Monsoon Hiking Spots Near Hyderabad : హైదరాబాద్​లో ఉంటూ వర్షాకాలంలో బయటకు వెళ్లాలనుకుంటున్నారా. అయితే భాగ్యనగరం​ నుంచి తక్కువ సమయంలో ఫ్రెండ్స్​తో కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మీకోసం ఇక్కడ కొన్ని బ్యూటీఫుల్ స్పాట్స్ ఉన్నాయి. ప్రకృతితో మమేకమైతూ.. జలపాతాలు, పచ్చని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ.. హైకింగ్ చేయగలిగే ప్రాంతాలు ఏంటో? వెళ్తే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

అనంతగిరి హిల్స్ 

హైదరాబాద్ నుంచి రెండున్నర గంటల్లో చేరుకోగలిగే ప్రాంతం అనంతగిరి హిల్స్. ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్, గ్రీన్ వ్యాలీ చూసేందుకు మంచి అనుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో చుట్టూ అంతా పచ్చగా ఉండి మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. అనంతగిరి హిల్స్ వెళ్లాలనుకుంటే మీరు ఇన్సెక్ట్స్ కుట్టకుండా రిప్లెంట్స్ తీసుకువెళ్తే మంచిది. ఉదయాన్నే ట్రెక్​కి వెళ్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతమవుతుంది. 

కోయిల్ సాగర్

మహబూబ్​నగర్ దగ్గర్లో ఉన్న కోయిల్ సాగర్ హైదరాబాద్​ నుంచి దాదాపు మూడు గంటల సమీపంలో ఉంది. ఇక్కడ మీరు రోలింగ్ హిల్స్, కోయిల్ సాగర్ డ్యామ్​ని చూడొచ్చు. గ్రీనరి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మధ్యాహ్నం మూడు తర్వాత ఇక్కడ ట్రెక్కింగ్​కి వెళ్లకపోవడమే మంచిది. వర్షాకాలంలో రాళ్లు జారుడుగా ఉంటాయి. కాబట్టి కిందపడిపోయే ప్రమాదం ఉంది. 

కొండపోచమ్మ

కొండపోచమ్మ రిజర్వాయర్ హైదరాబాద్​ నుంచి రెండు గంటల ప్రయాణిస్తే వస్తుంది. ఈ రిజర్వాయర్ మంచి వ్యూని అందిస్తుంది. ఇక్కడి మేఘాలు, ఆకాశ ప్రతిబింబం జలాశయం నీటిలో పడి కన్నులకు ఇంపుగా కనిపిస్తుంది. వర్షాకాలంలో అందమైన ఫోటోలు దిగడానికి ఈ ప్లేస్​ అనువైనది. 

కుంతాల జలపాతం

ఆదిలాబాద్ జిల్లాలోని కుంతాల జలపాతం కూడా వర్షాకాలంలో వెళ్లడానికి అనువైన పర్యాటక ప్రదేశం. హైదరాబాద్​ నుంచి 5 గంటల ప్రయాణం ఉంటుంది. 150 అడుగుల పై నుంచి నీరు కిందికి వస్తుంది. ఫారెస్ట్ రూట్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక్కడికి వెళ్లాలనుకుంటే వాటర్​ప్రూఫ్ షూలు వేసుకుంటే మంచిది. వీకెండ్ సమయంలో జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీక్​ డేస్​లో వెళ్తే మంచిది. 

భువనగిరి ఫోర్ట్ 

హైదరాబాద్​ నుంచి భువనగిరి ఫోర్ట్​కి వెళ్లేందుకు 2 గంటల సమయం పడుతుంది. ఇక్కడ 10th C ఫోర్తో పాటు Massive Monolithic Rock చూడొచ్చు. ఇక్కడ ఎండ వచ్చినా.. వాన వచ్చినా ఎలాంటి షెల్టర్ ఉండదు కాబట్టి ఉదయం లేదా సాయంత్రం వేళ ట్రెక్ చేస్తే ఈజీగా ఉంటుంది. 

ఎత్తిపోతల జలపాతం 

ఎత్తిపోతల జలపాతానికి మీరు హైదరాబాద్ నుంచి 4 గంటల్లో చేరుకోవచ్చు. ఇక్కడ 70 అడుగుల వాటర్ ఫాల్ చూడొచ్చు. దగ్గర్లోని బుద్ధిస్ట్ గుహలు సందర్శించవచ్చు. వెళ్లే ముందు అక్కడ వాతావరణం గురించి తెలుసుకుని వెళ్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వర్షం వస్తే ఆ ప్రాంతం అంత సేఫ్ కాదట. 

మరిన్ని..

ఇవే కాకుండా జనపాడు హిల్స్​కి ట్రెక్కింగ్​కి వెళ్లొచ్చు. సోల్ ట్రెక్ స్పాట్ కూడా ఉంటుంది. దేవరకొండ ఫోర్ట్ ట్రెక్ కూడా మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. ఉదయాన్నే ఇక్కడికి వెళ్తే బ్యూటీఫుల్ ఎక్స్​పీరియన్స్ మీ సొంతమవుతుంది. ఖిల్లా ఘన్పూర్ ట్రెక్ కూడా మంచి ఎంపికే. అలాగే ట్రెక్​కి వెళ్లినా.. లేక ఇతర ప్రాంతాలకు వర్షాకాలంలో వెళ్తే కచ్చితంగా గ్రిప్ షూలు ఎంచుకుంటే మంచిది.