మనకు మేలైన ఆహారం తినడం ఎంత ముఖ్యమో, సరైన సరిపడినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. చాలా మంది నిద్రకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నిద్రను తగ్గించుకోవడం కోసమే చూస్తారు. నిద్రను తగ్గిస్తే ఆరోగ్యం మొత్తం మీద ప్రభావం పడుతుంది. నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహారానికి, నిద్రకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల అతనికి నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉండదు. పిల్లలు అయితే ఇంకా ఎక్కువ సమయం నిద్రపోవాలి. 20 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరూ రోజుకు 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది రోజుకు అయిదారు గంటలు నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. ఇది అనేక రోగాలకు కారణం అవుతుంది.
నిద్రలేమి వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి పెరిగిపోతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఇదే కొనసాగితే అది అధిక రక్తపోటుగా మారిపోయే అవకాశం ఉంది. అలాగే నిద్రలేమి నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీనివల్ల రక్తనాళాలు బిగుతుగా మారిపోతాయి. ఆ సమయంలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. రక్తనాళాల లోపలి పొరలు ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేకపోతే రక్తనాళాల్లోని లోపలి పొరలు సరిగా పనిచేయవు. దీనివల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడుతున్న వారికి ఇన్సులిన్ నిరోధకత వచ్చే ప్రమాదం ఎక్కువ. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. మధుమేహం అధికంగా పెరిగి కిడ్నీలు దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా తగినంత నిద్రపోవాలి.
అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే కిడ్నీలు చక్కగా పనిచేయాలి. కానీ నిద్రలేమి వల్ల కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. దీని కారణంగా అధిక రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నిద్రకు ప్రాధాన్యతను ఇస్తే అధిక రక్తపోటు బారిన పడకుండా ఉండొచ్చు. పెద్దవాళ్లు కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా నిద్రపోయే వాతావరణంలో సృష్టించుకోండి. ఫోన్లు, టీవీలు చూడడం తగ్గించండి. ఎంతగా ప్రయత్నిస్తున్నా నిద్ర రాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించండి. అలాగే రక్తపోటుని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండండి. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించండి.
Also read: రోజూ పనీర్ తినడం వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా?
Also read: ఈ లడ్డూ పిల్లలకు రోజుకొకటి తినిపించండి చాలు, ప్రొటీన్ లోపమే రాదు