Fruits health benefits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్నిపండ్లలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కొన్నిట్లో పోషకాలు లేకున్నా టేస్టీగా ఉంటాయి. అరటి, మామిడి, బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అయితే, పండ్లు తినడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందట. అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి. పండ్లను సరైన విధానాల్లో తినకపోతే తిప్పలు తప్పవట. ఇంతకీ ఆ విధానాలేమిటీ? పండ్లు తినేప్పుడు మనం తరచు చేసే తప్పులేంటో తెలుసుకుందాం.


భోజనం తర్వాత పండ్లు తినొద్దు


పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. అయినప్పటికీ భోజనం చేసిన వెంటనే పండ్లను తినకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భోజనం తర్వాత పండ్లు తింటే జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. భోజనం కాగానే పండ్లు తింటే అందులోని ఎంజైమ్స్ విచ్చిన్నమై ఆహారంతో కలిసిపోతాయి. దీంతో పొట్టలో సమస్యలు వస్తాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పండ్లకు త్వరగా జీర్ణమయ్యే గుణం ఉంటుంది. ఇతర పదార్థాలతో కలిపి తిన్నప్పుడు మాత్రం జీర్ణవ్యవస్థ నెమ్మదిగా మారుతుంది. పొట్టలో అసౌకర్యం మొదలవుతుంది. అందుకే పండ్లను విడిగా తీసుకోవాలి. రాత్రిపూట నిద్రకు రెండు లేదా మూడు గంటల ముందు నుంచీ పండ్లు తినకూడదు. పొట్టనిండా పండ్లు తిని నిద్రిస్తే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.


అన్ని రకాల పండ్లు కలిపి తినొద్దు


ఇక చాలా మంది పండ్లు ఆరోగ్యానికి మంచివని ...అన్ని రకాలు కలిపి తింటుంటారు. దాని వల్ల మీ కడుపు ఓవర్ లోడ్ అవుతుంది. ఫలితంగా కడుపులో సమస్యలు వస్తాయి. మీరు ఏవైనా పండ్లు తింటుంటే 1 లేదా 2 పండ్ల కలిపి మాత్రమే తినండి. పండ్లు త్వరగా జీర్ణం అవుతాయి. కాబట్టి, పండును పండుగానే తినండి. చాలా మంది జ్యూస్ రూపంలో తీసుకుంటారు. పండుగా తింటేనే పోషకాలన్నీ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 


ఏ సమయంలో పండ్లు తింటే మంచిది?


పండ్లను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య తినడం మంచిది. ఎందుకంటే పండ్లు త్వరగా అరుగుతాయి. వీటిలో చక్కెర ఎక్కువ శాతం ఉంటుంది. పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మనం నిద్రిస్తున్న సమయంలో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. రక్తసరఫరాలో మార్పులు ఉంటాయి. ఆ సమయంలో శరీరం అన్ని పోషకాలను గ్రహించలేదు. ఫలితంగా ఎసిడిటీ పెరుగుతుంది. కాబట్టి పండ్లను మధ్యాహ్నం తినడం మంచిది. 


పండ్లు తిన్నాక నీళ్లు తాగొద్దు


మనలో చాలా మంది పండ్లను తినగానే నీళ్లు తాగుతుంటారు. పుచ్చకాయ, ఖర్జూర, దోస, నారింజ, స్ట్రాబెర్రీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్న వెంటనే నీళ్లు తాగితే పీహెచ్ స్థాయిలో మార్పులు వస్తాయి. దీంతో డయేరియా లేదా కలరా సమస్యలు వస్తాయి. పండ్లు తిని తొక్క పారేసే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఇది అస్సలు మంచిది కాదు. వాటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాపిల్ పండ్ల తొక్కలో ఫైబర్ విటమిన్ సి, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. వీటిని తొక్కతోనే తినడం వల్ల పోషకాలన్నీ అందుతాయి. ఊబకాయం కూడా తగ్గుతుంది. క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు. 


Also Read : చలికాలంలో సన్​షైన్​ విటమిన్ చాలా అవసరమట.. ఎందుకంటే..











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.