Dubai Princess Mahra: జులైలో ఇన్టాగ్రామ్‌లో భర్తకు విడాకులు ఇచ్చి సంచలనం సృష్టించిన దుబయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్ అల్‌ మక్తూం.. ఇప్పుడు డివోర్స్ పేరుతో ఒక ఫెర్ఫ్యూమ్‌ను మార్కట్‌లోకి తెచ్చి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ డివోర్స్ ప్రకటన కూడా మళ్లీ ఇన్‌స్టాలోనే చేసింది. తన బ్రాండ్ మహ్రా M1 నుంచి వచ్చిన ఈ డివోర్స్‌ టీజర్‌ను తన ఇన్‌స్టా అకౌంట్లో స్టోరీగా పోస్టు చేసింది. ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ బ్లాక్‌ కలర్‌లో ఉండగా దానిపై అందమైన అక్షరాలతో డివోర్స్‌ పేరును డిజైన్ చేయించింది. ప్రస్తుతం ఈ డివోర్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ సెంట్ బోల్డ్ థీమ్‌ను తెలిపేలా టీజర్‌ను డిజైన్ చేయగా.. లక్షల్లో లైక్‌లు వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.






ఎవరీ మహ్‌రా:


ఈ 30 ఏళ్ల మెహ్‌రా.. దుబయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ అల్ రషీద్ మక్తూం గారాల పట్టి. ఈమె తల్లి గ్రీకు దేశానికి చెందిన జో గ్రీగో రకోస్దీ. అందుకే గ్రీకు అందమంతా పూసుకొని పుట్టినట్లుంటుంది ఈ మహ్‌రా. గ్రీస్‌లో తల్లి దగ్గర పెరిగిన మహ్‌రా.. దుబాయ్‌ సంప్రదాయాలను కూడా చిన్నప్పటి నుంచే అవలరచుకుంది. బ్రిటన్‌లో డిగ్రీ పట్టా పొందిన మహ్‌రా.. గ్రీకు భాష కూడా అనర్గళంగా మాట్లాడుతుంది. సాదారణఁగా దుబయ్ రాజకుటుంబీలు కెమేరా ముందుకు రారు. మెహ్‌రా మాత్రం అందుకు కాస్త భిన్నం. ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది.


2023లో పెళ్లి..  ఒక కుమార్తె.. 2024లో విడాకులు:


మహ్‌రా, షేక్ మానాల వివాహం 2023లో జరిగింది. వారికి ఒక పాప కూడా పుట్టింది. ఈ ఏడాది వాళ్లు డైవర్స్ తీసుకున్నారు. సాధారణంగా అరబ్‌ సంస్కృతి ప్రకారం మగవాళ్లు తమ భార్యలకు మూడు సార్లు తలాక్ చెప్పి వారికి డివోర్స్ ఇస్తుంటారు. ఇక్కడ మాత్రం మహ్‌రా భిన్నంగా తానే ఇన్‌స్టా వేదికగా భర్తకు తలాక్ చెప్పి సంచలనం సృష్టించింది. ఈ మేరకు జులై 16న ఇన్‌స్టాలో పోస్టు పెట్టిన మహ్‌రా.. భర్త వేరే వారితో ఉంటున్నారంటూ నిందిస్తూ మూడు సార్లు తలాక్ చెప్పింది. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను కుడా డిలీట్ చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే డైవర్స్ తీసుకున్నారు. ఇన్‌స్టాలా డివోర్స్ ప్రకటన చేసిన తర్వాత మహ్‌రాకు ఎంతో మంది మద్దతుగా నిలిచారు.


మహ్‌రానే కాదు.. ఆమె మనసూ అందమైందే..!


సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఉండే షైకా.. అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దుబాయ్‌ ఫౌండేషన్‌ ఫర్ విమెన్ అండ్ ఛిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూరుస్తుంది. గృహ హింస, మానవ అక్రమ రవాణా, మహిళల హక్కులపై పోరాటం చేస్తున్నారు. అల్‌ జలీలా ఫౌండేషన్ ద్వారా వైద్య విద్య రీసెర్చ్‌కు మద్దతుగా ఉంది. గుర్రపు స్వారీ కూడా చేసే మహ్‌రా.. మూగజీవాల కోసం కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫ్యాషన్‌ క్వీన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్న మహ్‌రా.. దుబయ్ సంస్కృతి ప్రతిబింబించేలా నిండుదనంతో ఉన్న దుస్తులకు ప్రత్యేక డిజైన్‌లు యాడ్ చేసి ధరిస్తుంటారు. అనేక మారథాన్లలోనూ పాల్గొన్నారు.  ఈ దుబయ్ యువరాణి ఆస్తి దాదాపు 14బిలియన్ డాలర్ల నుంచి 18 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.