Healthy Eating Tips for Kids : తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. పిల్లలకు ఎటువంటి వ్యాధులు రాకూడదని కేర్ తీసుకుంటారు. అందుకే దానికి తగ్గట్లు ఫుడ్ పెట్టేందుకు చూస్తారు. పోషకాహారాన్ని అందించేందుకు ట్రై చేస్తారు. కానీ కొంతమంది పిల్లలు బయట ఆహారాన్ని ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. ఇది వారిని ఆందోళనకు గురిచేస్తుంది. పిల్లలకు ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు.

Continues below advertisement

మీరు కూడా ఆ సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారా? మీ పిల్లలు తినడానికి మారం చేస్తున్నారా? మీ పిల్లలు పోషకాహారం తీసుకోకపోతే.. ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. వాటితో మీరు మీ పిల్లలకు పోషకమైన ఆహారం సులభంగా అందించగలుగుతారు. ఆ టిప్స్, ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

పోషకాలతో కూడిన ఆహారం..  

మీరు కూడా మీ పిల్లలకు పోషకమైన ఆహారాన్ని అలవాటు చేయాలనుకుంటే.. కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మొదట పిల్లల భోజన సమయాన్ని బోరింగ్‌గా కాకుండా.. ఫన్​గా మార్చాలి. ఫుడ్​ని కలర్​ఫుల్​గా తయారు చేయాలి. పిల్లలకు ఏమి ఇష్టమో అడగాలి. దాని ప్రకారం మీరు ఆ ఫుడ్​ని పోషకమైన ఆహారంగా మార్చవచ్చు. అలాగే భోజనం చేసేటప్పుడు మీరు కూడా మీ పిల్లలతో కలిసి కూర్చుని తినండి. ఇది వారికి మిమ్మల్ని చూసి తినాలనిపించేలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే పెద్దలు చేసే, ఫాలో అయ్యే ఫుడ్ హ్యాబిట్స్​ని పిల్లలు ఫాలో అవుతారు.

Continues below advertisement

ఇంట్లో ఫాస్ట్ ఫుడ్, చాక్లెట్లు, చైనీస్ ఫుడ్ వంటి వాటిని ప్రిఫర్ చేయకండి. బయటకూడా వాటికి దూరంగా ఉంచండి. పిల్లలు మరీ మారం చేస్తే.. వారికి ఓ చిన్న టాస్క్ పెట్టి అది ఓకే అయితేనే దానిని ఇస్తామని చెప్పండి. వారంలో అలా ఏదొక యాక్టివిటీ చేయించవచ్చు. హెల్తీ ఫుడ్ తినకపోతే.. వారికి ఇష్టమైన కార్టూన్, వీడియోలను చూపిస్తూ నెమ్మదిగా తినిపించండి. ఆరోగ్యానికి సమతుల్య ఆహారం ఎంత ముఖ్యమో పిల్లలకు కథలుగా చెప్తూ.. ఆ ఫుడ్​ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ చెప్పండి. ఇది పిల్లలకు మంచి ఆహారం ఏదో.. చెడ్డ ఆహారం ఏదో తెలిసేలా చేస్తుంది.  

ఈ విషయాలను గుర్తించుకోండి..

మీరు పిల్లలకు ఏదైనా తినిపించాలనుకుంటే.. ప్రతిరోజూ ఉదయం పండ్లను తినిపించవచ్చు. మీరు వారికి ఫ్రూట్ జ్యూస్ లేదా జామ్ కూడా తినిపించవచ్చు. దీనితో పాటు.. మీరు ప్రతిరోజూ వారికి సలాడ్, ఆకుకూరలు, కూరగాయల శాండ్‌విచ్, ఓట్స్, పప్పులు వంటివి తినిపించండి. పిల్లలతో కలిసి ప్రతిరోజూ కూర్చుని భోజనం చేయడం ఉత్తమమని గుర్తించుకోండి. దీనివల్ల మీ పిల్లలు ఎక్కువగా ఏమి తినడానికి ఇష్టపడతారో మీకు కూడా తెలుస్తుంది. నిపుణుల సహాయంతో పిల్లలకు ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలో తెలుసుకుని.. డైట్ చార్ట్ ప్రిపేర్ చేయండి. దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకుంటే వారి ఎదుగుదల కూడా బాగుంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.