Dive into Lakshadweep : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో లక్షద్వీప్ పేరు మార్మోమ్రోగిపోతుంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా బాయ్‌కట్ మాల్దీవులు అంటూనే లవ్ ఫర్ లక్షద్వీప్ అంటూ మద్ధతిస్తున్నారు సెలబ్రెటీలు, నెటిజన్లు. మాల్దీవులకు టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని లక్షద్వీప్‌లకు చెక్కేస్తున్నారు. అక్కడి నుంచి వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే చలికాలంలో మీరు ట్రిప్‌కి వెళ్లగలిగే ప్రాంతాలలో లక్షద్వీప్ కచ్చితంగా ఉంటుంది.
లక్షద్వీప్‌లో సహజమైన తెల్లని ఇసుక, స్పష్టమైన జలాలు, శక్తివంతమైన పగడపు దిబ్బలు మీ మనసును ఆకర్షిస్తాయి. ఇక్కడి జంతుజాలం కూడా మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చలికాలంలో హాయిగా సేదతీరాలని కోరుకునేవారికి ఉష్ణమండల స్వర్గధామం లక్షద్వీప్ అని చెప్పవచ్చు. వెచ్చని వాతావరణాన్ని ఆస్వాదించడానికి, అద్భుతమైన ట్రిప్ మీ సొంతం కావాలనుకుంటే ఈ ద్వీపానికి వెళ్లొచ్చు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత మీరు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనుల జాబితా ఇక్కడ ఉంది. ఈ లిస్ట్ మీకు లక్షద్వీప్‌లో మంచి అనుభూతిని ఇస్తుంది. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే..
స్నార్కెలింగ్..
లక్షద్వీప్ వెళ్లినప్పుడు మీరు స్నార్కెలింగ్ కచ్చితంగా చేయాలి. దీనిలో భాగంగా మీరు నీటి అడుగున ఉన్న ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఈ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని కచ్చితంగా మంత్ర ముగ్ధులను చేస్తుంది. ద్వీపాల చుట్టూ ఉన్న పగడపు తోటలు, సముద్ర జీవులు మీ మనసును కట్టిపడేస్తాయి. పగడాలు, చేపలు, ఇతర జలచరాల అందాలను మీరు దగ్గరగా చూడొచ్చు. ఈ తీరప్రాంతంలో మీరు రంగురంగుల దిబ్బలు, ప్రత్యేకమైన సముద్ర జీవులు చూడాలంటే.. అగట్టి వెళ్లాలి. అగట్టి లక్షద్వీప్ స్నార్కెలింగ్ చేయడానికి అనువైన ప్రదేశం.
స్కూబా డైవింగ్
మీరు ఈ ట్రిప్‌లో మరింత ఇన్వాల్వ్ కావాలనుకుంటే అక్కడ మీరు స్కూబా డైవింగ్ చేయాలి. మీ డైవింగ్ అనుభవ స్థాయిని బట్టి.. డైవ్ ట్రిప్ చేయొచ్చు. షిప్ బ్రేక్‌లు, ఓవర్‌హాంగ్‌లు, డ్రిఫ్ట్ డైవింగ్‌లు చేయవచ్చు. ఇవి ప్రయాణాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయి. కవరత్తి ద్వీపం స్కూబా డైవింగ్‌కు అనువైన ప్రదేశం. ఈ ద్వీపంలో ప్రత్యేకమైన చేపలు, దిబ్బలు, తాబేళ్లు ఉంటాయి.
యాచ్ రైడ్స్
సముద్రంలో గాలి మిమ్మల్ని సున్నితమైన స్పర్శతో తాకుతూ.. ఆకాశనీలం ఉన్న జలాలాపై గ్లైడ్ చేసేందుకు లక్షద్వీప్ అనువైనది. ఇది మీకు విలాసవంతమైన, విశాలమైన యాచ్ రైడ్‌ను ఇస్తుంది. అక్కడ క్రూయిజ్ ప్రయాణం.. మీకు విశ్రాంతి, ఉత్సాహం రెండింటినీ ఇస్తుంది. మీకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తుంది.
అక్వేరియం
మీరు లక్షద్వీప్ వెళ్తే కచ్చితంగా అక్వేరియంలు కచ్చితంగా సందర్శించండి. లక్షద్వీప్‌ల అనేక మ్యూజియంలు, అక్వేరియంలు ఉన్నాయి. అక్కడ మీరు సముద్ర జీవులు, వాటి సంబంధిత కళాఖండాలు చూడొచ్చు. రాజధాని ద్వీపమైన కవరత్తిలో మీరు సాంస్కృతిక కార్యకలాపాలు చూడొచ్చు. ట్రెడీషనల్ దుస్తులు షాపింగ్ చేయొచ్చు. కవరెట్టి అక్వేరియంలో సముద్ర జీవల శ్రేణి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇక్కడ మీరు ప్రత్యేకమైన నిర్మాణాలు, జీవనశైలిని చూడొచ్చు.
చేపలు పట్టొచ్చు..
లక్షద్వీప్‌లో మినీకాయ్ ద్వీపం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. అక్కడ బీచ్ రిసార్ట్లు, రంగురంగుల పగడపు దిబ్బలు, పచ్చని వృక్ష సంపందతో నిండి ఉంటుంది. అద్భుతమైన తెల్లని ఇసుక బీచ్‌లు ఆకట్టుకుంటాయి. 300 అడుగుల ఎత్తైన లైట్‌హౌస్, ఫిషింగ్, జుమా మసీదు ఇక్కడి గొప్ప సాంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. అలాంటి మినీకాయ్‌లో మీరు చేపలు పట్టొచ్చు. అక్కడి ఫిషింగ్ హెరిటేజ్ పర్యాటకులకు సాంప్రదాయ పద్ధతిలో ఫిషింగ్ చేసేందుకు అవకాశాన్ని కలిగిస్తుంది.
Also Read : మహిళలు బరువును తగ్గించే మాత్రలు వేసుకోవచ్చా? బరువు తగ్గేందుకు ఎలాంటి మాత్రలు ఎంచుకోవాలి?