Pros and Cons of Communication with Your Partner : ఏ రిలేషన్​కి అయినా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఇద్దరి మధ్య సంబంధం కొనసాగుతుందా లేదా ముగుస్తుందా అనే దానిని ఇది నిర్ణయిస్తుంది. ఎలాంటి సంబంధాన్ని అయినా హెల్తీగా మార్చడంలో కమ్యూనికేషన్ ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్నిసార్లు మాటలే ఎదుటివ్యక్తితో ఉన్న సంబంధాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. దీనివల్ల అవతలి వ్యక్తి గాయపడవచ్చు. చేతలకంటే మాటలే ఎక్కువగా గాయపరుస్తాయి. రోజులు మారేకొద్ది గాయాలు తగ్గుతాయి కానీ.. మాటలు మాత్రం బాధపెడుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదే మీ పార్టనర్​తో మాట్లేప్పుడు అయితే ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి.


మీ భాగస్వామికి బాధ కలిగిస్తోన్న మాటలు ఏంటో తెలుసుకోవడం కచ్చితంగా అవసరం. నలుగురిలో ఓ మాట అనేసి.. కామేడి చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అది అస్సలు మంచిది కాదు. అలాగే పార్టనర్​ని చాలామంది గ్రాంటెడ్​గా తీసుకుంటారు. దీనివల్ల వారు సరిగ్గా కమ్యూనికేట్ చేయరు. ఇలాగే ఎక్కువరోజులు కొనసాగితే అది మీ రిలేషన్​ని కచ్చితంగా బ్రేక్ చేసేస్తుంది. కాబట్టి మీ లైఫ్​లో ముఖ్యమైనవారితో ఇలా అస్సలు చేయకండి. పార్టనర్​తో మాట్లాడేప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తించుకోండి. అవేంటంటే..  


భాగస్వామితో మాట్లాడేప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు


మధ్యలో ఆపకండి : పార్టనర్​తో మాట్లాడేప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కమ్యూనికేషన్ ఎప్పుడూ ఎదుటివ్యక్తిని ఇబ్బంది పెట్టేలా లేదా గాయపడేలా ఉండకూడదు. ఉదాహరణకు.. మీ భాగస్వామి మీతో ఏదైనా విషయం షేర్ చేసుకుంటున్నప్పుడు వారి మాటలను మధ్యలో ఆపి.. మీ అభిప్రాయాలు చెప్పకూడదు. వారు చెప్పింది పూర్తిగా విని.. అర్థం చేసుకోవాలి. తర్వాత వారిని నొప్పించే విధంగా కాకుండా అర్థమయ్యేలా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి.


రెస్పెక్ట్ చేయండి : ఏదైనా విషయంలో మీతో మీ పార్టనర్ ఏదైనా షేర్ చేసుకుంటే.. దానితో ఏకీభవించినా లేదా విభేదించినా.. మీ పార్టనర్ ఫీలింగ్స్​ని రెస్పెక్ట్ చేయాలని గుర్తించుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మీ భాగస్వామి సలహా లేదా సూచన కోసం కాకుండా.. కేవలం మీరు తన ఫీలింగ్ అర్థం చేసుకోవాలని మాత్రమే మీతో ఏదైనా విషయం షేర్ చేసుకోవచ్చు. అప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పాలని కాకుండా.. నెగిటివ్​గా స్పందించకుండా ఉండేందుకు ట్రై చేయండి. ఎందుకంటే ఆ సమయంలో మీరు ఏదైనా చెప్తే..  అది వారికి మిమ్మల్ని దూరం చేస్తుంది.


అభిప్రాయాలు వేరైనా : ఇద్దరు వ్యక్తుల అభిప్రాయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కచ్చితంగా భిన్నంగా ఉంటుంది. అలాగే భాగస్వామి కూడా భిన్నంగా ఆలోచిస్తారు. కొన్ని సందర్భాల్లో అభిప్రాయాలు ఒకేలా ఉన్నా.. తర్వాత కాలంలో మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరిది తప్పు అనే దానిపై కాకుండా.. ఇద్దరూ అభిప్రాయాలు వ్యక్తం చేసి.. ఎలా సమస్యను బ్యాలెన్స్ చేయాలో చర్చించుకోవాలి. 


గతం.. గతః : ఏ రిలేషన్​లో అయినా నువ్వుది చేశావు నేను ఇది చేశానంటూ లెక్కలు వేస్తే.. కాలక్రమేణా అది విషపూరితం అవుతుంది. కాబట్టి ప్రతీసారి గతంలో జరిగినా విషయాలు తీసుకురాకుండా ఉండాలి. ఇలాంటివి ప్రస్తుతం ఉన్న మంచిని చూడకుండా చేస్తాయి. ప్రస్తుతం, ఫ్యూచర్ గురించే మీరు చర్చిస్తూ ఉండాలి.  ఎదుటి వ్యక్తి చెప్పే మాటాలను వ్యతిరేకించడం, తిరస్కరించడం, ఎదురు సమాధానం చెప్పడం లేదా భాగస్వామికి తప్పుగా సమాధానం చెప్పడం బంధాన్ని విషపూరితం చేస్తుంది.