DIY Beauty Tips : వాతావరణంలో మార్పులు, ఇతర కారణాలతో స్కిన్​ డల్​గా మారిపోతుందా? అయితే మీరు మీ స్కిన్​ని మళ్లీ సాధరణ స్థితికి తీసుకురావాలన్నా.. ఫేస్​లో గ్లోని పెంచుకోవాలన్నా మీరు పార్లర్​కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండే వస్తువులతో చర్మంపై ఉన్న డర్ట్​ని, ట్యాన్​ని తొలగించుకుని మెరిసే గ్లోయింగ్ చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఫేస్​ప్యాక్స్ ఏంటి? వాటితో కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

తేనె, కాఫీ పౌడర్ ఫేస్ ప్యాక్

తేనెను కాఫీ పౌడర్​ను సమానంగా తీసుకుని బాగా కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి.. పదిహేను నిమిషాల తర్వాత కడిగాలి. ఈ ప్యాక్​తో మీరు స్కిన్​లో మంచి మార్పులు చూస్తారు. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుంది. డల్​నెస్ పోతుంది. తేనెలోని మాయిశ్చర్ చర్మానికి అందుతుంది. కాఫీ చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేసి.. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలని తొలగిస్తుంది. 

బియ్యం పిండితో ఫేస్ ప్యాక్

బియ్యం పిండి చర్మంపై ఉన్న ట్యాన్​ని తొలగించడంలో మంచి ఫలితాలు చూపిస్తుంది. దీనితో ఫేస్ ప్యాక్ చేసుకునేందుకు బియ్యం పిండిలో బంగాళదుంప జ్యూస్, అలొవెరా జెల్, నిమ్మరసం, టమాటా రసం వేసి బాగా మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. దీనిని 20 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. ఈ ప్యాక్​ని వారానికి రెండుసార్లు వేసుకుంటే ట్యాన్ క్రమంగా తగ్గుతుంది. చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. స్కిన్ కాంప్లెక్షన్ తగ్గి.. చర్మం నిగారిస్తుంది. 

టొమాటో, పెరుగు ఫేస్ ప్యాక్ 

స్కిన్​ గ్లో రావడం, హెల్తీ స్కిన్ కోసం మీరు ఈ ప్యాక్​ని ట్రై చేయవచ్చు. టొమాటో గుజ్జు, పెరుగు సమానంగా తీసుకోవాలి. దానిలో ఓ టీస్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. టొమాటోలోని పోషకాలు, మినరల్స్ చర్మంపై డార్క్ స్పాట్స్​ని తగ్గిస్తాయి. స్కిన్ మెరిసేలా చేస్తాయి. పెరుగు హైడ్రేషన్​ని, పోషణను అందిస్తుంది. నిమ్మరసం కూడా స్కిన్​టోన్​ని మెరుగు పరచడంలో హెల్ప్ చేస్తుంది. మంచి గ్లో అందుతుంది.

పెరుగు, పసుపుతో ఫేస్ ప్యాక్ 

కీరదోసను తరిగి.. దానిలో పెరుగు, పసుపు వేసి పేస్ట్​గా చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి పావు గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది మీకు రిఫ్రెష్ ఫీలింగ్​ని ఇచ్చి.. చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. సహజంగా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. స్కిన్ ఇరిటేషన్​ని తగ్గించి.. ముఖానికి తాజాదనం తీసుకురావడంలో హెల్ప్ చేస్తుంది. 

శనగపిండి, గంధంతో ఫేస్ ప్యాక్

శనగపిండి, గంధం రెండూ కూడా అందాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. అయితే ఈ రెండింటీని కలిపి ఫేస్ ప్యాక్ చేసుకున్నప్పుడు వాటి ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఓ టీస్పూన్ శనగపిండిలో ఓ టీస్పూన్ గంధం పొడి వేయాలి. దానిలో అర టీస్పూన్ పసుపు, రోజ్ వాటర్​ వేయాలి. ఈ పేస్ట్​ని ముఖానికి అప్లై చేసి పావుగంట ఉంచుకోవాలి. ఇది చర్మంపై ఉన్న ఆయిల్​ని తొలగిస్తుంది. స్కిన్ ఇరిటేషన్​ని, పింపుల్స్​ని తగ్గిస్తుంది. కూలింగ్ ఎఫెక్ట్​ని ఇవ్వడమే కాకుండా చర్మం మెరిసేలా చేస్తుంది. 

ఈ ఫేస్​ ప్యాక్​లను మీరు డైలీ రొటీన్​లో చేర్చుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా ఫంక్షన్​కి వెళ్లేప్పుడు ఇన్​స్టాంట్​ గ్లో కోసం వీటిని ప్రయత్నించవచ్చు. రెగ్యులర్​గా ఈ ఫేస్ ప్యాక్​లు ట్రై చేస్తే మెరిసే, ఫ్రెష్ స్కిన్ మీ సొంతమవుతుంది.