Heatwave: వేసవిలో ఒక వైపు చెమట.. మరోవైపు వేడిగాలులు.. సహనాన్ని పరీక్షిస్తాయి. వేసవిలో చర్మ సమస్యల నుంచి తప్పించుకోవడానికి చాలామంది సన్‌స్క్రీన్ అప్లై చేస్తుంటారు. ఎండ నుంచి తమని తాము రక్షించుకోడానికి టోపీ, గొడుగు, సన్ గ్లాసెస్ వాడతారు. డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు నీళ్లు తాగుతారు. అయితే, ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వడ గాలులు ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది మరి. వేడి గాలుల వల్ల శరీరంలోని అన్ని భాగాలు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా కళ్లకు చాలా ప్రమాదకరం. అందుకే వేసవిలో కళ్లను భద్రంగా చూసుకోవడం ముఖ్యం. లేకపోతే ఐ స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీయవచ్చు.
ఐ స్ట్రోక్ అంటే ఏంటి..?
కంటి రెటీనాకు రక్త ప్రసరణ నిలిచిపోయినప్పుడు ఐ స్ట్రోక్ వస్తుంది. అంటే రెటీనా ధమని మూసుకుపోతుంది. ఈ స్ట్రోక్ రక్తం గడ్డకట్టడం లేదా బ్లాకుల వల్ల సంభవించవచ్చు. వేడి గాలులు వీచినప్పుడు తీవ్రమైన వేడికి రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్ కు దారితీస్తాయి, ఇది రక్తాన్ని చిక్కగా చేస్తుంది, ఫలితంగా రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. "అదనంగా, వేడి ఒత్తిడి రక్త నాళాలు కుంచించుకుపోయేలా చేస్తుంది. ఇది కంటిలోని సున్నితమైన నాళాలలో బ్లాకింగ్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. దాని వల్ల ఐ స్ట్రోక్ ఏర్పడుతుంది.
వీరికి కంటి స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ:
వృద్ధులు:
వృద్ధాప్యం సహజంగా గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. వీరికి ఐ స్ట్రోక్ ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువే.
హృద్రోగులు:
రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అథెరోస్క్లెరోసిస్ వంటి పరిస్థితులు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి.
మధుమేహ బాధితులు:
మధుమేహం రక్త నాళాలను దెబ్బతీస్తుంది. గడ్డ కట్టే పరిస్థితిని పెంచుతుంది.
స్ట్రోక్స్ బాధితులు:
ఇంతకు ముందు స్ట్రోక్‌లు వచ్చిన వారు ఎక్కువ రిస్కులో ఉంటారు.
పురుషులు:
మహిళలతో పురుషులకు కంటి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మధుమేహం రక్త నాళాలను దెబ్బతీస్తుంది. గడ్డకట్టే అవకాశాన్ని పెంచుతుంది.
హీట్ వేవ్ నుంచి కళ్ళను ఎలా రక్షించుకోవాలి?
⦿ ఎండలో ఎల్లప్పుడూ UV బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించండి. ఇది UV కిరణాల ప్రమాదకరమైన ప్రభావాల నుంచి కళ్ళను కాపాడుతుంది. UV కిరణాలలో 99% వరకు నిరోధించగల సన్ గ్లాసెస్‌ని ఎంచుకోండి.
⦿ పొడి కళ్ల సమస్య తలెత్తకుండా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండండి.
⦿ మీ కళ్ల తేమను కాపాడుకోవడానికి, నిపుణుల సూచనల మేరకు లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్‌ని ఉపయోగించండి.
⦿ కళ్లపై ఒత్తిడి తక్కువగా ఉండేలా స్క్రీన్‌పై విరామం తీసుకుంటూ ఉండండి.
⦿ కంటి అలసట నుంచి ఉపశమనానికి శీతలీకరణ అనుభూతిని ఇవ్వడానికి కూల్ కంప్రెస్ ఉపయోగించండి. దీని కోసం, మీరు ఒక గుడ్డలో మంచు ముక్కను చుట్టి, కళ్లకు నీరు పెట్టవచ్చు.
⦿ మీరు విపరీతమైన వేడిలో బయటకు వెళ్లవలసి వస్తే, గొడుగు లేకుండా బయటకు వెళ్లవద్దు.
⦿ ఎండలో బయటకు వెళ్లేటప్పుడు వెడల్పాటి టోపీని ధరించండి. దాని వల్ల తల, కళ్ళు ఎండ నుంచి రక్షణ లభిస్తుంది.
Also Read : డయేరియా డేంజర్ బెల్స్.. ఈ లక్షణాలు గుర్తిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి.. లేదంటే కష్టమే