Pistachios Health Benifits: “రోజూ కొన్ని పిస్తా పప్పులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. పురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది” అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారంలో వాస్తవం ఏంత? డాక్టర్లు ఏం చెప్తున్నారు?


పిస్తా పప్పులతో లాభాలేంటి?


పిస్తా పప్పులు ఆరోగ్యానికి  మేలు చేసే బోలెడు పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తా పప్పులలో విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. పిస్తా పప్పులలోని హెల్తీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి కావాల్సిన 40 శాతం ప్రొటీన్ ను అందిస్తాయని నిపుణులు వెల్లడించారు. కంటి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగు పరిచే గుణాలను కలిగి ఉంటాయన్నారు. పిస్తాలోని విటమిన్ E కంటి చూపును మెరుగు పరుస్తుందన్నారు. జుట్టు బలంగా పెరిగేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.


పిస్తాలోని పైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాదు, శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. పిస్తా పప్పు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారు ఆహారంలో పిస్తా పప్పులను భాగం చేసుకుంటే మంచి ఫలితం లభించే అవకాశం ఉంటుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ కరగడం కారణంగా రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. గుండె సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం తగ్గుతుంది. 


పిస్తా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందా?  


పురుషులలో సంతానోత్పత్తి, ఆ సామర్థ్యాన్ని పెంచడంలో పిస్తా సాయపడుతుందంటున్నారు డాక్టర్లు. రోజూ వీటిని తినడం వల్ల కామోద్దీపన లక్షణాలు పెరుగుతాయంటున్నారు. "ప్రతి రోజూ కొన్ని పిస్తా పప్పులు తినడం వల్ల ఏకాంత క్రీడలో రెచ్చిపోయేందుకు అవసరమైన సామర్థ్యం పెరుగుతుందని పలు అధ్యయానాలు వెల్లడించాయి. అంతేకాదు, ఆ కోరికలు పెంచే ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచడంలో సాయపడుతాయి” అని డాక్టర్లు  వివరించారు.


పురుషుల్లో ఆ సామర్థ్యం పెంచే గుణాలు పిస్తా పప్పులో ఉన్నప్పటికీ, ఆయా వ్యక్తులను బట్టి మారే అవకాశం ఉందంటున్నారు. పిస్తా పప్పుల విషయంలో ఎదుటి వారు చెప్పే మాటలను నమ్మకూడదంటున్నారు. ఒక వ్యక్తిలో ఆ కోరికలు అధికంగా పెరిగే అవకాశం ఉంటుందని, మరికొంత మందిలో తక్కువగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఎక్కువ తినడం వల్ల ఆ సామర్థ్యం పెరుగుతుందనే ఆశతో అధికంగా తినడం మంచిది కాదంటున్నారు. అలా చేయడం వల్ల లేని సమస్యలను కొనితెచ్చుకునే అవకాశం ఉందంటున్నారు.  


రోజూ ఎన్ని పిస్తా పప్పులు తినాలంటే?


అతిగా ఏ ఆహారాన్ని తీసుకున్నా ఇబ్బంది తప్పదంటున్నారు నిపుణులు. అందుకే, దేనినైనా మితంగా తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. పిస్తా పప్పుల విషయానికి వస్తే రోజుకు ఒక ఔన్సు అంటే 28 గ్రామలు వరకు తినవచ్చని చెప్తున్నారు. అంతకు మించితే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.  


Read Also:  అందం కోసం ఫేషియల్‌ చేయించుకుంటే ఎయిడ్స్ వచ్చింది - కొంప ముంచిన కొత్త ట్రెండ్!