వర్షాకాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా ఎదురవుతాయి. దీని వల్ల చర్మం తేమగా, జిడ్డుగా ఉంటుంది. చర్మం నిస్తేజంగా ఉంటుంది. ఈ తేమ వాతావరణంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి. ఈ సీజన్లో పెళ్లి అంటే ఆ వధువు పరిస్థితి మరి దారుణం. జిడ్డు వాతావరణానికి వేసుకున్న మేకప్ చిరాకుగా ఉంటుంది. జిడ్డు, ఆయిల్ స్కిన్ వల్ల మొటిమలు వచ్చి ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఈ సీజన్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వధువు మెరిసిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అలా చేస్తే పెళ్ళిలో ఇక మీ మీదే అందరి దృషి ఉంటుంది.
అసలే జిడ్డు వాతావరణం దానికి తోడు ఆయిల్ స్కిన్ ఏది చేయాలన్న ఆసక్తి రాదు. మొహం శుభ్రం చేసుకున్న కాసేపటికే మళ్ళీ ఆయిల్ వచ్చేస్తుంది. అందుకే సోప్ ఫ్రీ క్లీనర్స్ ఎక్కువగా ఉపయోగించాలి. ఇలాంటివి ఉపయోగించడం వల్ల ప్రతి సారి మొహం కడుక్కునే అవసరం ఉండదు. చర్మం నుంచి వచ్చే ఆయిల్ ని అది నిలువరిస్తుంది. ప్రత్యేకంగా వధువులు అయితే మొహం ఎక్కువగా కడగకూడదు. అలా చెయ్యడం వల్ల చర్మంలో ఉన్న రంధ్రాలు మూసుకుపోయి మొహం నిర్జీవంగా మారుతుంది.
Also Read: కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ఎక్కువ చూస్తుంటారా... అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!
చర్మం కాంతివంతంగా ఉండే విధంగా లోషన్స్ తో వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్ చేసుకోవాలి. దీని వల్ల చర్మంలోని మృత కణాలు పోగొట్టి మొహం మెరిసే లాగా చేస్తుంది. డెర్మటాలజిస్ట్ సూచనలు పాటిస్తూ పెళ్ళికి రెండు మూడు రోజుల ముందు ఫేషియల్ చేయించుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు.
వర్షాకాలంలో చర్మం జిడ్డుగా ఉన్నప్పటికీ మాయిశ్చరైజ్ తప్పనిసరిగా రాసుకోవాలి. మీ చర్మ స్వభావానికి అనుగుణంగా ఉండేలా మాయిశ్చరైజర్ ఎంచుకుని ప్రతి రోజు మొహం శుభ్రం చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్ కూడా రాసుకోవాలి. ఇంట్లో ఉన్నాం కదా లోషన్ రాసుకోకుండా నిర్లక్ష్యం చెయ్యకూడదు. హాని కలిగించే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ పొందేందుకు తప్పనిసరిగా లోషన్ ఉపయోగించాలి. ఈ సీజన్లో మేకప్ ఎక్కువగా వేసుకోకూడదు. దాని వల్ల మీకు చిరాకుగా అనిపిస్తుంది.
Also Read: మీరు గలగల మాట్లాడేవారా లేక మూతి ముడుచుకునే టైపా? ఈ ఆప్టికల్ ఇల్యూషన్ తేల్చేస్తుంది