Christmas Celebrations 2025 : ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న ఏసుక్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్ పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో కూడా లక్షలాది కుటుంబాలు ఈ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సమయంలో క్రిస్మస్ ట్రీని అలంకరించడం నుంచి ఒకరికొకరు బహుమతులు ఇవ్వడం వరకు ఎన్నో ట్రెడీషన్స్ హైలెట్గా నిలుస్తాయి. అయితే క్రిస్మస్​ని హైలెట్ చేసే ట్రెడీషన్స్ ఏంటి? అవి ఎందుకు ప్రత్యేకంగా నిలిచాయో చూసేద్దాం. 

Continues below advertisement

క్రిస్మస్ ట్రీ

క్రిస్మస్ అని వినగానే మెరిసే క్రిస్మస్ ట్రీ మనస్సులోకి వస్తుంది. సతత హరిత దేవదారు చెట్టు (పైన్ చెట్టు) ఈ పండుగకు అతిపెద్ద చిహ్నంగా నిలుస్తుంది. చలికాలంలో కూడా ఈ చెట్టు ఆకుపచ్చగా ఉంటుందని నమ్ముతారు. అందుకే దీనిని జీవితానికి, ఆశకు చిహ్నంగా పరిగణిస్తారు. డిసెంబర్ ప్రారంభం నుంచే ఇళ్లలో ఈ చెట్టును తెచ్చి రంగురంగుల లైట్లు, బంతులు, గంటలు, నక్షత్రాలు, ఎంజిల్స్ వంటి మెరిసే రిబ్బన్లతో అలంకరిస్తారు. చెట్టు పైభాగంలో మెరిసే నక్షత్రాన్ని ఉంచుతారు. ఇండియాలో కొందరు నిజమైన చెట్టుకు బదులుగా ప్లాస్టిక్ చెట్లు లేదా కాగితపు చెట్లను కూడా అలంకరిస్తారు.

గిఫ్ట్స్ ఇవ్వడం 

క్రిస్మస్ సమయంలో సీక్రెట్ శాంటా పేరుతో లేదా నార్మల్​గా కూడా గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. అలాగే శాంతా క్లాజ్ మంచి బహుమతులు ఇస్తారనే నమ్మకాన్ని పిల్లలు ఎక్కువగా నమ్ముతారు. క్రిస్మస్ ట్రెడీషన్ ప్రకారం.. డిసెంబర్ 24 రాత్రి శాంతా తన మాయా స్లెడ్జ్ (జింకల బండి)లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇళ్లకు వస్తాడు. చిమ్నీ ద్వారా లోపలికి ప్రవేశించి పిల్లల సాక్స్ (స్టాకింగ్స్) లేదా చెట్టు కింద బహుమతులు పెట్టి వెళ్తాడు. అదే సమయంలో పెద్దలు కూడా ఒకరికొకరు స్వెటర్లు, పుస్తకాలు, చాక్లెట్లు బహుమతులుగా ఇస్తారు.

Continues below advertisement

కారోల్ సాంగ్స్.. 

క్రిస్మస్కు చాలా రోజుల ముందు నుంచే పరిసరాల్లో కారోల్ పాటలు మారుమోగుతాయి. కారోల్ అంటే క్రిస్మస్ ప్రత్యేక పాటలు 'జింగిల్ బెల్స్', 'సైలెంట్ నైట్', 'విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్' పాడతారు. భారతదేశంలోని పాఠశాలలు, చర్చిలలో పిల్లలు, పెద్దలు సమూహాలుగా ఏర్పడి ఇళ్లకు వెళ్లి కారోల్స్ పాడతారు. గోవా, కేరళ, షిల్లాంగ్, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో రాత్రంతా కారోల్స్ మారుమోగుతూనే ఉంటాయి.

క్రిస్మస్ ప్రత్యేక వంటకాలు

రుచికరమైన ఆహారం లేకుండా క్రిస్మస్ అసంపూర్ణం. ప్రపంచంలోని వివిధ దేశాలలో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారు. భారతదేశంలో ప్లం కేక్, ఫ్రూట్ కేక్, కుకీలు, క్యారెట్ హల్వా, ఖీర్ తప్పనిసరిగా తయారు చేస్తారు. అదే సమయంలో పాశ్చాత్య దేశాలలో రోస్ట్ టర్కీ, క్రిస్మస్ పుడ్డింగ్, మిన్స్​పై, హాట్ చాక్లెట్ తింటారు.

శాంతా క్లాజ్

ఎరుపు కోటు, తెల్లటి గడ్డం, ఎరుపు టోపీ పెట్టుకుని "హో హో హో" అనే నవ్వుతో శాంతా క్లాజ్ క్రిస్మస్ వస్తాడని పిల్లలు భావిస్తారు. వాస్తవానికి శాంతా పాత్ర సెయింట్ నికోలస్ అనే సాధువు నుంచి వచ్చింది. అతను పేద పిల్లలకు రహస్యంగా బహుమతులు ఇచ్చేవాడు. ప్రస్తుతం మాల్స్, పాఠశాలల్లో శాంతా వస్తారు. పిల్లలు అతని ఒడిలో కూర్చుని ఫోటోలు తీసుకుంటారు.