అతడు గత మూడు రోజులుగా మలబద్ధకంతో బాధపడుతున్నాడు. దీంతో కడుపునొప్పి కూడా బాగా పెరిగిపోయింది. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని చూసి భార్య జాలిపడింది. హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. వైద్యులు తొలుత అది సాధారణ కడుపునొప్పని భావించారు. కానీ, అసలు విషయం తెలిసి షాకయ్యారు. చివరికి అతడి భార్య కూడా.. అతడి చేసిన పనికి ఆశ్చర్యపోయింది. నీకు ఇదేం పోయేకాలమంటూ మండిపడింది. ఇంతకీ ఏమైందంటే..
ఇరాన్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి మూడు రోజులుగా ఆహారం తీసుకోవడం లేదు. కడుపునొప్పి, మలబద్ధకంతో బాధపడ్డాడు. అతడికి సిటి స్కాన్ నిర్వహించగా మలద్వారంలో 250 ఎం.ఎల్. బాటిల్ కనిపించింది. మరో చిత్రం ఏమిటంటో ఆ బాటిల్‌లో నీరు కూడా ఉంది. ఆ బాటిల్ పాయువులోని ద్వారంలో ఇరుక్కుపోవడం వల్ల అతడికి మూడు రోజులుగా మలవిసర్జన కావడం లేదు. బాటిల్ కనుగొన్న వెంటనే వైద్యులు సర్జరీ చేసి దాన్ని బయటకు తీసేశారు.
డాక్టర్లు బాధితుడి పేరును గోప్యంగా ఉంచారు. ఆ బాటిల్ పగిలిపోలేదు. పైగా అది పేగులను కూడా చీల్చలేదు. దీంతో వైద్యులు పని సులభమైంది. అయితే, సర్జరీ సమయంలో అతడికి తీవ్రమైన నొప్పి కలిగింది. దీంతో నొప్పిని తగ్గించేందుకు అనస్థీషియా ఇచ్చారు. అంతర్గత గాయాలు, రక్తస్రావం కాకుండా వైద్యులు ఎంతో జాగ్రత్తగా ఆ బాటిల్‌ను బయటకు తీశారు.
సర్జరీ తర్వాత అతడిని ఐదు రోజులు హాస్పిటల్‌లోనే ఉంచారు. అబ్జర్వేషన్ తర్వాత అతడిని డిశ్చార్జ్ చేశారు. ఈ పరిస్థితి వల్ల అతడు డిప్రెషన్‌కు గురయ్యాడు. దీంతో అక్కడి నుంచి అతడిని మానసిక వైద్యశాలకు తరలించారు. అయితే, బాటిల్ అక్కడకి ఎలా చొప్పించుకున్నావనే వైద్యులు అతడిని ప్రశ్నించగా.. లైంగిక తృప్తి కోసమే తాను అలా చేశానని వెల్లడించాడు. కొద్ది కొద్దిగా అది లోపలికి వెళ్లి ఇరుక్కుపోయిందని, బయటకు చెప్పుకుంటే సిగ్గపోతుందని ‘దాన్ని’ తనలోనే దాచుకున్నానని తెలిపాడు.
వైద్య చరిత్రలో ఇలాంటివి చాలానే చోటుచేసుకున్నాయని నిపుణులు వెల్లడించారు. ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు సీసాలు, దోసకాయలు, బల్బులు, ట్యూబ్ లైట్లు, గొడ్డలి హ్యాండిల్స్, చీపుర్లు, క్యారెట్లు, చెక్క, రబ్బరు వాయిద్యాల వంటివి మలద్వారంలోకి చొప్పించుకున్న కేసులు ఉన్నాయన్నారు. ఇలాంటి పనులు చేసే వ్యక్తుల్లో ఎక్కువ మంది 30 నుంచి 40 ఏళ్ల వయస్సువాళ్లు ఉన్నారని వివరించారు. ఈ వస్తువుల వల్ల అంతర్గత గాయాలై, రక్తస్రావం జరిగిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయన్నారు. ఈ వివరాలన్నీ నికల్ కేస్ రిపోర్ట్స్‌లో పేర్కొన్నారు.
Also Read: ప్రియురాలి చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్
Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!