నందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సలాడ్ డిష్ ఏదైనా ఉందంటే అది కీరా దోసకాయ అని చెప్పాలి. ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగించే కీరా దోసకాయను పచ్చిగానే తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. కీరా దోసకాయను పోషకాల గని అని కూడా అంటారు. నిజానికి కీరదోసకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. అయినప్పటికీ కీరా దోసకాయను తినడం ద్వారా శరీరం హైడ్రేట్ అవుతుందని, అలాగే బరువు తగ్గడానికి కూడా కీరా దోసకాయ అద్భుతంగా పనిచేస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.


కీర దోసకాయలను సలాడ్స్, శాండ్‌విచ్‌లతో ఎక్కువగా తింటారు. అయితే కీరా దోసకాయను సవికాలంలో తీసుకోవడం సహజమే. కానీ చలికాలంలో కూడా కీరా దోసకాయలను తినాలని, తద్వారా మీ శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు లభిస్తాయని డైటీషియన్లు చెబుతున్నారు. మీ శీతాకాలపు డైట్ లో కీర దోసకాయను ఎందుకు జోడించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


కీర దోసకాయలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:


జీర్ణక్రియకు చాలా మంచిది: కీర దోసకాయ వల్ల జీర్ణ ప్రక్రియకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కీర దోసకాయలలో కరిగే ఫైబర్ మన జీర్ణక్రియకు చాలా  సహాయపడుతుంది. కీర దోసకాయలలో ఉండే అధిక నీటి కంటెంట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగు కదలికలకు దోహదం చేస్తుంది. 


చర్మం మెరిసేలా చేస్తుంది :


కీర దోసకాయలు: మీ సౌందర్యాన్ని పెంచేందుకు చాలా ఉపయోగపడుతుంది. కీర దోసకాయ రసాన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. కీర దోసకాయలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మన చర్మాన్ని సహజంగా కాంతివంతం చేస్తాయి.


గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది:


కీర దోసకాయలు డైటరీ ఫైబర్, మెగ్నీషియం  పొటాషియం  అద్భుతమైన మూలం. ఈ పోషకాలు రక్తపోటును తగ్గించగలవని బాగా గుర్తించబడింది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది:


కీర దోసకాయలలో సిలికా పుష్కలంగా ఉంటుంది, ఇది మీ జుట్టుకు చాలా మంచిది.  మీ వెంట్రుకలను కుదుళ్ల నుంచి  బలం చేకూర్చడంలో కీర దోసకాయలు సహాయపడతాయి.


శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది:


కీర దోసకాయ మీ శరీరం డిహైడ్రేషన్  బారిన పడకుండా కాపాడుతుంది.  ముఖ్యంగా శీతాకాలంలో దాహం వేయక పోవడం వల్ల  తక్కువగా నీటిని తాగుతాము.  దీని కారణంగా శరీరం డిహైడ్రేషన్ కు గురవుతుంది.  ఇలాంటి సమయంలో కీరా దోసకాయలు తీసుకోవడం ద్వారా.  శరీరం హైడ్రేట్ అవుతుంది. 


ఊబకాయం తగ్గిస్తుంది:


కీర దోసకాయలు బరువు తగ్గడానికి  ఉపయోగపడతాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కీర దోసకాయలు ఎక్కువగా తినడం వల్ల  ఆకలి అవదు.  తద్వారా బరువు పెరగరని నిపుణులు సూచిస్తున్నారు. 


బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది:  


కీర దోసకాయలు రక్తంలో చక్కెరను తగ్గించడానికి  చాలా ఉపయోగపడతాయి. ఈ మేరకు మధుమేహానికి సంబంధించిన వివిధ ప్రయోగాలలో కూడా నిరూపించారు. క్లినికల్  రీసెర్చ్ లో కీర దోసకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా  నియంత్రిస్తాయని కూడా  శాస్త్రవేత్తలు నిరూపించారు.


Read Also : మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.