Warm Water Benefits in the Morning : ఆరోగ్యానికి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న చాలామంది ఉదయాన్నే ఈ నియమాన్ని పాటిస్తారు. అందుకే నిపుణులు కూడా ఈ చిన్న అలవాటు ప్రతి ఒక్కరూ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల చాలా లాభాలున్నాయని.. వారం రోజులు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగితే ఎన్నో మంచి మార్పులు జరుగుతాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే గోరువెచ్చని నీరు ఎందుకంటే..

రాత్రంతా నిద్రలో ఉన్నప్పుడు శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. జీర్ణక్రియ ప్రారంభమై.. టాక్సిన్స్ బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. మరి వారం రోజులు ఈ అలవాటును ఫాలో అవ్వడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో చూసేద్దాం. 

మెరుగైన జీర్ణక్రియ

గోరువెచ్చని నీరు కడుపులోని ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం దూరమవుతుంది. బౌల్ మూమెంట్ సులభమవుతుంది. 

శరీర డీటాక్స్

గోరువెచ్చని నీరు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీనివల్ల స్కిన్ కూడా క్లియర్‌గా మారుతుంది. హెల్తీ స్కిన్ మీ సొంతమవుతుంది. పింపుల్స్ కూడా తగ్గుతాయి. శరీరం లోపల నుంచి శుభ్రపడితే మొటిమలు తగ్గి.. చర్మం గ్లో అవుతుంది.

బరువు తగ్గడానికై.. 

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల మెటాబాలిజం పెరుగుతుంది. అంతేకాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

శరీరానికి ఎనర్జీ

ఉదయం నీరు తాగడం వల్ల అలసట తగ్గుతుంది. శరీరం ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దీనివల్ల రోజంతా ఎనర్జిటిక్ ఉంటారు. 

మెరుగైన రక్తప్రసరణ

గోరువెచ్చని నీరు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరం మొత్తాన్ని యాక్టివ్‌గా చేస్తుంది. అలాగే బ్లడ్ ఫ్లో వల్ల చర్మం మెరిసిపోతుంది. 

ఎలా తాగాలంటే..

మీరు ఈ అలవాటు చేసుకోవాలనుకుంటే.. నీరు వేడిగా ఉండకూడదని గుర్తించుకోవాలి. నీరు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. దీనిని 1 గ్లాస్‌తో మొదలు పెట్టవచ్చు. నెమ్మదిగా దానిని 2 గ్లాసులకు పెంచుకోండి. కావాలంటే నిమ్మరసం లేదా తేనె కలిపి తాగవచ్చు. కొందరు నెయ్యి కూడా వేసుకుని తాగుతారు. ఈ చిన్న అలవాటు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అందరూ దీని ప్రయోజనాలు పొందవచ్చు.