పేదవాడి యాపిల్ అరటి పండు. అందరికీ అందుబాటులో ఆన్ని సీజన్లలో లభించే పండు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తీసుకుంటారు. పసుపు రంగులో ఉండే పండ్లు తింటారు కానీ పచ్చి అరటి తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు. కానీ ఇవి తినడం వల్ల కోలోన్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే అరటిపండ్లు త్వరగా తినకపోవడం వల్ల వాటి ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆకుపచ్చ అరటి పండ్లు రెసిస్టెంట్ స్టార్చ్ తో తయారవుతాయి. ఇది గట్ లో వెంటనే కరిగిపోకుండా ఫైబర్ లాగా పని చేస్తుంది. రెసిస్టెంట్ స్టార్చ్ బ్లడ్ షుగర్ లో అకస్మాత్తు హెచ్చుతగ్గులు ఇవ్వదు. రెసిస్టెంట్ స్టార్చ్ ఉన్న ఆహారాలు గట్ కి అవసరమైన బ్యాక్టీరియా ఇస్తుంది.


ఈ బ్యాక్టీరియా కొవ్వు ఆమ్లాన్ని పిండి పదార్థంగా మారుస్తుంది. దీన్ని బ్యూటిరెట్ అంటారు. ఇది కోలోన్ క్యాన్సర్ అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇతర మార్గాలలో పేగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆకుపచ్చ అరటిపండ్లలో లభించే పదార్థాలు కాలేయం, పేగులకి సహాయపడుతుందని కొత్త పరిశోధన వెల్లడిస్తుంది. చైనాలోని పీపుల్స్ హాస్పిటల్ పరిశోధకులు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డీసీజ్ ఉన్న వారిని పరిశీలించారు. ఇది గుండె పోటు, స్ట్రోక్, కాలేయం దెబ్బతినేలా చేసి ప్రమాదంలో పడేస్తుంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారికి నాలుగు నెలల పాటు రోజుకి రెండు సార్లు మొక్కజొన్న తో తయారు చేసిన రెసిస్టెంట్ స్టార్స్ ఇచ్చారు. స్టార్చ్ పౌడర్ తీసుకొని వారితో పోలిస్తే తీసుకునే వారిలో కాలేయ వ్యాధి వచ్చే అవకాశాలు 40 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రతిరోజూ పౌడర్ తినే వాళ్ళు కాలేయ ఎంజైమ్ స్థాయిలని తగ్గించారు.


రెసిస్టెంట్ స్టార్చ్ ప్రయోజనాలు పొందాలని అనుకుంటే అందుకోసం మొక్కజొన్న పొడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓట్స్, చిక్కులలు, పచ్చి అరటి పండు తినవచ్చు. ఇది లభించేందుకు పాస్తా మంచి మూలం. అన్నం, పాస్తా, బంగాళాదుంపలు వంటి వాటిలోని లభిస్తుంది. బరువు తగ్గించడంలో ఇది చక్కగా పని చేస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల పొట్ట నిండిన అనుభూతి ఇస్తుంది. త్వరగా ఆకలి వేయదు. పచ్చి అరటి పండులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. డయాబెటిక్ రోగులకి మంచిది. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనే భయం ఉండదు. జీర్ణక్రియని పెంచుతుంది. శరీరంలోని వ్యర్థాలని శుభ్రపరచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!