాన్ని మీరు అస్సలు ఊహించి ఉండరు!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial