Medical Test Predict Your Heart Attack Risk : చలికాలంలో గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ మధ్యకాలంలో ఒత్తిడి వల్ల కూడా హార్ట్ ఎటాక్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వచ్చి ప్రాణాంతకమవుతుంది. కొన్ని సందర్బాల్లో శరీరం ఇచ్చే సంకేతాలు గుర్తించడంతో పాటు.. అప్రమత్తంగా ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. అలాగే CT Coronary Calcium Score టెస్ట్ చేయించుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంది అంటున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

CT Coronary Calcium Score (CT CAC / Calcium Score Test) గురించి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రఘు వంశీ తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ పెట్టారు. హార్ట్ ఎటాక్ వస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటే CT Coronary Calcium Score చేయించుకుంటే చాలని చెప్తున్నారు. ఈ ఒక్క టెస్ట్ ద్వారా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలలో కాల్షియం (Calcium) పేరుకుపోయిందా లేదా అనేది తెలుసుకోవచ్చని చెప్తున్నారు. దీనివల్ల హార్ట్ ఎటాక్ ప్రమాదం గురించి ఈజీగా తెలుసుకోవచ్చని చెప్తున్నారు. 

కాల్షియం పేరుకుపోవడం అంటే..

గుండె ధమనుల్లో కొవ్వు (Plaque) ఏర్పడుతోందన్న సంకేతాన్ని ఇది సూచిస్తుంది. దీనినే కాల్షియం పేరుకుపోవడం అంటారు. ఇది భవిష్యత్తులో హార్ట్ ఎటాక్ ప్రమాదం ఎంత ఉందో అంచనా వేసేందుకు హెల్ప్ చేస్తుంది. 

ఈ టెస్ట్ వల్ల ఏమేమి తెలుసుకోవచ్చు..

గుండె ధమనుల్లో బ్లాకేజీ ప్రారంభ దశలో ఉందా? లేదా అని తెలుస్తుంది. ఇప్పుడే లక్షణాలు లేకపోయినా భవిష్యత్తులో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. జీవనశైలి మార్పులు లేదా మందులు అవసరమా? స్టాటిన్ (కొలెస్ట్రాల్ మందులు) ప్రారంభించాలా వద్దా? అని ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. 

ఈ టెస్ట్ ఎవరు చేయించుకుంటే మంచిదంటే.. 

వయసు 40–70 సంవత్సరాలు మధ్య ఉన్నవారు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవారు, స్మోకింగ్ చేసేవారు, స్థూలకాయంతో ఇబ్బంది పడేవారు, ఛాతినొప్పి లేకపోయినా అనుమానం ఉన్నవారు ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇప్పటికే హార్ట్ అటాక్ వచ్చినవారికి ఇది అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.