Chinese Girl With Love Brain Disorder: చైనాలోని ఓ యువతికి ప్రేమ జబ్బు వచ్చింది. మీరు చదివింది కరెక్టే. ఆ యువతి Love Brain Disorder తో బాధ పడుతోందని వైద్యులు గుర్తించారు. రోజూ తన బాయ్‌ఫ్రెండ్‌కి 100 సార్లు ఫోన్‌ కాల్స్ చేస్తోందట. ఇదేదో తేడాగా ఉందే అని టెస్ట్‌లు చేయిస్తే వైద్యులు ఆమెకి లవ్ బ్రెయిన్‌ డిజార్డర్ ఉందని తేల్చారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో జియావు అనే 18 ఏళ్ల యువతికి ఈ సమస్య వచ్చింది. Yueniu News ఈ విషయం వెల్లడించింది. బాయ్‌ ఫ్రెండ్‌ అంటే పిచ్చి ప్రేమ కారణంగా నిజంగానే ఆమె పిచ్చిది అయిపోయిందని, మానసిక రుగ్మతతో బాధపడుతోందని వైద్యులు గుర్తించారు. ఈ అతి ప్రేమ వల్ల ఆమె ప్రాణానికే ముప్పొచ్చి పడిందని అంటున్నారు. ఓ యూనివర్సిటీలో చదువుతున్న జియావు ఉన్నట్టుండి వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టింది.


కాలేజ్‌లోకి వచ్చీ రాగానే తన బాయ్‌ ఫ్రెండ్‌ కోసం వెతికేది. కనబడగానే ఇక గంటల కొద్దీ ముచ్చట్లు పెట్టేది. ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా అలాగే ఉండిపోయేది. పూర్తిగా తనపైనే డిపెండ్‌ అవడం, మరింకేదీ ఆలోచించకపోవడం ఆమెకి వ్యసనంగా మారిపోయాయి. అలా గంటల కొద్దీ పక్కనే అంటి పెట్టుకుని ఉండడం వల్ల తన ఫ్రీడమ్ కోల్పోయినట్టు భావించాడు బాయ్‌ఫ్రెండ్. మెల్లగా ఆమెని వదిలించుకోడానికి ప్రయత్నించాడు. పదేపదే కలవద్దని, తనకి దూరంగా ఉండాలని వారించాడు. అయినా ఆ యువతి వినలేదు. ఎక్కడికి వెళ్లినా కాల్స్‌, మెసేజ్‌లు చేయడం. ఎక్కడ ఉన్నావంటూ పదేపదే విసిగించడం చేసేది. వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్‌కి రిప్లై ఇవ్వాలని ఇబ్బంది పెట్టేది. ఓసారి వరస పెట్టి మెసేజ్‌లు పెట్టడమే కాకుండా కెమెరా ఆన్‌ చేయాలంటూ వెంట పడింది. 


చచ్చిపోతానంటూ బెదిరింపులు..


ఆమె ఎన్ని మెసేజ్‌లు పెట్టినా బాయ్‌ఫ్రెండ్ మాత్రం పట్టించుకోలేదు. వీడియో కాల్స్‌నీ రిజెక్ట్ చేశాడు. తనను ఇగ్నోర్ చేస్తున్నాడన్న ఇన్‌సెక్యూరిటీతో ఆ యువతి పిచ్చెక్కిపోయింది. ఎలా అయినా మాట్లాడాలనుకుని ఒకటే రోజు తన బాయ్‌ఫ్రెండ్‌కి 100 సార్లు కాల్ చేసింది. అయినా స్పందించకపోయే సరికి మెంటల్‌గా బాగా డిస్టర్బ్ అయింది. ఇంట్లో నానా రణరంగం సృష్టించింది. చేతికి దొరికిన వస్తువల్లా పగలగొట్టింది. చివరికి బాల్కనీ నుంచి దూకి చచ్చిపోతానంటూ మెసేజ్‌ పెట్టింది. దీంతో భయపడిపోయిన బాయ్‌ఫ్రెండ్ వెంటనే ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. ఆ తరవాత పోలీసులకు కాల్ చేశాడు. ఆమెకి ఎలాగోలా కాస్త నచ్చజెప్పి హాస్పిటల్‌కి పంపించారు.


ఆమె కండీషన్‌ని గమనించిన వైద్యులు Love Brainతో బాధ పడుతోందని చెప్పారు. విపరీతమైన ఒత్తిడి ఈ వ్యాధి లక్షణం. అయితే..ఆమెకి ఎందుకీ జబ్బు వచ్చిందనేది మాత్రం ఇంకా తెలియలేదు. చిన్నతనంలో తల్లిదండ్రులతో సరైన రిలేషన్‌ లేకపోవడం వల్ల మానసికంగా ఇలా బలహీనంగా మారిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు వైద్యులు. ఇలాంటి వాళ్లు తమకు తాముగానే మెల్లగా కోలుకుంటారని,కాస్త ఎమోషన్స్‌ని అదుపులో పెట్టుకుంటే చాలని చెబుతున్నారు. 


Also Read: Memory Affects the Brain : ఒక్కో జ్ఞాపకం ఒక్కో బ్రెయిన్​ సెల్​ని కరాబ్ చేస్తుందట.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు