Warning Signs of Liver Problems : కాలేయ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జీవనశైలి సరిగా లేకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల కాలేయం దెబ్బతింటోంది. ఈ కారణంగా ఈ రోజుల్లో చాలా మంది ఏదో ఒక రకమైన కాలేయ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పైగా కాలేయ సమస్యలు చాలా లేట్‌గా బయటపడతాయి. అందుకే కాలేయ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరమని చెప్తున్నారు నిపుణులు.
కాలేయ సమస్యలు ఆలస్యంగా బయటపడినా.. దానికంటే ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు శరీరం ఇచ్చే సంకేతాలు కాలేయం చెడిపోయిందని సూచిస్తాయట. ఈ సంకేతాలను (లివర్ డ్యామేజ్ సంకేతాలు) సకాలంలో గుర్తిస్తే.. కాలేయం పూర్తిగా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. మరి రాత్రిపూట శరీరం ఇచ్చే సంకేతాలు ఏంటో చూసేద్దాం.
దురద
కాలేయ సమస్యలు చర్మం దురదకు కారణమవుతాయి. కొన్నిసార్లు పగలు దురద రాదు. కానీ రాత్రిళ్లు ఎక్కువగా దురద వస్తుంది. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాత్రిపూట దురద, మంట మొదలైనవి కాలేయ సమస్యలకు సంకేతం కావచ్చు. కాబట్టి వాటిని విస్మరించే బదులు వైద్యుడిని సంప్రదించాలి.
లివర్‌పై ప్రభావం
కాలేయానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే లేదా కాలేయం దెబ్బతినడం ప్రారంభిస్తే.. అది కాలేయ బలహీనతకు సంకేతం కావచ్చు. శరీరంలోని ఎక్కువ రక్తం కాలేయంలో పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు.. దాని పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. దానిపై ఒత్తిడి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో కాలేయంలో నొప్పి ప్రారంభమవుతుంది. రాత్రుళ్లు లివర్ ప్రాంతంలో నొప్పి వస్తుంది. ఇది ఆందోళన కలిగించే లక్షణం.
వాపు
కాలేయం దెబ్బతినడం ప్రారంభమైనప్పుడు మొదట పాదాలు, చీలమండలలో వాపు కనిపించవచ్చు. ఈ లక్షణాలు రాత్రిపూట కనిపిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాత్రిపూట కాలేయంలో రక్త సాంద్రత పెరుగుతుంది. ఒత్తిడి కారణంగా కాలేయం మరింత దెబ్బతింటుంది.
మూత్రం రంగు
మీ మూత్రం రంగు మారితే అది కాలేయ సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. నిజానికి కాలేయం దెబ్బతినడం వల్ల బిలిరుబిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీని కారణంగా అది మూత్రపిండాలలో విసర్జిస్తుంది. దీని కారణంగా మూత్రం రంగు మారుతుంది. రాత్రిపూట ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే రాత్రిపూట కాలేయంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
వికారం
కాలేయ సమస్యలు ఉన్నవారికి వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు. పగటిపూట శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఇది సంభవించవచ్చు. కానీ ఈ లక్షణాలు రాత్రిపూట సంభవిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి వీటిలో ఏదైనా లక్షణం కనిపిస్తే అది సాధారణమైనదని అనుకుని.. వాటిని విస్మరించవద్దని.. వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకుంటే ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.