Prevent Constipation in Winter : శీతాకాలంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మలబద్ధకం కూడా ఒకటి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాతావరణం చల్లగా ఉండడం వల్ల నీరు తక్కువ తాగడం, శారీరక శ్రమ ఎక్కువలేకపోవడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వంటివి జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. కాబట్టి చాలామంది శీతాకాలంలో మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటుంటారు. మరి దీనిని నివారించడానికి ఫాలో అవ్వాల్సిన సులభమైన ఆరోగ్య చిట్కాలు ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

చలికాలంలో లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులు వస్తాయి. దీంతో ఉదయాన్నే నిద్రలేవడం, మార్నింగ్ వాక్​కి వెళ్లడం లేదా వ్యాయామం వంటి వాటికి వెళ్లేందుకు ఇష్టపడరు. అలాగే చలితో దాహాం కూడా తగ్గుతుంది. దీనివల్ల శరీరానికి తగినంత నీరు అందదు. అలాగే వేయించిన ఫుడ్స్, వేడి వేడి భోజనం, స్వీట్ తినాలనే క్రేవింగ్స్ పెరుగుతాయి. ఈ అలవాట్లు క్రమంగా మన ఆరోగ్యం, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి మలబద్ధకాన్ని పెంచుతాయి.

Also Read : చలికాలంలో పుట్టగొడుగులు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? డైట్‌లో చేర్చుకోవడం లాభమా? నష్టమా?

Continues below advertisement

నీరు ఎక్కువ తాగండి 

శీతాకాలంలో దాహం తక్కువగా అనిపించడం సహజం. వేసవిలో తాగినంత తరచుగా నీరు తాగాలని మీకు అనిపించకపోవచ్చు, కానీ దీని అర్థం మీ శరీరానికి తక్కువ నీరు అవసరమని కాదు. మీరు తగినంత నీరు తీసుకోకపోతే.. మలం పొడిగా, గట్టిగా మారి, బయటకు విసర్జించడం కష్టమవుతుంది. అందుకే శీతాకాలంలో నీరు ఎక్కువగా తాగాలి. కుదిరితే గోరువెచ్చని నీరు, సూప్, ఇతర ద్రవపదార్థాలను తీసుకోవాలి. 

శారీరక శ్రమ తగ్గడం

శీతాకాలంలో బద్ధకం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. దీంతో ఉదయం నడక మానేయడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటం వంటివి కూడా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. శారీరక శ్రమ సాధారణ పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. యాక్టివిటీ లేకుంటే పేగు కదలికలు మందగిస్తాయి. ఇది మలబద్ధకాన్ని పెంచుతుంది. 

కాబట్టి ఉదయం లేదా తిన్న తర్వాత కాసేపు నడవండి. శరీరాన్ని స్ట్రెచ్ చేయడం, యోగా చేయడం కూడా మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. 

Also Read : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది

ఆహారపు అలవాట్లు

చలికాలంలో ఆహారపు అలవాట్లు మారుతాయి. పరాటాలు, పకోరాలు, స్వీట్లు, నూనె, మసాలా దినుసులు తినాలనే కోరికలు పెరుగుతాయి. చాలామంది పండ్లు, ఆకుకూరలు, సలాడ్లు వంటి పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువగా తింటారు. పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఫైబర్ తగ్గితే మలబద్ధకం మరింత పెరుగుతుంది. 

కాబట్టి మీ డైట్లో క్యారెట్లు, ముల్లంగి, పాలకూర, మెంతులు, జామకాయ, బొప్పాయి, ఓట్‌మీల్, తృణధాన్యాలను చేర్చుకోండి. పప్పుధాన్యాలు, ఇతర పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. 

Also Read : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.