Dextromethorphan hydrobromide cough syrup: రాజస్థాన్‌లో దగ్గు సిరప్ కారణంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కొందరు చిన్నారులు దగ్గు సిరస్ వాడిన తరువాత అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో సెప్టెంబర్ నెలలో ఆరుగురు చిన్నారులు మూత్రపిండాల ఇన్ఫెక్షన్ల కారణంగా చనిపోయారు. ఇలాంటి దగ్గు సిరస్ లను తీసుకున్న తర్వాత చిన్నారులు మరణించారని కూడా నివేదికలో తేలింది. దాంతో రాజస్థాన్‌లోని డ్రగ్ కంట్రోలర్ వెంటనే దగ్గు సిరప్ వాడకాన్ని నిషేధించి, పరీక్షల కోసం ప్రయోగశాలకు నమూనాలను పంపింది. సిరప్‌లో డయెథిలీన్ గ్లైకాల్ (DEG) వంటి విషపదార్థాల కారణంగా ఈ మరణాలు జరిగాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర డ్రగ్ కంట్రోలర్ జనరల్ (CDSCO) నేతృత్వంలో దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు అందించే దగ్గు సిరప్‌లు పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. సికార్‌లో 5 ఏళ్ల బాలుడు, భరత్‌పూర్‌లో 4 ఏళ్ల బాలిక, జైపూర్‌లో 2 ఏళ్ల చిన్నారి, దగ్గు సిరప్‌లతో అనారోగ్యానికి గురయ్యారు. అయితే రాజస్థాన్‌లో పిల్లల అనారోగ్యాలకు కారణమైన దగ్గు సిరప్ డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ (Dextromethorphan hydrobromide) దగ్గు సిరప్. దాంతో దాని ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ గురించి చర్చ జరుగుతోంది.
డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్..దగ్గు నివారణకు ఉపయోగించే ఓ సిరప్ పేరు డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్. దీన్ని 1950లలో రూపొందించారు. భారత్ సహా పలు దేశాల్లో చిన్నారుల దగ్గు సమస్యలకు ఈ సిరస్ వాడుతున్నారు.
డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ అనేది ప్రధానంగా పొడి దగ్గు నివారణకు ఉపయోగిస్తారు. ఇది మెదడులో దగ్గును ప్రేరేపించే సంకేతాలను నిరోధించడం ద్వారా చిన్నారుల అనారోగ్య సమస్యపై పనిచేస్తుంది. దాంతో దగ్గు తగ్గి పేషెంట్లకు ఉపశమనం కలుగుతుంది. ఈ కాఫ్ సిరప్‌ను కెమికల్ ప్రాసెసింగ్ ద్వారా తయారు చేస్తారు. ఇందులో క్రియాశీల సమ్మేళనంగా డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ (Dextromethorphan HBr) ఉంటుంది. దీన్ని సిరప్ రూపంలో వినియోగించాలి. ఈ సిరప్ తీసుకుంటే పెద్దలతో పాటు చిన్నారులకు దగ్గు, పొడి దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ దగ్గు సిరప్ ఎవరు వాడాలిడెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ (Dextromethorphan hydrobromide) కఫ్ సిరస్‌ను దగ్గును తగ్గించే మెడిసిన్‌గా డాక్టర్లు సూచిస్తారు. పెద్దలు, చిన్నారులు వైద్యుల చూచనతో ఇది వాడాలి. చిన్న పిల్లలు ఇది వాడటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలకు ఈ సిరప్ ఇవ్వకూడదు. అదే 2 సంవత్సరాల నుంచి 6 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు డాక్టర్లు సూచించిన మోతాదులో సిరప్ ఇవ్వాలి. 6 ఏళ్ల కంటే ఎక్కువ వయసు పిల్లలు, పెద్దలు ఈ సిరస్ వాడవచ్చు. కానీ డాక్టర్లు చెప్పిన మోతాదులో తీసుకోవాలి. ఢిల్లీకి చెందిన ఇంటర్నల్ మెడిసిన్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ మాట్లాడుతూ.. తగిన మోతాదులో, డాక్టర్ ప్రిస్క్రిప్షనలతో వయోజనులు ఇది ఉపయోగంచాలన్నారు. మహిళలు సైతం సిరప్ తీసుకోవాలని సూచించారు. ఈ సిరస్ దగ్గు నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది.
డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి..ఈ సిరప్ వాడకం ద్వారా కొంతమందిలో నిద్రలేమి, తలతిరగటం సమస్య వస్తుంది. కొందరికి స్వల్ప కడుపు నొప్పి, వికారం అనిపిస్తుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇది అలెర్జీకి దారితీస్తుంది. కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కూడా కలిగిస్తుందని కొందరు డాక్టర్లు చెబుతున్నారు. కాలేయం, మూత్రపిండాల సమస్య, ఇతర పెద్ద అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించి.. వారి సలహాతోనే ఇది వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
జైపూర్: భరత్‌పూర్, సికార్ జిల్లాల్లో ఇద్దరు పిల్లల మరణాలకు రాష్ట్ర ఉచిత వైద్య పథకం కింద పంపిణీ చేసిన దగ్గు సిరప్ కారణం కాదని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య డైరెక్టర్ రవి ప్రకాష్ శర్మ మాట్లాడుతూ.. విచారణ నివేదికల ప్రకారం, రెండు కేసుల్లోనూ పిల్లలకు వైద్యుల సలహా లేకుండా ఇంట్లో సిరప్ ఇచ్చారని నిర్ధారించారు. డెక్స్ట్రోమెథోర్ఫాన్ (DXM) ఔషధాన్ని పిల్లలకు ఇవ్వకూడదు. కేవలం వైద్యుల సలహాతోనే వాడాలని శర్మ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ రెండు ఘటనల్లోనూ డాక్టర్లు ఈ దగ్గు సిరప్‌ను సూచించలేదని తెలిపారు.