చూసేందుకు కళ్లు ఎంత ముఖ్యమో.. వినేందుకు చెవులు అంత ముఖ్యం. అందుకే, వాటిని జీవితాంతం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే, భవిష్యత్తులో నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. అందుకే, ముందుగానే మనం కొన్ని లక్షణాలను తెలుసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. వైద్యుడిని సంప్రదించి నష్టం లేకుండా జాగ్రత్తపడొచ్చు. మరి, ఆ లక్షణాలేమిటో చూసేయండి మరి. 


వినికిడి లోపం ఏర్పడడానికి అన్నింటి కంటే ముందుగా వర్షపు చినుకుల శబ్ధం, మైక్రోవేవ్ పింగ్ శబ్ధం వినిపించడం ఆగిపోతుందట. వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో 1000 మందిని అధ్యయనానికి ఎంచుకొని పరిశీలించారు.


వినికిడి లోపం ఏర్పడడానికి అన్నింటి కంటే ముందుగా వర్షపు చినుకులు, మైక్రోవేవ్ పింగ్ వంటి చిన్న శబ్దాలు వినిపించడం ఆగిపోతాయట. వినికిడి కాస్త తగ్గుతున్న సమయాల్లో కొందరు స్త్రీ స్వరం కంటే పురుషుల స్వరం వినడానికి కష్ట పడతారని తెలిసింది. వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్న 1000 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు తేలాయి. 


‘లాస్ట్ అండ్ ఫౌండ్’ క్యాంపేయినింగ్ లో భాగంగా స్పెక్ సేవర్స్ నిర్వహించిన అధ్యయనంలో వినికిడి సమస్య ఉన్న ప్రతి నలుగురిలో ఒకరు తమకు వినికిడి తగ్గిందని అంగీకరించేందుకు సిద్ధంగా లేరని తేలిందట. అయితే 51 శాతం మంది మాత్రం వినికిడి తిరిగి పొందేందుకు ఏం చెయ్యాడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారట. ఈ కార్యక్రమం.. చిన్న వినికిడి పరీక్ష ద్వారా సమస్యను నిర్ధారించడం, చిన్న చిన్న వినికిడి పరికరాలను అమర్చడం ద్వారా ఎలా వినే సామర్థ్యాన్ని తిరిగి పొందవచ్చు అనే విషయాలను గురించి అవగాహన కలిగిస్తోంది.


చెవుడు వచ్చే ముందు వినిపించని శబ్దాలు ఇవే:



  • కేఫ్ లేదా బార్ వంటి రద్దీ స్థలాలలో సంభాషణలు

  • మొబైల్ రింగ్

  • కూని రాగాలు

  • ఫోన్ డయల్ చేసినపుడు వచ్చే డయలింగ్ టోన్

  • వర్షపు చినుకుల సవ్వడి

  • మైక్రోవేవ్ పింగ్

  • పెడెస్ట్రేయిన్ క్రాసింగ్ సిగ్నల్

  • ఫిజీ డ్రింక్ బాటిల్ ఓపెన్ చేసిన శబ్ధం

  • ట్రేయిన్ అనౌన్స్ మెంట్


వినికిడి సమస్యలు ఉన్న వారిలో 22 శాతం మంది ఫోన్ మాట్లాడే సమయంలో వాల్యూమ్ పెంచుతున్నారు. 25 శాతం ఎదుటి వారు చెప్పేది వినేందుకు కష్టం పడుతున్నారు. 27 శాతం మంది కొంచెం బిగ్గరగా మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 59 శాతం మంది వారానికి ఒకసారైనా తమ వినికిడి గురించి ఆందోళన చెందుతున్నట్టు ఈ పరిశోధన తేల్చినట్టు స్పేక్ సేవర్స్ కు చెందిన చీఫ్ ఆడియాలజిస్ట్ గోర్డాన్ హారిసన్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. 


అందరి వినికిడి సామర్థ్యం ఒకే విధంగా ఉండదు. పెద్ద శబ్ధాల పరిసరాల్లో ఉన్నపుడు, అలాంటి చోట పనిచేసే వారు వినికిడిని కాపాడుకోవడం చాలా అవసరం. పెద్ద పెద్ద శబ్ధాల వల్ల నొప్పి, టిన్నిటస్ మాత్రమే కాదు.. తాత్కాలికంగా వినికిడి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెద్ద శబ్ధాలను దీర్ఘకాలం పాటు వినడం వల్ల శాశ్వతంగా వినికిడికి సంబంధించిన నాడులు దెబ్బతినవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మ్యూజిక్ వినే సమయంలో 60 శాతానికి మించి వాల్యూమ్ పెట్టుకోక పోవడమే మంచిది. ఎప్పుడూ ఏదో ఒకటి వినడం కూడా మంచిది కాదు. చెవులకు కాసేపు విశ్రాంతి ఇవ్వడం అవసరం. పెద్ద పెద్ద శబ్ధాలు ఉండే ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడితే తప్పనిసరిగా వినికిడిని నియంత్రించే పరికరాలు వెంట ఉంచుకోవాలి. ఎప్పుడైనా నివారణే చికిత్స కంటే మెరుగైన విషయం. వినికిడిలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించడం కూడా చాలా అవసరం. అప్పుడప్పుడు ఆడియాలజిస్ట్ ను కలిసి వినికిడి సామర్థ్యాన్ని పరీక్షుంచుకోవాలని నిపుణులు అంటున్నారు.



Also Read: నెలసరి నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టొచ్చు