జండర్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. ఇది కొంతమందిలో తాత్కాలికంగా ఉంటే మరి కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసిన తగ్గడం లేదు. మినాక్సిడిల్, ఫినాస్టరైడ్, నోటి మందుల నుంచి తక్కువ స్థాయి లేజర్ లైట్ థెరపీ, మెసోథెరపీ, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ వరకు అనేక చికిత్స విధానాలు అందుబాటులో ఉంటున్నాయి. ఒత్తిడి, కాలుష్యం వల్ల జుట్టు అధికంగా రాలిపోతుందని విషయం చాలా మందికి తెలుసు. కానీ ఇవే కాదు ఇతర కారణాలు కొన్ని ఉన్నాయి.
జన్యుశాస్త్రం: జుట్టు రాలడంలో జన్యుశాస్త్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా దీన్ని బట్టతల అని పిలుస్తారు. ఇది వారసత్వంగా వచ్చిన జన్యువులతో ప్రభావితంఅవుతుంది. తల మీద జుట్టు క్రమంగా పలుచబడి చివరికి బట్టతలకి దారి తీస్తుంది.
హార్మోన్ల మార్పులు: హార్మోన్ల మార్పులు జుట్టు రాలడాన్ని ప్రేరేపిస్తాయి. గర్భం, రుతువిరతి, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్), థైరాయిడ్ రుగ్మతలు వంటి పరిస్థితులు కారణంగా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది తాత్కాలికంగా లేదా దీర్ఘకాలికంగా జుట్టు పల్చబడటానికి దారి తీస్తుంది.
వైద్య పరిస్థితులు: కొన్ని వైద్య పరిస్థితులు, అనారోగ్యాలు జుట్టు రాలడాన్ని అధికం చేస్తాయి. అలోపేసియా అరేటా వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు రోగనిరోధక వ్యవస్థతో పాటు వెంట్రుకల కుదుళ్ళ మీద దాడి చేస్తాయి. రింగ్ వార్మ్ వంటి స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ కూడా జుట్టు రాలడానికి కారణం.
అలాగే కొన్ని మందులు, చికిత్సల దుష్ప్రభావాలు కూడా జుట్టు ఊడిపోయేలా చేస్తుంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కీమోథెరపీ హెయిర్ ఫోలికల్స్ మీద ప్రభావం చూపుతాయి. అధిక రక్తపోటు, నిరాశ, అర్థరటిస్ వంటి పరిస్తుతలకు ఉపయోగించే మందులు కూడా జుట్టుని పల్చన చేస్తాయి.
పోషకాహారం: పేలవమైన పోషకాహారం, క్రాష్ డైట్, విటమిన్ లోపాలు జుట్టుని బలహీనపరుస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి జుట్టు పెరుగుదల చక్రానికి అంతరాయం కలిగిస్తుంది.
హెయిర్ స్టైలింగ్ టూల్స్: బ్లో డ్రైయర్ వంటి హెయిర్ స్టైలింగ్ టూల్స్ అతిగా వినియోగించడం, పోనీ టెయిల్స్ బిర్రుగా వేసుకోవడం వల్ల వెంట్రుకలపై ఒత్తిడి పడుతుంది. ఇది ట్రాక్షన్ అలోపేసియాకి కారణమవుతుంది.
వయసు: వయసు కూడా జుట్టు పెరుగుదల విషయంలో కీలకంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్ది జుట్టు కుదుళ్లు సన్నగా మారిపోతాయి. వెంట్రుకల సాంద్రతలో తగ్గుదల అనేది వృద్ధాప్య ప్రక్రియలో సాధారణ భాగం. పురుషులలో అది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక పిల్లల్లో ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అలోపేసియా సంభవిస్తుంది. చిన్నతనంలోనే ఇది వస్తే అది వయసుతో పాటు పెరుగుతుంది.
జుట్టు రాలిపోకుండా ఇవి తినాలి
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. గుడ్డు, మాంసం, చేపలు, చిక్కుళ్ళు, పాల ఉత్పత్తులు వంటి లీన్ ప్రోటీన్ మూలాలు చేర్చుకోవాలి. కాయధాన్యాలు, చిక్ పీస్, క్వినోవా వంటి మొక్కల ఆధారిత ఫుడ్ లోని ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కుదుళ్ళకు పోషణ అందిస్తాయి. స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ చేపలు చేర్చుకోవాలి. శాఖాహారులు అయితే చియా విత్తనాలు, అవిసె గింజలు, వాల్ నట్స్ ఉత్తమ ఎంపికలు.
ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. రెడ్ మీట్, చేపలు, బచ్చలికూర, కాలే, చిక్కుళ్ళు, తృణధాన్యాలు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు చేర్చుకోవాలి. సిట్రస్ పండ్లు, బెల్ పెప్పర్ వంటి విటమిన్ సి ఉండే వాటితో ఇనుము అధికంగా ఉండే ఆహారాలు జత చేసి తీసుకోవడం మంచిది.
బయోటిన్ ని విటమిన్ బి7 అని కూడా పిలుస్తారు. జుట్టు ఆరోగ్యం, పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. గుడ్లు, గింజలు, విత్తనాలు, చిలగడదుంపలు, అవకాడో వంటి బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు చేర్చాలి.
జింక్ జుట్టు కణజాలాల పెరుగుదల, మరమ్మత్తుకి దోహదపడుతుంది. గుల్లలు, గొడ్డు మాంసం, గుమ్మడి గింజలు, కాయ ధాన్యాలు, తృణధాన్యాలలో జింక్ పుష్కలంగా లభిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఖాళీ పొట్టతో మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చా? రోజుకి ఎంత మోతాదు తీసుకోవాలి?
Join Us on Telegram:https://t.me/abpdesamofficial