శరీరంలోని అనేక రోగాలను ప్రధాన కారణం ఏంటో తెలుసా చక్కెర. బరువు పెరగడం, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ కూడా చక్కెరను నియంత్రించలేకపోవడం వల్లే వస్తుంది. ఇవే కాదు చర్మ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే చక్కెర తీసుకోవడం తగ్గించడం చాలా అవసరం. కొంతమంది తీపి లేనిదే బతకలేరు. ఖచ్చితంగా పంచదార లేకుండా టిఫిన్ కూడా తినరు. అలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. అసలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా పంచదార దూరం పెట్టాల్సిందే. రోజువారీ ఆహారం నుంచి చక్కెర తీసుకోవడం తగ్గించడానికి ఉత్తమ మార్గాలు ఇవే.
పండ్లు తినాలి: పండ్లు, కూరగాయలు సహజ చక్కెర కలిగి ఉంటాయి. ఇవి కాలేయం, మొత్తం శరీరం ద్వారా సులభంగా ప్రాసెస్ చేయబడతాయి. అందుకే మొత్తం పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. చక్కెర పానీయాలు, క్యాండీలు నివారించాలి. పండ్ల నుంచి వచ్చే రసాలే కదా అని ఎక్కువ మంది ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు. కానీ ఇందులో చక్కెర యాడ్ చేయడం వల్ల అవి ఆరోగ్యానికి హాని కలిగించేవిగా మారిపోతాయి. దానికి బదులుగా ఒక పూర్తి పండు తింటే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. తీపి తినాలనే కోరిక తగ్గుతుంది.
సహజ స్వీటేనర్లు: ఆహారం తీపిగా ఉండాలని కోరుకుంటే సహజ స్వీటేనర్లు ఉపయోగించుకోవచ్చు. తేనె, మాపుల సిరప్, స్టెవియా వంటి స్వీటేనర్లు ఆరోగ్యకరమైనవి. ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు ఇందులో ఉండవు.
భోజనం సరిగా ఉండాలి: సమతుల్య భోజనం చక్కెర తీసుకోవడం తగ్గించేందుకు సమర్థవంతమైన మార్గం. ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవాలి. తీపి తినాలనే కోరిక తగ్గించుకునేందుకు ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ చేర్చుకోవాలి.
మైండ్ ఫుల్ గా తినాలి: మైండ్ ఫుల్ గా తింటే చక్కెర తినడం తగ్గించుకోవచ్చు. ఆకలిగా లేనప్పుడు అతిగా తినడం నివారించడంలో సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఎంపికలు ఎంచుకోవాలి.
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి: చక్కెర తీసుకోవడం తగ్గించడానికి ఉత్తమ మార్గం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం. ఆరోగ్యకరమైన, సహజ చక్కెరలు కలిగిన పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి.
చక్కెర పానీయాలు వద్దు: సోడా, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటి చక్కెర పానీయాలు పూర్తిగా నివారించాలి. వీటికి బదులు నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, హెర్బల్ టీ, బాదం పాలు తీసుకోవచ్చు. ఇవి ఆహారంలో ఎక్కువ చక్కెరను జోడించవు.
చక్కెర అతిగా తినడం వల్ల పాలిసిస్టిక్ కిడ్నీ డీసీజ్ వచ్చే అవకాశం ఉందని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. ఇది సోకితే నయం చేయడం చాలా కష్టం. ఒక్కోసారి కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుంది. పంచదార తినడం తగ్గించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గుతారు, చర్మ సమస్యలు దూరం అవుతాయి. మధుమేహం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే నో షుగర్ పాలసీకి కట్టుబడి ఉండండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఆమె మొహం నిండా మొటిమలే కానీ అది స్కిన్ డీసీజ్ కాదు