Best Foods for Diabetes : మధుమేహం ఉన్నవారు రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయకుంటే అది తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి దానిని రెగ్యులర్‌గా మానిటర్ చేస్తూ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవాలి. దానికోసం మందులు ఉపయోగించడంతో పాటు వ్యాయామం చేయాలి. హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఫాలో అయితే మధుమేహం కంట్రోల్ అవుతంది. ముఖ్యంగా షుగర్ లెవెల్స్‌ని తగ్గించుకోవాలనుకుంటే ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారం అనేది ప్రతి ఆరోగ్య సమస్యకు పరిష్కారం ఇస్తుంది. ఏది ఎంత తీసుకోవాలో.. ఏది అస్సలు తీసుకోకూడదో తెలిస్తే సగానికి పైగా రోగాలు కంట్రోల్లో ఉంటాయి. మధుమేహం కూడా అంతే. కొన్ని ఫుడ్స్ తీసుకోకుండా.. కొన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇంతకీ అలాంటి ఫుడ్స్ ఏంటి? వాటిని తీసుకుంటే మధుమేహం ఎలా కంట్రోల్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లు
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఫ్యాట్స్ ఉంటాయి. షుగర్స్ ఉండవు. పోషకాలతో నిండిన ఆహారం. ఇది జీర్ణక్రియను నెమ్మదించేలా చేసి కార్బ్స్ ఎక్కువ తీసుకోకుండా హెల్ప్ చేస్తుంది. అందుకే దీనిని బ్రేక్‌పాస్ట్‌లో తీసుకుంటే మంచిది. ఇది ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా బ్లడ్ షుగర్‌ని కంట్రోల్లో ఉంచుతుంది.
బీన్స్
పప్పులు, బీన్స్‌లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ శరీరానికి అందుతుంది. నెమ్మదిగా జీర్ణమవ్వకలిగే కార్బ్స్ ఉంటాయి. ఇవి భోజనం తర్వాత గ్లైసెమిక్ ఇండెక్స్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. వీటిని కర్రీలు, సూప్‌ల రూపంలో తీసుకుంటే మంచిది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.
చియా సీడ్స్
చియా సీడ్స్‌లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి గట్ హెల్త్‌ని మెరుగుపరిచి.. గ్లూకోజ్‌ని శరీరం నెమ్మదిగా తీసుకునేలా చేస్తాయి. వీటిని మీరు స్మూతీలు, డ్రింక్స్, యోగర్ట్, పుడ్డింగ్‌లలో కలిపి తీసుకోవచ్చు.
యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. కార్బ్స్‌తో కూడిన భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా హెల్ప్ చేస్తుంది. కాబట్టి దీనిని ఓ గ్లాసు వాటర్‌లో ఓ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని కలిపి.. మీ భోజనానికి ముందు తీసుకుంటే మంచిది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క రక్తంలోని షుగర్ లెవ్స్ని కంట్రోల్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబట్టి దీనిని మీరు స్మూతీలు, కాఫీలు, ఓట్మీల్, గ్రీక్ యోగర్ట్‌లలో కలిపి తీసుకోవచ్చు. లేదా దాల్చిన చెక్కతో చేసిన టీ తాగవచ్చు.
ఆకు కూరలు
ఆకు కూరల్లో కార్బ్స్ తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో మెగ్నీషయం ఉంటుంది. ఇది షుగర్‌ని కంట్రోల్లో ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే మెటబాలీజంను పెంచుతాయి. వీటిని మీరు ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్‌తో కలిపి తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ కంట్రోల్లో ఉంటుంది.
ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్
ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ అనే పోషకాలను కలిపి తీసుకోవడం వల్ల కార్బ్స్ తగ్గి.. షుగర్ క్రాషెష్ జరగకుండా ఉంటాయి. కాబట్టి మీరు సాల్మన్ చేపను అవకాడోతో లేదా గుడ్లను, ఆలివ్ ఆయిల్‌తో తీసుకోవచ్చు. మీ ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఇది షుగర్‌ని అదుపులో ఉంచుకోవడంలో హెల్ప్ చేస్తుంది.
ఇవి రక్తంలో షుగర్‌ను అదుపులో ఉంచడమే కాకుండా శక్తిని అందించి యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. పనిపై ఫోకస్ పెరుగుతుంది. క్రేవింగ్స్ తగ్గుతాయి. దీనివల్ల బరువు కంట్రోల్ అవుతుంది. వీటిని డైట్లో చేర్చుకునే ముందు మీరు వైద్యుల సలహాలు కూడా తీసుకోవచ్చు.