The history of Christmas presents : క్రిస్మస్ సమయంలో గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయం పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది. అయితే ఇది పొరుగుదేశాల నుంచి తీసుకున్నా.. ఇక్కడి ప్రజలు ఆ సంప్రదాయాన్ని తమదైన శైలిలో అలవాటు చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీనే కాకుండా.. ఆఫీస్​లలో కూడా సీక్రెట్ శాంటా పేరుతో గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. 


వింటర్​లో వచ్చే క్రిస్మస్ చాలా కలర్​ఫుల్​గా ఉంటుంది. వైట్ స్నో, గ్రీన్ ట్రీలు, ఎర్రని లైట్లు, డ్రెస్​లు.. ఇలా చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఈ సమయంలో షాపింగ్ చేసేందుకు ఎన్నో ఆప్షన్లు దొరుకుతాయి. ఈ సమయంలో గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల తీసుకునే వ్యక్తికి అవి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇండియా ఏ విధంగా ఈ సంప్రదయాన్ని అలవాటు చేసుకుందో.. క్రిస్మస్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


వినయపూర్వకంగా..


బహుమతులంటే ఏవో పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్నవైనా సరే.. అవి ఎదుటి వ్యక్తిని ఆనందపడేలా చేస్తాయి. మీకు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తికి.. మీరు వినయంగా ఓ గిఫ్ట్ ఇస్తే.. అది మీ మధ్య సంబంధ బాంధవ్యాలను పెంచుతుంది. ఇక్కడ వస్తువు విలువ కంటే.. ఇచ్చే హృదయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 


కృతజ్ఞతతో..


క్రిస్మస్ బహుమతులు కృతజ్ఞతా భావాన్ని ప్రోత్సాహిస్తాయి. ఒకరు మనకు చేసిన హెల్ప్​కి గుర్తుగా లేదా వారు చేసిన కృషికి తగిన ఫలితంగా, లేదంటే వ్యక్తిని ప్రశంసిస్తూ.. బహుమతులు ఇవ్వొచ్చు. డిసెంబర్​లో వచ్చే ఈ పండుగ కోసం.. సంవత్సరమంతా ఆ వ్యక్తి పడిన కృషిని అభినందిస్తూ క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వొచ్చు. ఇది మీ మధ్య డీప్ కనెక్షన్​ని పెంచుతుంది. వారితో పాటు.. మీకు కూడా ఇదో బ్లెస్సింగ్​గా మారుతుంది.


సంబంధాలు పెంచుకునేందుకు


సంబంధాలకు ప్రాధన్యతనిస్తూ క్రిస్మస్ గిఫ్ట్స్ ఇవ్వొచ్చు. ఓ వ్యక్తితో మీకున్న సంబంధాన్ని బట్టి గిఫ్ట్స్ ఎంచుకోవచ్చు. అవి మీ రిలేషన్​లో కీలకంగా ఉంటాయి. గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా.. దానిని చూసినప్పుడల్లా తమకు మీరున్నారనే ఆలోచనను అందిస్తాయి. కాబట్టి కుటుంబం, ఫ్రెండ్స్​కి గిఫ్ట్ సెలక్ట్ చేసేప్పుడు కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. 


నో వ్యర్థం..


మీరు ఇచ్చే గిఫ్ట్స్ ఎల్లప్పుడూ వేస్ట్ కానివై ఉండాలి. ఇది వనరుల పట్ల మీ బాధ్యతను గుర్తు చేస్తుంది. అవసరం లేనివి లేదా వ్యర్థాలను కలిగించే గిఫ్ట్స్ ఇవ్వడం కంటే.. అసలు గిఫ్ట్ ఇవ్వకపోవడమే మేలు. వనరుల వ్యర్థాలను తగ్గించడమే లక్ష్యంగా మన బహుమతుల ఎంపిక ఉండాలి. ఇది పర్యావరణ హితానికి తోడ్పడుతుంది. 


క్రిస్మస్​కు ప్రతీకగా


మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్​కి క్రిస్మస్ సందేశం ప్రతిబింబించేలా గిఫ్ట్స్ ఇవ్వొచ్చు. జీసస్ పుట్టినరోజు థీమ్స్.. లేదా బైబిల్​లోని వ్యాక్యాలు ఉండేలా కొన్ని గిఫ్ట్స్ రెడీ చేయించి ఇవ్వొచ్చు. ఇవి వారి పట్ల మీకున్న గౌరవాన్ని ప్రతిబింబిపజేస్తాయి. ఇచ్చే ఏ గిఫ్ట్​ అయినా.. ఆడంబరాలకు పోయి ఇవ్వకూడదనేది గుర్తించుకోవాలి. ఎదుటి వ్యక్తి అవసరానికి లేదా ఇష్టానికి తగినట్లు ఉండేలా చూసుకోవాలి. ఇవి మీలోని వినయం, కృతజ్ఞత, నిరాడంబరతకు సూచనగా ఉంటాయి. 


Also Read : క్రిస్మస్ స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం బడ్జెట్​ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే