మహిళలు బయటకు వెళ్లాలంటే తప్పకుండా మేకప్ ఉండాల్సిందే. అందంగా లేని వారిని కూడా అందమైన సుందరీమణులుగా మార్చేసే శక్తి ఒక్క మేకప్ కి మాత్రమే ఉంది. అయితే చాలామంది మేకప్ వేసుకోవడానికి గంటలు గంటలు టైమ్ వెస్ట్ చేసేస్తారు. ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ తమ మేకప్ రొటీన్ ఫాలో అయిపోతారు. ముఖ్యంగా తమకి ఇష్టమైన సెలబ్రెటీల మేకప్ లుక్ వచ్చేలా చేసుకోవాలని చాలా ట్రై చేస్తారు.


సోషల్ మీడియాలో ఎన్నో మేకప్ హాక్స్ లభిస్తున్నాయి. అయితే అవి కొన్ని సరిగా పని చేయకపోగా అనవసరమైన ఇబ్బందులు తీసుకొస్తాయి. రోజువారీ దినచర్యలో చాలా వరకు మేకప్ ఉంటుంది. ఇది చర్మానికి మెరుపు ఇవ్వడమే కాకుండా అందరిలోనూ మనల్ని అందంగా చూపిస్తుంది. మేకప్ కి ఎక్కువ సమయం పెట్టడం ఎందుకని కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని వైరల్ టెక్నిక్స్ చూసి పాటిస్తారు. అయితే అవి ఒక్కోసారి చర్మానికి హాని కలిగించవచ్చు.


లిప్ లైనర్ కంటికి


లిప్ లైనర్స్ కొంతమంది కళ్ళకు కూడా వేస్తారు. కానీ అవి కళ్ళకు చికాకు కలిగిస్తాయ్. అందుకే ఈ టెక్నిక్ పాటించొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైపర్ పిగ్మెంటేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు డార్క్ సర్కిల్స్ చుట్టూ కాజల్ తక్కువగా అప్లై చేయాలి.  


బ్లష్ గా లిప్ స్టిక్


కాస్మోటిక్స్ ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు లిప్ స్టిక్ ని బ్లష్ గా అప్లై చేస్తారు. ముదురు రంగు లిప్ స్టిక్ లేదా లిక్విడ్ మ్యాట్ లిప్ స్టిక్ లను బ్లష్ గా ఉపయోగించకూడదని చర్మ సౌందర్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇవి పెదవులకు ముదురు రంగుని ఇచ్చేందుకు వాడతారు. వాటిని బుగ్గలకు బ్లష్ చేస్తే స్కిన్ కలర్ మారుతుంది. అది చూసేందుకు అందంగా ఉండదు. బదులుగా లేత రంగు క్రీమ్ బ్లష్ ని ఉపయోగించుకోవచ్చు.


కనురెప్పల కోసం పెట్రోలియం జెల్లీ


చాలా మందికి కనురెప్పలు తక్కువగా ఉండి కనిపించవు. పొడవైన కనురెప్పలు కావాలని అనుకునే వాళ్ళు వెంట్రుకలకు పెట్రోలియం జెల్లీ పూస్తారు. ఇది వెంట్రుకల మందం చేయదు, పొడవుగాను చూపించదు. పైగా కళ్ళ కింద చిన్న సిస్ట్ లు ఏర్పడతాయి. పొడవాటి కనురెప్పలు కావాలంటే ఆముదం రాయాలి.


మొహానికి వాక్స్ వద్దు


చేతులు, కాళ్ళు మీద గ్లూ రాశి బ్లాక్ హెడ్స్ తీసేస్తారు. కానీ దాన్ని ముఖం మీద ఉపయోగించడం పూర్తిగా మానుకోవాలి. దీని తయారీకి ఉపయోగించే రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. ఒక్కోసారి గర్భం కూడా దాల్చలేరు. ఇవి చర్మం మీద అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది.


డియోడరెంట్ రోలర్


ఇది చాలా ప్రమాదకరమైనది. డియాడరెంట్ రోలర్ మొహం మీద పెట్టుకోకూడదు. ఇది అనేక రసాయనాలు ఉపయోగించి చేస్తారు. వాటిలో కొన్ని చర్మానికి చికాకు పెడతాయి. కొన్ని సార్లు మచ్చలు కూడా ఏర్పడవచ్చు.


కనుబొమ్మలపై సబ్బు పెట్టడం


కనుబొమ్మల మీద జుట్టు స్ట్రోక్స్ ఇవ్వడం కోసం సబ్బు పూస్తారు. దాని వల్ల వెంట్రుకలు రాలిపోయేంత బలహీనంగా మారిపోతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: గ్యాస్ స్టవ్ మీద జిడ్డు వదిలించాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి