కలలు చాలా సాధారణ విషయమే. అందరికీ వస్తాయి. కానీ అన్ని కలలు గుర్తుండవు. కానీ కొన్ని కలలు ప్రత్యేకంగా గుర్తుంటాయి. కలలో కనిపించిన విషయాన్ని బట్టి కలలను విశ్లేషిస్తుంది స్వప్న శాస్త్రం. కలలో కనిపించి, మనకు గుర్తున్న ప్రతీ కల మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుందట. మరణించిన తల్లిదండ్రులు కలలో కనిపించినపుడు ఆ కల చాలా ప్రత్యేకమైందిగా భావించాల్సి ఉంటుంది. చనిపోయిన ఇతర ఆత్మీయులు కలలో కనిపిస్తే అది మిమ్మల్ని ఆద్యాత్మికత వైపు కార్యోన్ముఖులను చేస్తుందని అర్థం. స్వప్నశాస్త్రాన్ని అనుసరించి మరణించిన తల్లిదండ్రులు కలలో కనిపించడానికి రకరకాల అర్థాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
కలలో తల్లి దండ్రులు బాధ పడితే
కలలో తల్లి దండ్రుల విషాదంగానో లేక ఏడుస్తున్నట్టుగానో కనిపిస్తే వారు ఏదో విషయానికి బాధపడుతున్నారని అర్థం. లేదా భవిష్యత్తులో మీకు ఏదో కీడు జరగబోతుందనడానికి కూడా సూచన కావచ్చు. చనిపోయిన తండ్రి కలలో కనిపించి విషాదంగా ఉంటే ఆయన ఏదో అసంతృప్తితో ఉండి ఉండవచ్చని మీరు ఆయన శ్రాద్ధ కర్మలు మరింత నిష్టగా ఆచరించాలని అర్థం కావచ్చు.
ఆనందంగా కనిపిస్తే..
కలలో కనిపించిన తల్లిదండ్రులు నవ్వుతూ కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ఈ కల మీ భవిష్యత్తు చాలా బావుంటుందని అర్థం. కుటుంబ గౌరవం ఇనుమడిస్తుందని, మీరు చేస్తున్న పనులు వారికి ఆనందాన్ని కలిగిస్తున్నాయని అనడానికి ప్రతీకగా చెప్పవచ్చు.
మాట్లాడితే....
కలలో కనిపించిన తల్లిదండ్రుల మాట్లాడుతున్నట్టు కల వస్తే వారు మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారని అర్థం. ఇలా మాట్లాడుతున్నట్టు వచ్చు కల చాలా మంచికలగా చెప్పవచ్చు. అలాంటి కల మీ జీవితం అభివృద్ధిలో ఉంటుందని అనడానికి సూచన. త్వరలో ఇంట్లో జరిగే శుభకార్యానికి ఇది సంకేతం కావచ్చు.
కలలో తల్లిదండ్రులను వెతకడం
కొంత మందికి కలలో మరణించిన తల్లిదండ్రుల కోసం వెతుకుతుంటారు. అటువంటి కల వచ్చిందంటే మీకు తెలియకుండానే ఏదో కోపంలో ఉన్నారని అర్థం. ఈ కల వస్తే మీ కోపానికి కారణాన్ని తెలుసుకోవడం అవసరమని అర్థం. దేని కోసం మీరు ఆందోళనలో ఉన్నారని తల్లిదండ్రుల నుంచి సహాయం ఆశిస్తున్నారని అర్థం.
కలలో తండ్రి చనిపోయినట్టు
ఒక్కోసారి మనతోనే ఉన్న తండ్రి చనిపోయినట్టు కలలో కనిపిస్తే అది శుభసూచకమే. ఆయన దీర్ఘాయుష్షుకు అది సూచన. కాబట్టి చింతించాల్సిన పని లేదు. దేవుడి మీద నమ్మకం ఉంచి అంతా మంచి జరగాలని ఆశించాలి.
Also read : Laughing Buddha: లాఫింగ్ బుద్ధ ఎవరు? ఆ విగ్రహం ఇంట్లో ఉండటం మంచిదేనా? ఎక్కడ పెడితే శ్రేయస్కరం?