Stone Pelting Case :  సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడ్ని మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.  సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ ను 3 రోజుల పాటు కస్టడీ కి అనుమతి ఇచ్చింది కోర్టు. వారం రోజులు కస్టడీ కి ఇవ్వాలని కోరారు పోలీసులు.   జగన్ పై రాయి దాడి కేసులో ఏ 1 గా ఉన్నాడు సతీష్. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్నాడు  . అడ్వకేట్ సమక్షంలో పోలీస్ విచారణ జరగాలని వెల్లడించింది కోర్టు. ఇక గురువారం ఉదయం 10 గంటల నుంచి కస్టడీ కి తీసుకోనున్నారు పోలీసులు.  


రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఏం  చెప్పారంటే ?                                    
 
 సీసీ ఫుటేజీలు, వీడియోగ్రాఫ్ సేకరించి పరిశీలించాం. ఏప్రిల్ 17న విశ్వసనీయ సమాచారం అందింది. విజయవాడ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్‌ను అరెస్టు చేశాం. మధ్యవర్తుల సమక్షంలో అతడి సెల్‌ఫోన్, బట్టలు స్వాధీనం చేసుకున్నాం. ఏ-1 (మైనర్)ను ఏ-2   ప్రేరేపించాడు. సీఎంను హతమార్చడానికి పదునైన కాంక్రీట్ రాయిని విసిరాడు. జనం మధ్యలోనే ఉండి రాయిని విసిరి.. నడుస్తూనే సత్తీశ్ వెళ్లిపోయాడు. కుట్రతో ముందస్తు ఒప్పందం ప్రకారం గురి పెట్టి మరీ జగన్ తలపైకి బలంగా రాయిని విసిరారు. అదృష్టవశాత్తూ సీఎం గాయంతో బయట పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా బలంగా దెబ్బ తగిలింది. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన తర్వాతే ఏ-1గా దుర్గారావును ఖరారు చేశారు. ఏ 1 ఎవరో పోలీసులు చెప్పలేదు.  


సాక్ష్యాలే లేక దుర్గారావును విడిచిపెట్టిన పోలీసులు                                     


వేముల దర్గారావు అనే టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు ప్రశ్నించినా  ఏ ఆధారాలు దొరకపోవడంతో వదిలి పెట్టారు. బొండా ఉమను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనను అరెస్టు చేసేందుకు ఓ సారి ఆయన ఆఫీసును చుట్టుముట్టారు కూడా. తర్వాత వెనక్కి తగ్గారు. 


కేసును సీబీఐకి ఇవ్వాలంటున్న టీడీపీ                             


ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలు రాయి తగిలిందో లేదో కూడా తెలియదని అయినా పెద్ద కుట్రలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల్ని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.