భారతీయుల ఆహారంలో పెరుగుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా మంది భోజనం చివర్లో పెరుగుతో అన్నం తిననిదే వాళ్ళకి కడుపు నిండిన ఫీలింగ్ రాదు. అందుకే తప్పనిసరిగా పెరుగు తీసుకుంటారు. ఎన్నో పోషకాలు కలిగిన పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి కాలంలో పెరుగుతో అన్నం తింటే చాలా హాయిగా అనిపిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దంతాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పెరుగు చాలా అవసరం. అయితే కొంతమంది పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకుంటారు.


వేసవితాపం నుంచి ఉపశమనం లభించాలంటే చల్లని మజ్జిగలో కొద్దిగా నిమ్మకాయ, కొత్తిమీర, ఉప్పు వేసుకుని తాగితే అద్భుతంగా ఉంటుంది. శరీరం డీ హైడ్రేట్ నుంచి కాపాడేందుకు ఇంతకి మించింది మరొకటి లేదు. పెరుగు తింటే జలుబు చేస్తుందని అంటూ కొంతమంది మజ్జిగ తీసుకుంటారు. అదేంటి రెండు ఒకదానివే కదా అలా ఎందుకు ఉంటుందనే అపోహ అందరిలోనూ ఉంటుంది. రెండు పోషకాలతో నిండి ఉన్నావే అయినప్పటికీ పెరుగు కంటే మజ్జిగే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెప్తోంది. పెరుగు కంటే మజ్జిగ వల్లే అధిక లాభాలు ఉన్నాయి. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు పెరుగుకి బదులుగా మజ్జిగ తీసుకుంటే చక్కని ఫలితం పొందుతారు.


ఆహారం ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యానికి ఉత్తమమైన వాటిని ఎంచుకోవడం సవాలుతో కూడుకున్నది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళ విషయంలో అయితే మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎంచుకునే ఆహారం శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి వాళ్ళు పెరుగు కంటే మజ్జిగని ఎంచుకోవడం మేలైన ఎంపిక.


మజ్జిగ వల్ల ప్రయోజనాలు


జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది: పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అసిడిక్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉంటే పెరుగుకు దూరంగా ఉండాలి. దానికి బదులుగా మజ్జిగను తీసుకుంటే మంచిది. అది కూడా తీపి మజ్జిగ తీసుకోవడం మంచిది.


బరువు తగ్గడానికి: పెరుగు బరువు పెరిగేందుకు సహకరిస్తుంది. అదే బరువు తగ్గాలని డైట్ పాటిస్తుంటే పెరుగుకు ప్రత్యామ్నాయంగా మజ్జిగ తీసుకోవచ్చు. తక్కువ పెరుగు వేసుకుని నీళ్ళు ఎక్కువగా పోసుకుని మజ్జిగ చేసుకుని తాగితే చాలా మంచిది.


కాంతివంతంగా ఉంచుతుంది: పెరుగు వేడి శక్తిని కలిగి ఉంటుంది. కానీ దానితో వచ్చే మజ్జిగ మాత్రం చలువ చేస్తుంది. అందుకే వేసవి కాలంలో మజ్జిగ తీసుకోవడం వల్ల డీ హైడ్రేట్ నుంచి బయటపడొచ్చు. మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం కలుకుని తాగితే అవి ఇంకా రుచిగా ఉంటాయి.


రాత్రి పూట అన్నం తిన్న తర్వాత పెరుగు తినకూడదు అని అంటారు. ఆయుర్వేదం ప్రకారం పెరుగును రాత్రి పూట తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది అసమతుల్యతలకు కారణం అవుతుంది. ముక్కులో అధికంగా శ్లేష్మం పెరిగేలా చేస్తుంది. దగ్గు జలుబుకు కారణం అవుతుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. 


Also Read: మీ పిల్లల ముందు ఇలా చేస్తున్నారా? దాని ఫలితం మీరు ఊహించలేరు


Also Read: మీ మూడ్ మార్చే సూపర్ ఫుడ్స్ - ఇవి తింటే రిఫ్రెష్ అయిపోతారు