Home Tricks to Dry Clothes in Winter : చలికాలంలో ఇంట్లో చేసే చిన్న పనులు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా బట్టలు ఆరేయడం. చల్లని గాలి, బలహీనమైన సూర్యరశ్మి, తేమ కారణంగా బట్టలు ఆరడానికి చాలా సమయం పడుతుంది. చలికాలంలో బట్టలు ఆరడానికి ఎక్కవ సమయం చూడాలి. అయితే మీరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వవచ్చు. ఇవి మీ పనిని సులభతరం చేయడంతో పాటు.. సరైన పద్ధతులతో ఆరేలా చేస్తాయి. బయటకు వెళ్లకుండానే మీ బట్టలు తాజాగా ఉంచుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ చూసేద్దాం.
బట్టలు ఆరేసే స్థలం
చలికాలంలో బట్టలు ఆరేయడానికి ఇంటి లోపల కొన్ని మూలలు సెట్ చేసుకోవాలి. కిటికీ దగ్గర లేదా గది తెరిచిన మూల వంటి తేలికపాటి గాలి ప్రసరణ ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి. అక్కడ ఒక రాడ్ లేదా బలమైన తాడును కట్టండి. దుస్తులు ఒకదానికొకటి అంటుకోకుండా ఆరేయండి. దీనివల్ల అన్ని వైపుల నుంచి డ్రెస్‌లకు గాలి తగులుతుంది.
ఫ్యాన్‌తో ఆరబెట్టండిలా
చలికాలంలో ఫ్యాన్లు చాలా తక్కువగా ఉపయోగిస్తారు. కానీ కొద్దిగా గాలి ప్రసరణ ఉంటే డ్రెస్‌లు ఆరబెట్టే ప్రక్రియను వేగవంతం అవుతుంది. మీరు బట్టలకు ఎదురుగా ఒక టేబుల్ ఫ్యాన్ కూడా ఉంచవచ్చు. తక్కువ వేగంతో రాత్రిపూట ఫ్యాన్ వేయడం వల్ల దుస్తుల్లోని తేమ తగ్గుతుంది. ఇది బట్టలను వేగంగా ఆరబెట్టడానికి సహాయపడుతుంది.
అధిక నీటిని తీసేయండి..
దుస్తులు ఉతికిన తర్వాత దానిని బాగా పిండాలి. నీరు ఎంత తక్కువగా ఉంటే.. అది అంత త్వరగా ఆరిపోతుంది. చేతితో ఉతికితే బట్టల నుంచి అధిక నీటిని తీసేయొచ్చు. వాషింగ్ మిషన్ వాడితే స్పిన్ మోడ్‌ను రెండుసార్లు రన్ చేయాలి. ఇది అదనపు తేమను తొలగించడంలో సహాయపడుతుంది. తద్వారా బట్టలు త్వరగా ఆరిపోతాయి.
టవల్-అబ్సార్ప్షన్ ట్రిక్
తడి బట్టలను రెండు పొడి టవల్స్ మధ్య ఉంచి గట్టిగా నొక్కండి. టవల్స్ బట్టల నుంచి మంచి మొత్తంలో తేమను గ్రహిస్తాయి. దీని తరువాత బట్టలను హ్యాంగర్‌పై వేయండి. చాలా త్వరగా అవి ఆరిపోతాయి. ఈ పద్ధతి తడిని త్వరగా తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
హెయిర్ డ్రైయర్‌తో
కొన్ని సందర్భాల్లో డ్రెస్‌కి తగ్గట్లు హెయిర్ ఉండేలా చూసుకుంటారు. కానీ జుట్టు బయటకు వెళ్లేప్పుడు ఇంకా తడిగా ఉంటే.. హెయిర్ డ్రైయర్ మీకు ఉత్తమ పరిష్కారం కావచ్చు. కాలర్లు, చేతులు, అంచులపై వేడి గాలిని పెట్టవచ్చు. ఇవి ఆరడానికి ఎక్కువ సమయం తీసుకునే ప్రాంతాలు. కొన్ని నిమిషాల్లో దుస్తులు ధరించడానికి అనుకూలంగా తయారవుతాయి.
లైట్ ఐరన్
బట్టలు కొద్దిగా ఆరినప్పుడు కానీ ఇంకా కొంత తేమ ఉన్నప్పుడు.. వాటిని లోపలికి తిప్పి ఐరన్‌తో తేలికగా నొక్కండి. వేడి మిగిలిన తేమను ఆవిరి చేస్తుంది. చెడు వాసన రాకుండా చేస్తుంది. ఐరన్ చేసిన తర్వాత.. పూర్తి ఆరిన కోసం బట్టలను ఒకటి లేదా రెండు గంటలు వేలాడదీయండి.
రూమ్ హీటర్
గది చాలా చల్లగా ఉన్నప్పుడు, దుస్తులు ఆరడానికి ఎక్కువ సమయం పట్టినప్పుడు రూమ్ హీటర్ చాలా సహాయపడుతుంది. తలుపు మూసి.. హీటర్ ఆన్ చేసి.. బట్టలను సురక్షితమైన దూరంలో వేలాడదీయండి. వెచ్చని గాలి క్రమంగా తేమను తొలగిస్తుంది. ఆరబెట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
మందంగా ఉండే దుస్తులను కాసేపు అయినా ఎండలో వేస్తే మంచిది. లేదంటే అవి వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా వింటర్లో డ్రెస్‌లు ఆరేసుకునేందుకు ఇబ్బంది పడితే.. వీటిని ఫాలో అయిపోండి.