Brain Stroke : తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల రక్తపోటు ఉన్నవారిలో బ్రెయిన్ స్ట్రోక్,  రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం, శుక్రవారం తేలికపాటి వర్షపాతంతో, ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. డజన్ల కొద్దీ ప్రజలు బ్రెయిన్ స్ట్రోక్స్, అతిశీతల వాతావరణం వల్ల గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.


చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే..


శీతాకాలంలో ప్రజలు తమను తాము సురక్షితంగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చల్లటి వాతావరణంలో అకస్మాత్తుగా రక్తపోటు పెరగడం వల్ల చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి గాలులు వీచే సమయంలో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 


ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ధమనుల్లో అడ్డంకి ఫలితంగా మెదడుకు చేరే రక్త కణాలు అకస్మాత్తుగా తగ్గిపోవడం లేదా చనిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లు తరచుగా వాతావరణం మార్పుల వల్ల ఏర్పడతాయట.


రక్తపోటు అకస్మాత్తుగా పెరగడం వల్ల మెదడు లేదా గుండెకు రక్త ప్రవాహంలో అంతరాయం ఏర్పడటం వల్లే ఇలా జరుగుతుందట. ముఖ్యంగా చల్లని వాతావరణం అధిక బీపీకి కారణం అవుతుంది. గుండె స్పందనలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఎందుకంటే శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. చలి తీవ్రత పెరిగినప్పుడు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోర్ వంటివి వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 


బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందనడానికి ముందస్తు సంకేతాలు ఇలా ఉంటాయి:


మైకము, మాట్లాడేటప్పుడు తడపబటం, దృష్టిలో ఇబ్బందులు, సమతుల్యతలో సమస్యలు, ముఖం, చేయి, కాలులో తిమ్మిరి, బలహీనత ఎలాంటి కారణం లేకుండా తీవ్రమైన తలనొప్పి రావడం వంటి సమస్యలు ఉంటాయి. ఛాతీ నొప్పి లేదా అసౌకర్యంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది దవడ, మెడ, వీపు , చేయి లేదా భుజంలో నొప్పి వికారంగా, తేలికగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.


స్ట్రోక్ నివారణ కోసం  చికిత్స: స్ట్రోక్ చికిత్స రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, రక్తాన్ని పలచబరిచే మందులు భవిష్యత్తులో స్ట్రోక్‌లను నివారించడానికి డాక్టర్లు  సూచించవచ్చు.
శస్త్రచికిత్స: కొన్ని సందర్భాల్లో, రక్త నాళాలను సరిచేయడానికి, రక్తనాళాల్లో బ్లాకులను తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు.


Also Read : ఇన్​స్టాంట్ ఇడ్లీ రెసిపీ.. మరమరాల(బొరుగులు)తో ఈజీగా చేసేయొచ్చు










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.