Tests to Avoid During Menstruation : ఆరోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు.. వైద్య చికిత్స కోసం కొందరు బ్లడ్, యూరిన్ వంటి మెడికల్ టెస్ట్​లు చేయించుకుంటారు. అయితే పీరియడ్స్ సమయంలో ఈ తరహా రక్త పరీక్షలు చేయించుకోవచ్చా? లేదంటే చేయించుకోకూడదా? ఫలితాల్లో మార్పులు ఏమైనా ఉంటాయా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

పీరియడ్స్​లో ఉన్నప్పుడు కచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. అయితే కొన్ని పరీక్షలకు మాత్రం దూరంగా ఉండాలి. మీరు చేయించుకునేవాటిని బట్టి, మీ లక్షణాలు బట్టి వాటిని చేయించుకోవచ్చో లేదో వైద్యులు చెప్తారు. అయితే పీరియడ్స్​లో ఉన్నప్పుడు ఎలాంటి బ్లడ్ టెస్ట్​లు చేయించుకోవచ్చు? చేయించుకోకూడనివి ఏంటో తెలుసుకుందాం. 

చేయించుకోగలిగే రక్త పరీక్షలు.. 

పీరియడ్స్​లో ఉన్నప్పుడు మీరు రక్త పరీక్షలు చేయించుకోవాలనుకుంటే.. CBC రక్తానికి సంబంధించిన కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేయించుకోవచ్చు. బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవచ్చు. తినడానికి ముందు, తిన్న తర్వాత చేయించుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్​లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్​ కూడా చేయించుకోవచ్చు. విటమిన్ లెవెల్స్​, కొలెస్ట్రాల్ టెస్ట్​లు చేయించుకోవచ్చు. 

పీరియడ్స్​లో ఏవి చేయించుకోకూడదంటే.. 

పీరియడ్స్ సమయంలో మీరు కొన్ని టెస్ట్​లను అవాయిడ్ చేస్తే మంచిది. హార్మోనల్ టెస్ట్​లు చేయించుకోకపోవడమే మంచిది. పీరియడ్స్ సమయంలో ఇవి కాస్త ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సరైన ఫలితాలు రాకపోవచ్చు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, ఫొలికల్ స్టిమ్యూలేటింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్, PCOS కోసం టెస్టోస్టిరాన్ వంటి టెస్ట్​లు చేయించుకోవాలంటే పీరియడ్స్ తర్వాత చేయించుకుంటే మంచిది. 

థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవచ్చా?

థైరాయిడ్ కూడా హార్మోనల్ సమస్యనే కదా. దీనిని కూడా పీరియడ్స్​ అయ్యేవరకు చేయించుకోకూడదా అంటే లేదు. పీరియడ్స్​లో ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవచ్చట. టెస్ట్​లైన TSH, T3, T4 కూడా చేయించుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్​ని పీరియడ్స్ ఎఫెక్ట్ చేయవట. అయితే Anti-TPO యాంటీబాడీలు మాత్రం కాస్త రిజల్ట్స్ మారుతాయి. 

అలాగే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొందరు డాక్టర్లు ఉదయాన్నే ఈ టెస్ట్ చేయించుకోమంటారు. మీరు ఇప్పటికే థైరాయిడ్ మెడిసన్ వాడుతుంటే.. టెస్ట్ తర్వాత ఆ మందు వేసుకుంటే మంచిది. 

ఫలితాల్లో మార్పులు..

పీరియడ్స్ సమయంలో బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి.. ఐరన్ లెవెల్స్, హెమోగ్లోబిన్ ఫలితాల్లో మార్పులు ఉంటాయి. కొన్నిసార్లు ఇది ఎనెమియాను సూచిస్తుంది. ఎక్కువ బ్లీడింగ్ అయితే మరిన్ని మార్పులు ఉండొచ్చు. పీరియడ్స్ సమయంలో ఇన్​ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. పాజిటివ్​గా రావాల్సిన ఫలితాలు కూడా నెగిటివ్​గా రావొచ్చు. 

మీరు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్లినప్పుడు ల్యాడ్ టెక్నీషియన్​కి గానీ, వైద్యులకు గానీ మీరు పీరియడ్స్​లో ఉన్నట్లు చెప్పేయండి. హార్మోనల్, ఐరన్ రిలేటడ్ టెస్ట్​లు చేయించుకునేప్పుడు కచ్చితంగా చెప్పాలి. లేకుంటే మీకే నష్టం. మీ పీరియడ్స్ రెగ్యులర్​గా రాకపోయినా.. ఫెర్టిలిటీ సమస్యలున్నా దానికి తగ్గట్లు వైద్యులు మీకు టెస్ట్​లు ఎప్పుడు చేయించుకోవాలో సూచిస్తారు. బ్లీడింగ్ ఎక్కువగా ఉండి.. బాగా నీరసంగా ఉంటే ఈ టెస్ట్​లను తర్వాత చేయించుకోండి. అత్యవసరమైతేనే పరీక్షలు చేయించుకోండి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.