Breakfast Recipes with Bread : డైట్​లో ఉన్నప్పుడు చాలామంది బ్రౌన్ బ్రెడ్​ని ఉపయోగిస్తారు. అయితే వాటిని రోజూ నేరుగా తినడమంటే కాస్త కష్టంగానే ఉంటుంది. అందుకే డైట్​లో ఉన్నప్పుడు బ్రెడ్​తో చేయగలిగే రెసిపీలు ఏంటో చుద్దాం. అయితే దీనివల్ల వాటిలోని పోషకాలు పోతాయేమో అనుకోకండి. బ్రెడ్స్​తో పాటు మీరు మరిన్ని పోషకాలు ఈ రెసిపీల ద్వారా చేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు చేసే ఓ రెసిపీకి స్టౌవ్ అవసరం లేదు. మరో రెసిపీని వండినా.. ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి మీరు హ్యాపీగా ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీలు ఏంటి? వాటిని ఎలా తయారు చేయాలో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


బ్రెడ్ శాండ్​ వించ్ తయారీకి కావాల్సిన పదార్థాలు


బ్రెడ్ - 4


పెరుగు - 2 స్పూన్లు


క్యాబేజి - 2 స్పూన్లు


క్యాప్సికమ్ - 1


పెప్పర్ - రుచికి తగినంత


సాల్ట్ - రుచికి తగినంత


పనీర్ - 1 స్పూన్


కీరదోస - 1


లిట్యూస్ - కొన్ని


తయారీ విధానం


ముందుగా క్యాప్సికమ్​, క్యాబేజీని కడిగి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్​ను సైడ్​లు కట్​ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓ మిక్సింగ్ గిన్నె తీసుకుని దానిలో పనీర్, క్యాబేజి, క్యాప్సికమ్, పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. దానిలో పెప్పర్, సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని.. ఈ మిక్స్​ను బ్రెడ్​పై అప్లై చేసి.. మరో బ్రెడ్​పై లిట్యూస్, కీరదోస ముక్కలు పెట్టి.. ఒకదానిని మరో దాని​తో కవర్ చేయాలి. దీనిని సగం కట్ చేసుకుంటే.. టేస్టీ శాండవిచ్ రెడీ. దీనిని మీరు వెంటనే తినేయొచ్చు. లేదంటే హెల్తీ స్నాక్​గా ప్రిపేర్ చేసుకుని స్కూల్, కాలేజ్ లేదా ఆఫీస్​కి తీసుకువెళ్లవచ్చు. 


బ్రెడ్ పోహా తయారీకి కావాల్సిన పదార్థాలు


బ్రెడ్ - 4


నూనె - 1 టేబుల్ స్పూన్


ఆవాలు - 1 టీస్పూన్


ఇంగువ - అర టీస్పూన్


కరివేపాకు - 1 రెబ్బ


పచ్చిమిర్చి - 2


ఉల్లిపాయలు - 1


క్యాప్సికమ్ -1


టమాటాలు - 2


పసుపు - అర టీస్పూన్


కారం - 1 టీస్పూన్


ఉప్పు - తగినంత


కొత్తిమీర - 2 స్పూన్ల తురుము 


సేవ్ - గార్నిష్ కోసం


తయారీ విధానం


ముందుగా బ్రెడ్​ను చిన్న క్యూబ్స్​గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్​ను బాగా కడిగి చిన్నచిన్న ముక్కులుగా తురుముకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నూనె వేయండి. అది వేడి అయ్యాక ఆవాలు వేసి.. దానిలో ఇంగువ కూడా వేయాలి. అనంతరం కరివేపాకు వేసి.. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో సన్నగాతురిమి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసి బాగా మిక్స్ చేయాలి. రెండు నిమిషాలు మగ్గనిచ్చి.. దానిలో టమాట ముక్కలు వేసి ఉడకనివ్వాలి. పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివర్లో బ్రెడ్ ముక్కలు వేసి.. బాగా కలిపి మూతపెట్టి 4 నిమిషాలు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర, సేవ్​తో గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకోవాలి. 


Also Read :  లవంగాలతో వేగంగా బరువు తగ్గవచ్చట తెలుసా? కానీ ఇలా తీసుకోవాలి





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.