విటమిన్ సి పుష్కలంగా లభించే వాటిలో నిమ్మకాయ ముందుంటుంది. చాలా మంది తమ ఇళ్ళల్లో కచ్చితంగా నిమ్మకాయలు ఉంచుకుంటారు. వాటితో పులిహోర చేసుకుని తింటే ఉండే రుచే వేరు. చాలా తొందరగా రెడీ అయ్యే ఫుడ్ నిమ్మకాయ పులిహోర. అదే కాదు లెమన్ టీ కూడా తాగేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అది తక్షణ శక్తిని ఇస్తుంది. అందుకే ఉపవాసం లేదా నిరాహార దీక్ష చేసి విరమించిన వాళ్ళకి ముందుగా నిమ్మరసమే ఇస్తారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు నిమ్మకాయలకి మంచి గిరాకి ఉంటుంది. ఎండ వేడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చల్లని నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.


శరీరం డీ హైడ్రేట్ గా అనిపించిన వెంటనే చాలా మంది చేసే మొదటి పని కొద్దిగా గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ కలుపుని తాగడం. అలా చెయ్యడం వల్ల దప్పిక తీరి హాయిగా అనిపిస్తుంది. బరువు తగ్గేందుకు కూడా ఎక్కువ మంది పరగడుపున నిమ్మరసం తీసుకుంటారు. పొట్ట తగ్గాలన్నా గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం, కొద్దిగా తేనె కలుపుకుని తాగేస్తారు. అయితే అది నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుందనే అంటున్నారు నిపుణులు. బరువు తగ్గే దగ్గర నుంచి చర్మం మెరిసేలా చేసేంత వరకు నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు.


నిమ్మరసం వల్ల అదనపు ప్రయోజనాలు


❂ నిమ్మకాయ నీళ్ళు ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే పరగడుపున వీటిని తీసుకుంటారు.


❂ విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ ఫ్రూట్ కనుక తక్షణ శక్తిని ఇస్తుంది. శరీరంలో ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది.


❂ నిమ్మకాయ నీళ్ళు శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి కణాలను రక్షించడంలో సహాయపడతాయి.


❂ వృద్ధాప్య సంకేతాలు నెమ్మదించేలా చేసి చర్మ సంరక్షణకు దోహదపడుతుంది. విటమిన్ సి ఉండటం వల్ల మెరిసే చర్మాన్ని ఇస్తుంది.


❂ మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.


రోజుకు ఎంత మొత్తంలో నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు


మహిళలకు రోజు మొత్తం మీద సుమారు 75 మిల్లీగ్రాముల విటమిన్ సి తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అలాగే పురుషులు 90 మిల్లీగ్రాముల విటమిన్ సి తీసుకోవాలి. అది బరువు మీద ఆధారంగా మారుతూ ఉంటుంది. ఒక లీటర్ బాటిల్ లో 4 నిమ్మకాయ ముక్కలు పిండి రసం వేసుకుని రోజంతా తాగొచ్చు. ఇలా చెయ్యడం వల్ల డీ హైడ్రేట్ కాకుండా ఉంటారు.


48 గ్రాముల పిండిన నిమ్మకాయలో ఉండే పోషకాలు


❂ 10.6 కేలరీలు


❂ 18.6 మిల్లీగ్రాముల (mg) విటమిన్ సి


❂ 9.6 మైక్రోగ్రాముల (mcg) ఫోలేట్


❂ 49.4 mg పొటాషియం


❂ 0.01 mg విటమిన్ B-1


❂ 0.01 mg విటమిన్ B-2


❂ 0.06 mg విటమిన్ B-56


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: బొప్పాయి తింటే గర్భస్రావం నిజమేనా? గర్భిణీలు ఆ పండును ఎంత మోతాదులో తినాలి?


Also read: పండంటి బిడ్డ కోసం ప్రెగ్నెన్సీకి ముందు కచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే