ఎండలో తిరగడం, వాహనాల పొగ, దుమ్ము, కాలుష్యం, వాతావరణ మార్పులు.. ఇలా రకరకాల కారణాలతో చర్మం తన సహజమైన మెరుపును కోల్పోతుంది. పైగా ముఖం నల్లగా మారడం, ట్యాన్ అవ్వడం, పొడిబారడం, జిడ్డుగా కనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతో చాలామంది ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. బయట నుంచి క్రీమ్స్ అప్లై చేయడం ఎంత ముఖ్యమో.. లోపలి నుంచి శరీరానికి కొన్ని పోషకాలు అందించడం కూడా గ్లో కోసం అవసరం. 

Continues below advertisement

అందుకే మీ స్కిన్ మెరిసిపోవాలనుకుంటే.. మీ డైట్లో కొన్ని కూరగాయలు కచ్చితంగా చేర్చుకోవాలి. అవి చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మరి చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండేందుకు సహాయం చేసే ఐదు కూరగాయలేంటో చూసేద్దాం.

Also Read : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా

Continues below advertisement

బీట్‌రూట్.. 

బీట్‌రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, మొక్కల ఆధారిత పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఆహారంలో బీట్‌రూట్ చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీనిని సలాడ్ రూపంలో, జ్యూస్‌గా లేదా స్మూతీల్లో కలిపి తీసుకోవచ్చు. 

కీరదోస.. 

కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి హైడ్రేషన్ అందుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా సరైన హైడ్రేషన్ అవసరం. ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు చల్లగా ఉన్న కీరదోస ముక్కలను ముఖంపై పెట్టుకుంటే కొంతసేపు చల్లదనంగా, తాజాగా అనిపిస్తుంది. కళ్ల చుట్టూ ఉండే వాపును కూడా తాత్కాలికంగా తగ్గించడంలో చల్లటి కీరదోస ముక్కలు సహాయపడతాయి. 

Also Read : పార్లర్​లో ఫేస్ క్లీన్‌అప్ చేయించుకోవడం మంచిదా? ఫేషియల్ చేయించుకుంటే బెటరా?

టమాటా.. 

టమాటాల్లో విటమిన్ సి, లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటాయి. ముఖ్యంగా లైకోపీన్ శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో లైకోపీన్‌కు కొంత హెల్ప్ చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే టమాటాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. పప్పు, చారు, కూరలు, సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు. కొందరు టమాటా గుజ్జును ముఖానికి ఫేస్ ప్యాక్‌లా ఉపయోగిస్తారు.

బంగాళాదుంప.. 

ముఖంపై నల్లటి మచ్చలు, ట్యాన్ తగ్గించుకోవడానికి బంగాళాదుంపను ఉపయోగించడం చాలామందికి తెలిసిన ఇంటి చిట్కా. బంగాళాదుంప రసాన్ని దూదితో ముఖానికి రాయడం, పలుచటి ముక్కలను కళ్ల చుట్టూ పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. కొందరు బంగాళాదుంప రసంలో బియ్యప్పిండి, అలోవెరా జెల్ కలిపి ఫేస్ ప్యాక్‌లా ఉపయోగిస్తారు. 

Also Read : అరటిపండు ఫేస్ మాస్క్.. ఇంట్లోనే మెరిసే, హెల్తీ స్కిన్ కోసం సులభమైన DIY చిట్కాలు

క్యారెట్.. 

క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరం దీనిని విటమిన్ ఎగా మార్చుకుంటుంది. ఈ విటమిన్ చర్మ కణాల సాధారణ పెరుగుదలకు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరం. అందుకే క్యారెట్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. సలాడ్‌గా, కూరగా, సూప్‌గా లేదా నేరుగా తినవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కేవలం కూరగాయలు తినడం లేదా ఫేస్ ప్యాక్‌లు వేసుకోవడం వల్ల చర్మ సమస్యలన్నీ పరిష్కారం కావు. కానీ ఈట్ క్లీన్ టెక్నిక్ ఫాలో అయితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే కొత్తగా ముఖానికి ఏదైనా అప్లై చేయాలనుకుంటే కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి మళ్లీ అప్లై చేయాలి. శరీరానికి అవసరమైనంత నీరు తాగాలి. కూరగాయలతో పాటు పండ్లు, నట్స్, ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

Also Read : కళ్ల కింద నెయ్యి రాస్తే బ్లాక్ సర్కిల్స్ తగ్గుతాయా? ప్రతిరోజూ రాత్రి అప్లై చేస్తే కలిగే లాభాలివే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.