Shani Vakri 2025
శని వక్రీభవించడం వల్ల ఏం జరుగుతుంది?
మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా?
శని గమనంలో మార్పు వచ్చినప్పుడల్లా ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. 2025 సంవత్సరంలో శని గమనంలో మార్పు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ ఏడాది శని వక్రసంచారం కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
శనిదేవుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. హిందూ పంచాంగం ప్రకారం శని 2025 జూలై 08న వక్రీభవిస్తాడు. 2025 నవంబర్ 26న తిరిగి సాధారణ స్థితికి వస్తాడు. శని వక్రంలో సంచరించేసమయంలో బాహ్యపరీక్షకాదు..అంతర్గత పరీక్షా సమయం. ప్రస్తుతం శని మీన రాశిలో సంచరిస్తున్నాడు..అది జ్ఞాన కారకుడైన దేవగురు బృహస్పతి రాశి. ఈ ప్రభావం కొన్ని రాశులపై మానసికంగా , భావోద్వేగపరంగా ఉండబోతోంది.
ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి 2025 మార్చి నుంచి శని మీనంలో సంచరిస్తున్నాడు. మీనంలో సంచారం వల్ల మీనంతో పాటూ మేషం, కుంభ రాశులవారికి ఏల్నాటి శని ఉంది. తిరోగమన దశలో శని ఉన్నప్పుడు ఈ మూడు రాశులవారు జాగ్రత్తవహించాలి. మేష రాశి
మేష రాశివారిపై శని ప్రత్యేక దృష్టి ఉంది.. 2025 మార్చి 29 నుంచి ఏల్నాటి శని ప్రారంభమైంది. మొదటి దశ కష్టకాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఆరోగ్యం , ధనం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వివాహం కానివారికి మరింత ఆలస్యం అవుతుంది. విద్యార్థులు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఆశించిన ఫలితాలుపొందలేరు. కీలకపత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తపడండి.
కుంభ రాశి
2025 మే 27 మీకు ప్రత్యేకమైన రోజు.. ఈ రోజు శని జయంతి ఈ రోజురోజు శనికి నూనె వెలిగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. కుంభ రాశిపై సాడేసాతి చివరి దశ కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఉన్న కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శని లాభదాయక స్థితిలోకి వచ్చాడు..మీకు మంచి రోజులు మొదలవుతాయి.
మీన రాశి
మీకు ఏల్నాటి శని రెండో దశ ప్రారంభమైంది. ఈ సమయంలో ఉద్యోగులు పనివిషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. క్షమశిక్షణ అవసరం. కోర్టుకేసుల్లో చిక్కుకున్నవారు వాటినుంచి ఇప్పట్లో బయటపడలేరు. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఆర్జించలేరు. జూలై నుంచి సెప్టెంబరు మీకు సవాళ్ల కాలంగా ఉంటుంది. శనిని ప్రసన్నం చేసుకునే ఉపాయాలు
శనివారం రావిచెట్టుకి పూజచేసి ఆవనూనె దీపం వెలిగించండి
ఓం శం శనిశ్చరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి
నల్ల నువ్వులు, ఇనుము దానం చేయండి
హనుమంతు చాలీసా మరియు శని స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించండి
శని వక్ర సంచారం ఎప్పుడు?2025 జూలై 08 న శని వక్రసంచారం మీనంలో ప్రారంభమవుతుంది. 2025 నవంబర్ 26న వక్రం పూర్తవుతుంది ఈ సమయంలో ఏ రాశులపై శని ప్రభావం అధికంగా ఉంటుంది?కుంభం, మీనం , మేష రాశులకు ఎల్నాటి శని కొనసాగుతోంది..ఈ రాశులపై అధిక ప్రభావం ఉంటుంది అష్టమ, అర్ధాష్టమ శన ప్రభావం ఏ రాశులపై ఉంది?సింహ రాశిపై అష్టమ శని ప్రభావం, ధనస్సు రాశివారిపై అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది వక్రంలో శని సంచారం అశుభమా?కర్మలకు త్వరగా ఫలితాన్నిస్తాడు శని భగవానుడు.. తప్పులు చేయకుండా ఉంటే చాలు..మీకు మంచే జరుగుతుంది శని ప్రభావం తగ్గించుకునేందుకు ఏం చేయాలి?రావిచెట్టు పూజ, శని మంత్ర జపం సేవ అత్యంత ప్రభావవంతమైనవి
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.