Navratri Wishes 2025 : దుర్గా మాత నవరాత్రులు ప్రారంభమైపోయాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22వ తేదీన మొదలైన ఈ నవరాత్రులు మరో ఎనిమిది రోజులు కొనసాగనున్నాయి. ఈ సమయంలో అమ్మవారి భక్తులు మీ కుటుంబ సభ్యులకు, ప్రియమైనవారికి, స్నేహితులకు, బంధువులకు విషెష్ చెప్పాలనుకుంటున్నారా? అయితే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో విషెష్ చేసేందుకు ఇవి బెస్ట్. వీటిని క్యాప్షన్‌గా ఇస్తూ అమ్మవారి ఫోటోలతో నవరాత్రి శుభాకాంక్షలు చెప్పేయిండి.
నవరాత్రి చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. కాబట్టి దీనిని బేస్ చేసుకుని.. మీరు కావాలనుకునేవారికి నచ్చిన విధంగా నవరాత్రి శుభాకాంక్షలు చెప్పొచ్చు. ఈ నవరాత్రులను ప్రత్యేకంగా మార్చగలిగే విషెష్ ఏంటో చూసేద్దాం.
నవరాత్రి శుభాకాంక్షలు 2025
మీకు, మీ కుటుంబసభ్యులకు నవరాత్రి శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దయ మన అందరిపై ఉండాలి.
మీ పనులన్నింటిలోనూ అమ్మవారు తోడుగా ఉండాలి. మీ కలను నెరవేర్చాలని కోరుకుంటూ హ్యాపీ నవరాత్రి.
మీ జీవితం సంపద, ప్రేమతో నిండి ఉండాలి. ఈ నవరాత్రికి అమ్మవారు తనతో పాటు వీటిని కూడా తీసుకురావాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు.
ఇలా మీరు ఇంట్లోవారికి, సోషల్ మీడియాలో విషెష్ చెప్పేయండి. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి.. ఆమె ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీరు నవరాత్రి శుభాకాంక్షలు చెప్పవచ్చు. అలాగే ఈ ఫోటోలు కూడా మీరు సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు మంచి ఆప్షన్ ఉంటాయి. కాబట్టి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి.
Also Read : అమ్మవారికి రెండో రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. దసరా స్పెషల్ కొబ్బరి అన్నం రెసిపీ