Tips to Grow Bushy Curry Leaves Plant at Home : కూరలో కరివేపాకు తీసిపారేస్తారు కానీ.. కచ్చితంగా వంటల్లో దానిని ఉపయోగిస్తారు. ఇది వంటలకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే దీనిని బయట కొనడమే కాదు.. ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. కొన్ని రోజుల్లోనే దట్టమైన కరివేపాకు మొక్కను పెంచడానికి కొన్ని సులభమైన చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. మరి మీరు కూడా కుండీలో లేదా పెరట్లో కరివేపాకు పెంచుకోవాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

ఇంట్లో కుండీలో కరివేపాకు మొక్క పెంచడం కొందరికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పెరగడానికి బదులుగా వాడిపోతూ ఉంటుంది. దీంతో చాలామంది.. దానిని పెంచడం కష్టం అనుకుంటారు. అలాగే కరివేపాకు చెట్టు పొడవుగా పెరిగి.. ఆకులు తగ్గడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా కరివేపాకు చెట్టు దట్టంగా పెరగాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో.. ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

కత్తిరించండి.. 

కరివేపాకు మొక్క పచ్చగా, దట్టంగా పెరగాలంటే.. మీరు చేయవలసిన మొదటి పని దానిని కత్తిరించడం. అవును మొక్క పైకి పెరగడం ప్రారంభించినప్పుడు.. పై కొమ్మలోని ఒక చిన్న భాగాన్ని కత్తిరించండి. దీనివల్ల మొక్క తన శక్తిని పైకి కాకుండా కొత్త కొమ్మలు రావడానికి హెల్ప్ చేస్తుంది. కొన్ని రోజుల్లోనే.. కత్తిరించిన ఆ ఒక్క కొమ్మ స్థానంలో అనేక కొత్త కొమ్మలు మొలకెత్తడాన్ని మీరు చూస్తారు.

Continues below advertisement

మొక్కకు పోషణ

మొక్కలు బాగా పెరగాలంటే సరైన పోషణ ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి మిగిలిపోయిన మజ్జిగ లేదా పుల్లటి పెరుగును కరివేపాకుకు వేయవచ్చు. పుల్లటి మజ్జిగలో కొద్దిగా నీళ్లు కలిపి మొక్క వేళ్ళపై పోయండి. కరివేపాకులో ఉండే నత్రజని, ప్రయోజనకరమైన బ్యాక్టీరియా నేల సారవంతాన్ని పెంచి.. వాటికి ప్రకాశవంతమైన మెరుపును ఇస్తాయి. అలాగే బియ్యం కడిగిన నీటిని కూడా వేయవచ్చు. 

ఆ తప్పు చేయకండి..

చాలామంది కరివేపాకు మొక్కలకు తెలియకుండానే ఎక్కువగా నీరు పోస్తుంటారు. దీనివల్ల వేళ్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.  కాబట్టి కుండీలోని పై మట్టి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే దానికి నీరు పోయాలి. అదనపు నీరు బయటకు పోవడానికి కుండీకి మంచి పారుదల వ్యవస్థ ఉండేలా చూసుకోవాలి. మొక్కకు తగినంత తేమ అందినప్పుడు మాత్రమే అది వేగంగా పెరుగుతుంది.

ఎండలో పెరుగుతుందా?

కరివేపాకుకు సూర్యరశ్మి ప్రాణవాయువు వంటిది. దీనిని రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు మంచి సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచండి. కాబట్టి ఎండకాలంలో కూడా దీనిని ఈజీగా పెంచుకోవచ్చు. మొక్కను పూర్తిగా నీడలో ఉంచితే.. దాని ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. సూర్యరశ్మి కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల మొక్క లోపల బలంగా, బయట దట్టంగా కనిపిస్తుంది.

కలుపు తీసేయండి..

కరివేపాకు వేసిన ప్రదేశంలోని మట్టిలో కలుపును క్రమం తప్పకుండా తీసేయాలి. లేదంటే వేర్లకు ఆక్సిజన్ అందదు. నెలకు కనీసం రెండుసార్లు పారతో కుండీలోని మట్టిని పైకి కిందికి కదపండి. కలుపు తీసిన తర్వాత కొద్దిగా ఆవు పేడ ఎరువు లేదా వర్మీకంపోస్ట్ కలపడం వల్ల మొక్కకు అవసరమైన విటమిన్లు అందుతాయి. ఇవి మొక్క పొదలా పెరగడానికి హెల్ప్ అవుతాయి. 

ఈ చిన్న విషయాల పట్ల మీరు శ్రద్ధ తీసుకంటే.. మీ కరివేపాకు మొక్క గుబురుగా, దట్టంగా, అందంగా పెరుగుతుంది. దీనికి కావలసిందల్లా కొంచెం ఓపిక, సరైన సంరక్షణ మాత్రమే.